చీకటి గుయ్యారం ఈ సమాజం
మంచి చేస్తానంటే
మౌనంగా వింటారు
దీపం తెమ్మంటే
పక్కవాడిని చూస్తారు.
పావులా కింద పడితే మాత్రం
పది తలలు తిరుగుతాయి
నరికేస్తానంటే, భయపడి
పది జతల కాళ్ళు పరుగెడతాయి
సిగ్గులేకపోతే సరి!
కూసిన్ని నిజాలు, కూసింత నిజాయితీగా, వెరసి కూ.ని. కవిత్వం :)
Showing posts with label సామాజిక కవితలు. Show all posts
Showing posts with label సామాజిక కవితలు. Show all posts
Saturday, January 12, 2008
కూ.ని. కవితలు 05
రెక్కలు కొడుతూ రెప్పలార్పని కాకి
పక్కకు తిరిగి పారిపోయిన పావురం
కత్తులు నూరే కొమ్మల చప్పుడు
ఎన్ కౌంటర్ ఖాయం
భయమెందుకు?
రెల్లుపొదలో పాము బుసలా
గుండె చప్పుడు
కాటేస్తా, నన్ను కవ్విస్తే
కుబుసం విడిచిందిప్పుడే.
కూసిన్ని నిజాలు, కూసింత నిజాయితీగా, వెరసి కూ.ని. కవిత్వం :)
పక్కకు తిరిగి పారిపోయిన పావురం
కత్తులు నూరే కొమ్మల చప్పుడు
ఎన్ కౌంటర్ ఖాయం
భయమెందుకు?
రెల్లుపొదలో పాము బుసలా
గుండె చప్పుడు
కాటేస్తా, నన్ను కవ్విస్తే
కుబుసం విడిచిందిప్పుడే.
కూసిన్ని నిజాలు, కూసింత నిజాయితీగా, వెరసి కూ.ని. కవిత్వం :)
కూ.ని. కవితలు 04
బిచ్చమడిగిందో బొచ్చులేని కుక్క
పెంచుకోతగ్గదైతే ఓ బిస్కెట్ వేసేవాడే
కనీసం ఓ ముద్దైనా వేసేవాడే
మరీ వీధి కుక్కై పోయింది.
గొడ్డలి తెచ్చాడు వాడు
నరికేస్తాడట ఈ నగరాన్ని
కాల్చి నాశనం చేస్తాడట
కుక్కకు ఆశ్రయం ఇచ్చిన మహానగరాన్ని.
కూసిన్ని నిజాలు, కూసింత నిజాయితీగా, వెరసి కూ.ని. కవిత్వం :)
పెంచుకోతగ్గదైతే ఓ బిస్కెట్ వేసేవాడే
కనీసం ఓ ముద్దైనా వేసేవాడే
మరీ వీధి కుక్కై పోయింది.
గొడ్డలి తెచ్చాడు వాడు
నరికేస్తాడట ఈ నగరాన్ని
కాల్చి నాశనం చేస్తాడట
కుక్కకు ఆశ్రయం ఇచ్చిన మహానగరాన్ని.
కూసిన్ని నిజాలు, కూసింత నిజాయితీగా, వెరసి కూ.ని. కవిత్వం :)
కూ.ని. కవితలు 03
అమీర్ ఖాన్, ఐశ్వర్యా రాయ్
సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్
పది రూపాయలకే
దాహం తీరుస్తారుట!
ఎంత అదృష్టం!!
రూపాయ్ పొదుపు కోసం
పడుతూ లేస్తూ పరుగెడతావ్
నష్టజాతకపు వెధవా!
పది రోజుల పొదుపుతో
నీ పిల్లాడి దాహమైనా తీర్చు.
కూసిన్ని నిజాలు, కూసింత నిజాయితీగా, వెరసి కూ.ని. కవిత్వం :)
సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్
పది రూపాయలకే
దాహం తీరుస్తారుట!
ఎంత అదృష్టం!!
రూపాయ్ పొదుపు కోసం
పడుతూ లేస్తూ పరుగెడతావ్
నష్టజాతకపు వెధవా!
పది రోజుల పొదుపుతో
నీ పిల్లాడి దాహమైనా తీర్చు.
