Sunday, September 26, 2010

శ్రీదేవి పెళ్ళి - ఓ అద్భుత కళాసృష్టి

1980 లలో ఆంధ్రదేశాన్ని నవ్వుల్లో ముంచెత్తింది "శ్రీదేవి పెళ్ళి". మిమిక్రీ ప్రసాద్ అనే కళాకారుడు రూపొందించిన హాస్యవల్లరి ఇది. రావుగోపాలరావు పెళ్ళిపెద్దగా, శ్రీదేవి - చిరంజీవిల పెళ్ళికి హాజరయిన తెలుగు నటీనటులతో ఓ అద్భుతమైన కళాసృష్టి చేసిన ఈ ప్రసాదు గారి గురించి ఎవరికైనా వివరాలు తెలుసా?

రేడియోచిల్లీ లో శ్రీదేవి పెళ్ళి వినండి :

Saturday, September 25, 2010

కవిత్వం - సమాంతర వ్యవస్థలు

అఫ్సర్ గారి అక్షరంలో, ఇంటర్నెట్ లో తెలుగు సాహిత్యంపై చర్చ జరుగుతున్న సందర్భంగా, ఆవకాయలో గతంలో ప్రచురింపబడిన సంపాదకుల వ్యాసం :

పొద్దు.నెట్ లో ఇటీవలనే శ్రీ కామేశ్వర రావు గారు ఇంటర్నెట్ కవిత్వ వ్యవసాయం పై చక్కటి వ్యాసం వ్రాసారు. ఆ వ్యాసంలో కామేశ్వర రావుగారు పేర్కొన్న విషయాలలో కొన్నింటి పై మా అభిప్రాయాల్ని ఈ వ్యాసంలో పొందుపరుస్తున్నాము.

సమకాలీన కవితా రంగం రెండు సమాంతర వ్యవస్థలుగా విడిపోయే ప్రమాదమున్నదని కామేశ్వర రావు గారు పేర్కొన్నారు.

ఇంటర్నెట్ వాడే పాఠకులు పత్రికల్ని, సాహిత్య సంచికలనీ చదవకపోతే ఇది ప్రమాదమే. దినపత్రికలు వారి వారి ఇంటర్నెట్ పత్రికలను నడుపుతూ ఉండడం, తమ తమ అచ్చు పత్రికల్లో వచ్చిన (అన్ని ప్రక్రియల) సాహిత్యాన్ని ఈ-పత్రికల్లో ఉంచడం వల్ల కామేశ్వర రావు గారు పేర్కొన్న చీలికను కొంత వరకూ నివారించగలుగుతున్నారు.

ఇంటర్నెట్ లో మంచి కవిత్వం వ్రాస్తున్నా అచ్చులో కనబడని కవుల గురించి ప్రస్తావించి కామేశ్వర రావు గారు ఓ మంచి విషయాన్ని వెలికిదీసారు. ఎందుకిలా జరుగుతోంది? అన్నదానికి అచ్చు పత్రికల నిర్వాహకులు విశ్లేషించాలి.

తెలిసిన మేరా తరచి చూస్తే, ప్రచురణలోని ఆలస్యం , ప్రచురింపబడిన తరువాత పాఠకుల అభిప్రాయాలు వెంటనే తెలియకపోవడం, పేరుమోసిన కవులకే అగ్రపీఠం వేసే తత్త్వం , కొండకచో రాజకీయాలు ఇంటర్నెట్ కవుల్ని అచ్చు పత్రికలనుండి దూరంగా ఉంచుతున్నాయనుకుంటాము.

Thursday, September 9, 2010

సామాన్యుల పోరాటం కాదిది, మేధావుల పోరాటం - దళిత తీవ్రవాదం







* * *
పైన ఉటంకించిన వ్యాఖ్యలు చాలు, దళిత తీవ్రవాదాన్ని ఎగదోయడానికి కుహాన దళిత కామెడీ మేధావులు చేస్తున్న ప్రయత్నాలు అర్ధం చేసుకోటానికి.

శతాబ్దాల క్రితం జరిగిన అణచివేతకు, వివక్షకు ఈరోజు ఎవరిని బాధ్యుల్ని చేస్తారు? ఇకపైగా, ఆనాటి వివక్షను ఖండించి, దళితుల శ్రేయస్సు కోసం చట్టాలు చేసి, చర్యలు చేపట్టడం శాంతి మంత్రాలు జపించటమట! అంటే, దళితుల సంక్షేమం కోసం చట్టాలు చేసినా కయ్యానికి కాలుదువ్వటమే దళిత పోరాటపు ఏజెండా అన్నమాట!

అసలు దళిత ధిక్కారం మొదలయ్యింది ఈ రోజు కాదు. ధిక్కార స్వరాన్ని వినిపించింది అంబేద్కర్. దళిత పోరాటం మొదలేసింది ఈరోజు కాదు. మహాత్మా గాంధి, మహాత్మా ఫూలేలు ఆనాడే పోరాటం చేసారు. కాబట్టే, దళిత సంక్షేమమే ధ్యేయంగా ప్రత్యేక చట్టాలు రూపొందాయి. దళిత చట్టాలు సరిగా అమలుకాలేకపోతున్నాయంటే, దానికి కారణాలు వెదకాలి. దానికి కూడా అగ్రవర్ణాలని బాధ్యుల్ని చేయటం ఏమిటి?