కూసిన్ని నిజాలు, కూసింత నిజాయితీగా, వెరసి కూ.ని. కవిత్వం :)
కూ.ని. కవితలు 02
చేతిలో బ్యాగు
బ్యాగులో పుస్తకం
పుస్తకంలో పాఠాలు
టిఫిన్ బాక్సు
వాటర్ బాటిల్
బ్రతకనేర్చే పాఠం
మోతబరువే నేర్పిందిగా!
చించిపారేయ్ చదువుని
బ్రతకటం మొదలేయ్
మోతుబరివైతే కాదుగా.
కూసిన్ని నిజాలు, కూసింత నిజాయితీగా, వెరసి కూ.ని. కవిత్వం :)
బ్యాగులో పుస్తకం
పుస్తకంలో పాఠాలు
టిఫిన్ బాక్సు
వాటర్ బాటిల్
బ్రతకనేర్చే పాఠం
మోతబరువే నేర్పిందిగా!
చించిపారేయ్ చదువుని
బ్రతకటం మొదలేయ్
మోతుబరివైతే కాదుగా.
కూసిన్ని నిజాలు, కూసింత నిజాయితీగా, వెరసి కూ.ని. కవిత్వం :)
కూ.ని. కవితలు 01
నాచుకు పేరుకు పోయి
నల్లగా ఉంది కోనేటి నీరు
పొగచూరిన అద్దంలా
మసకబారినట్లున్నమహా నగరం.
నాచేగా తీసిపారేశావ్
అద్దంలా మెరుస్తున్నది కోనేరు.
మసేగా అని తుడిచిపారేస్తే
మహానగరమే మాయమౌతుందేమో!
*కూసిన్ని నిజాలు, కూసింత నిజాయితీగా, వెరసి కూ.ని. కవిత్వం :)
నల్లగా ఉంది కోనేటి నీరు
పొగచూరిన అద్దంలా
మసకబారినట్లున్నమహా నగరం.
నాచేగా తీసిపారేశావ్
అద్దంలా మెరుస్తున్నది కోనేరు.
మసేగా అని తుడిచిపారేస్తే
మహానగరమే మాయమౌతుందేమో!
*కూసిన్ని నిజాలు, కూసింత నిజాయితీగా, వెరసి కూ.ని. కవిత్వం :)
Friday, January 11, 2008
చెత్త కాగితం
కాలాన్ని సిరాగా పోసి
కాగితంపై
ఎక్కించిన అక్షరాలు
జారిపోయి రాలిపోతే
కాగితానికి ఇచ్చే బిరుదు
చెత్త అని
నిస్తేజమైన నిజాలు
విప్పిచెప్పి
విప్లవించమనే అక్షరాలు
మసకబారి మాసిపోతే
కాగితానికి ఇచ్చే బిరుదు
చెత్త అని
చెత్తకాగితం
తిప్పి చూడు
చరిత్రను తిరిగి చెబుతుంది
చెదలుపట్టిన
చిత్తుకాగితం
చేదు నిజాలను
విప్పి చెబుతుంది
కాగితంపై
ఎక్కించిన అక్షరాలు
జారిపోయి రాలిపోతే
కాగితానికి ఇచ్చే బిరుదు
చెత్త అని
నిస్తేజమైన నిజాలు
విప్పిచెప్పి
విప్లవించమనే అక్షరాలు
మసకబారి మాసిపోతే
కాగితానికి ఇచ్చే బిరుదు
చెత్త అని
చెత్తకాగితం
తిప్పి చూడు
చరిత్రను తిరిగి చెబుతుంది
చెదలుపట్టిన
చిత్తుకాగితం
చేదు నిజాలను
విప్పి చెబుతుంది
Tuesday, January 8, 2008
చరిత్ర
తవ్వి తలకెత్తుకున్న
ఘనచరిత్ర
కుష్టురోగి కాయంలా
కంపుకొడుతోంది.
రేపటి తరంతో
రమింపజేయటానికి
మోసుకెళుతున్నాం
ఈ పాతివ్రత్య భారాన్ని
దుర్గంధం భరించటం
కష్టంగా ఉంది
అత్తరుబుడ్డి ఇచ్చి
అగరొత్తులు
వెలిగిస్తారా ఎవరైనా?
ఘనచరిత్ర
కుష్టురోగి కాయంలా
కంపుకొడుతోంది.
రేపటి తరంతో
రమింపజేయటానికి
మోసుకెళుతున్నాం
ఈ పాతివ్రత్య భారాన్ని
దుర్గంధం భరించటం
కష్టంగా ఉంది
అత్తరుబుడ్డి ఇచ్చి
అగరొత్తులు
వెలిగిస్తారా ఎవరైనా?
శాంతి సందేశం
కాలం లోతులు
తవ్వి చూసాను
రాలిపడిన చినుకుల్లా
చెదిరిపడిన
స్వప్నశిథిలాల్లో
ఊపిరందక
గతం గొంతు
మూలుగుతోంది.
కాలం అంచున
తరచి చూస్తున్నాను
రంగు వెలసిన
ఇంద్రధనువును
అలుముకున్న నల్లటినీడల్లో
సమాధి చేయబడుతున్న
వెలుగు శకలాలు
కనిపిస్తున్నాయి.
అనుభవాల ఆస్తిగా
మిగిలిన
అస్తిపంజరాల సాక్షిగా
హాలాహల జ్వాలల్లో
ఛిద్రమౌతున్న
రేపటి భవితపై
నమ్మకం కలగటంలేదు
గతం గొంతు
నులమలేను
సమాధుల పునాదులు
పెకిలించలేను
నిరాశావాదిని కాను నేను
యథార్ధాన్ని కాదనలేను
విశ్వమానవుడిలో
వీగిపోతున్న
శాంతి సందేశాన్ని నేను
తవ్వి చూసాను
రాలిపడిన చినుకుల్లా
చెదిరిపడిన
స్వప్నశిథిలాల్లో
ఊపిరందక
గతం గొంతు
మూలుగుతోంది.
కాలం అంచున
తరచి చూస్తున్నాను
రంగు వెలసిన
ఇంద్రధనువును
అలుముకున్న నల్లటినీడల్లో
సమాధి చేయబడుతున్న
వెలుగు శకలాలు
కనిపిస్తున్నాయి.
అనుభవాల ఆస్తిగా
మిగిలిన
అస్తిపంజరాల సాక్షిగా
హాలాహల జ్వాలల్లో
ఛిద్రమౌతున్న
రేపటి భవితపై
నమ్మకం కలగటంలేదు
గతం గొంతు
నులమలేను
సమాధుల పునాదులు
పెకిలించలేను
నిరాశావాదిని కాను నేను
యథార్ధాన్ని కాదనలేను
విశ్వమానవుడిలో
వీగిపోతున్న
శాంతి సందేశాన్ని నేను
Thursday, January 3, 2008
గుత్తికొండబిలం
మట్టిలో కాదు
నెత్తురులో జన్మించాను
మట్టిలో కాదు
నెత్తురోడుతూ మరణిస్తాను.
ఘనీభవించిన కన్నీటికి
నెత్తురిచ్చిన రూపం నాది
గుట్టలుగా కాల్చబడ్డ
రుధిరజ్యోత్స్నల తేజం నాది
మూడున్నర దశాబ్దాల
నిర్బంధానికి, నిషేధానికి
ఊపిరి బిగపట్టుకున్న
గుత్తికొండ బిలాన్ని.
మరతుపాకుల మోతకి
కాలి గజ్జెలు ఘల్లుమంటాయి
ఎన్ కౌంటర్ తూటాని
గుండె కదుముకుంటాను.
సమాజసేద్యానికి
పేగులు తెంచుకొని
పిడికిలి బిగించిన
కొమరయ్యలు, మజుందార్లు
కామ్రెడ్లు, ఆశయాలు
చదును చేయని గతం పొరలు
చీల్చుకొచ్చిన కలుపు మొక్కలు
మంత్రులు, భూస్వాములు
అధికారాలు, అవకాశాలు
ఆకాశానికి, పాతాళానికి
మధ్యనున్న అగాథాలు...
అవి పూడ్చేటందుకు
అధికారిక చర్చలు!!
విప్లవానికి జోలపాటలా?
ఉక్కుశాసనాల
కరకు మోసమా??
నిదురపోని గతం నాది
నిదురలేని స్వప్నం నాది
ఎదిరించే నైజం నాది
ఎదురులేని నిజం నాది
మట్టిలో కలిసిపోని
ఒకేఒక్క ఇజం నాది
నెత్తురులో ఈదుతున్న
నక్సలిజం నాది.
నెత్తురులో జన్మించాను
మట్టిలో కాదు
నెత్తురోడుతూ మరణిస్తాను.