ఒకటి మాత్రం నిజం. ఇస్లామిక్ తీవ్రవాదం, కాషాయ తీవ్రవాదం మూర్ఖులు నడుపుతున్నవే. అందుకే అవి హింసాత్మకంగా జరుగుతున్నాయి. కానీ, సోకాల్డ్ కుహానా దళిత మేధావుల నేతృత్వంలో మొదలైన దళిత తీవ్రవాదంలో అక్కడక్కడ తప్పించి రక్తం పారదు. కేవలం, ప్రజాస్వామికంగా చాపకింద నీరులా సామాన్య దళితుల మనసులను కలుషితం మాత్రమే చేస్తుంది. వర్గ వైషమ్యాలు పెచ్చరిల్ల చేస్తుంది. అగ్రవర్ణాల వారిని పొమ్మనకుండా పొగ బెడుతుంది. ప్రభుత్వాలు ఉపేక్షిస్తే, ఈ తీవ్రవాదం రేపు ఓ దళితస్తాన్ కావాలనే వరకు ఖచ్చితంగా కొనసాగుతుంది.

ఏ తీవ్రవాద సంస్థ అయినా వారి పోరాటానికి చెప్పే సాకులు అస్తిత్వం, అణచివేత, ఆత్మగౌరవం. ఈ దళిత తీవ్రవాదానికి కూడా ఈ సాకులే ఊతం. నిజానికి, ఈ దళిత తీవ్రవాదం సామాన్య దళితుల పోరాటం కాదు. దళిత మేధావుల పోరాటం.

అస్తిత్వం : ఇప్పుడు దళితుల అస్తిత్వానికి వచ్చిన ముప్పేమిటి? శతాబ్దాల క్రితం నాటి వివక్ష ఈరోజుల్లో ఉందా? ఈ కామెడీ మేధావుల ప్రకారం అస్తిత్వం అంటే, వారికి అధికారం కట్టబెట్టటం. దళితపోరాటం పేరుతో కోట్లు కూడబెట్టుకునే మాయావతులని, పాశ్వాన్ లని ప్రధానులుగా చేయటం!

అణచివేత : ఈ కామెడీ మేధావుల ప్రకారం అణచివేత అంటే, అయినదానికి, కాని దానికీ అగ్రవర్ణాలను నిరసించటం, వారిని అణచివేయటం. అంటే, చరిత్రను పునరావృతం చేయటం. గతంలో వారు ఏ అణచివేతకు గురయ్యారో, అదే అణచివేతను అగ్రవర్ణాలపై అమలు చేయటం. అసలు ఆ మాటకొస్తే, ఇప్పుడు మన దేశంలో ఒక్క రాజకీయ వర్గం తప్పించి మిగిలిన వర్గాలన్నీ అణచివేతకు గురౌతున్నవే.

ఆత్మగౌరవం : ఓ దళితుడిగా నేను వ్రాసిన కవిత బాగోలేదంటావా, అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరించే మేధావులు, దళితుల ఆత్మగౌరవం కాపాడటమే ధ్యేయంగా రూపొందించిన అట్రాసిటీ చట్టాలు సామాన్య దళితుల వరకు చేరవేయటంలో ఎంత వరకు కృషి చేస్తున్నారు? చట్టాలు అమలు చేయటంలోని విధివిధానాలలో ఉన్న లోపాలు ఏనాడైనా చర్చించారా?

ఈ దళిత కామెడీ మేధావులు నియో దళితిస్టు భావజాలంతో చేస్తున్న పోరాటం ఏమిటి? కాశ్మీర్ ను పాకిస్తాన్ కు, అరుణాచల్ ను చైనాకు ఇచ్చేయమనా ఈ పోరాటంఒక వ్యక్తిని వ్యక్తిగా విమర్శిస్తే, మా సమూహాన్ని విమర్శిస్తావా అని ధర్నాలకు దిగటమా పోరాటం? హిందువుల ఇతిహాస పురాణాలను అవహేళన చేయటమా పోరాటం? ఉన్మాదంగా, దేవతల నగ్న చిత్రాలను ప్రదర్శించి హిందువుల నమ్మకాలను నవ్వులపాలు చేయటమా పోరాటం? సభలు, సమావేశాల పేరుతో మందిని పోగుచేసి వాళ్ళ ఆలోచనలు కలుషితం చేయటం తప్పించి, దళితుల్లో నిరక్షరాశ్యత ఇంకా ఎందుకని తగ్గలేకపోతుందో, చట్టాలపై వారికున్న అవగాహనని ఎలా పెంపుచేయాలో అనే విషయాలపై ఇంతవరకూ ఈ కుహానా మేధావులెవరైనా ఆలోచనాత్మకమైన దృక్ఫధాన్ని చూపారా?

నిజానికి ఈరోజు, సామాన్య దళితులకు ముప్పు పొంచి ఉన్నది అగ్రవర్ణాల వల్ల కాదు. ఈ కామెడీ మేధావుల వల్లే ప్రమాదం. ఎందుకంటే, ఆనాడు అగ్రవర్ణాల వారు తమ దౌష్ట్యాన్ని ప్రదర్శించటానికి దళితులను వాడుకుంటే, ఈనాడు తమ స్వార్ధం కోసం ఈ దళిత మేధావులు వారిని పావులుగా చేస్తున్నారు. ఈ మేధావులు ఆశించినట్లుగా దళిత ఆత్మగౌరవ పోరాటం వీధిపోరాటాలుగా దిగజారితే, అసువులు కోల్పోయేది ఈ మేధావులు కాదు.

ప్రభుత్వాలు ఇకనైనా కళ్ళు తెరవాలి, కొరడా ఝళిపించాలి.