ఘనీభవించిన కన్నీటికి
నెత్తురిచ్చిన రూపం నాది
గుట్టలుగా కాల్చబడ్డ
రుధిరజ్యోత్స్నల తేజం నాది
మూడున్నర దశాబ్దాల
నిర్బంధానికి, నిషేధానికి
ఊపిరి బిగపట్టుకున్న
గుత్తికొండ బిలాన్ని.
మరతుపాకుల మోతకి
కాలి గజ్జెలు ఘల్లుమంటాయి
ఎన్ కౌంటర్ తూటాని
గుండె కదుముకుంటాను.
సమాజసేద్యానికి
పేగులు తెంచుకొని
పిడికిలి బిగించిన
కొమరయ్యలు, మజుందార్లు
కామ్రెడ్లు, ఆశయాలు
చదును చేయని గతం పొరలు
చీల్చుకొచ్చిన కలుపు మొక్కలు
మంత్రులు, భూస్వాములు
అధికారాలు, అవకాశాలు
ఆకాశానికి, పాతాళానికి
మధ్యనున్న అగాథాలు...
అవి పూడ్చేటందుకు
అధికారిక చర్చలు!!
విప్లవానికి జోలపాటలా?
ఉక్కుశాసనాల
కరకు మోసమా??
నిదురపోని గతం నాది
నిదురలేని స్వప్నం నాది
ఎదిరించే నైజం నాది
ఎదురులేని నిజం నాది
మట్టిలో కలిసిపోని
ఒకేఒక్క ఇజం నాది
నెత్తురులో ఈదుతున్న
నక్సలిజం నాది.
ఎర్రన్నలకో వెర్రిప్రశ్న
ఎనుమాముల వీధుల్లో
ఆకాశం మెడను వంచి
ఎగరేసిన ఎర్ర జెండా
గళమెత్తిన పాట వింటు
గంతులేస్తు గద్దరన్న
గద్దించిన ప్రభుత్వాన్ని
గద్దె మీద పాతేసిన
పెద్దన్నల తీరు చూసి
జారుతున్న గుండెదిటవు
చెబుతున్న హితవు వింటు
మాగాణం అమ్ముకునే
రైతన్నల అణువణువున
అలుముకున్న శోకాన్ని
నిస్సహాయ రోషాన్ని
ప్రజాయుద్ధ భేరితో
సమాయత్తం చేయగలరా?
కరవాలం ఝళిపించి
కలవరాన్ని సృష్టించి
మిణుకుమిణుకు మంటున్న
చిరుఆశలు బుగ్గిచేయు
వరవరాలు, వంగపండు
చలసాని, సత్యమూర్తి
అభిప్రాయబేధాలు
ప్రజారాజ్య మార్గాలా?
ఆశయాలు నమ్ముకొని
పోలీసుల పాడెగట్టి
ఆశయాలు అమ్ముకున్న
పెద్దన్నల జతగట్టి
ప్రజారాజ్యమిస్తారా?
చైతన్యం తెస్తారా?
తెలంగాణా తేగలరా!
ఆల్మట్టి తెరవగలరా?
ఆకాశం మెడను వంచి
ఎగరేసిన ఎర్ర జెండా
గళమెత్తిన పాట వింటు
గంతులేస్తు గద్దరన్న
గద్దించిన ప్రభుత్వాన్ని
గద్దె మీద పాతేసిన
పెద్దన్నల తీరు చూసి
జారుతున్న గుండెదిటవు
చెబుతున్న హితవు వింటు
మాగాణం అమ్ముకునే
రైతన్నల అణువణువున
అలుముకున్న శోకాన్ని
నిస్సహాయ రోషాన్ని
ప్రజాయుద్ధ భేరితో
సమాయత్తం చేయగలరా?
కరవాలం ఝళిపించి
కలవరాన్ని సృష్టించి
మిణుకుమిణుకు మంటున్న
చిరుఆశలు బుగ్గిచేయు
వరవరాలు, వంగపండు
చలసాని, సత్యమూర్తి
అభిప్రాయబేధాలు
ప్రజారాజ్య మార్గాలా?
ఆశయాలు నమ్ముకొని
పోలీసుల పాడెగట్టి
ఆశయాలు అమ్ముకున్న
పెద్దన్నల జతగట్టి
ప్రజారాజ్యమిస్తారా?
చైతన్యం తెస్తారా?
తెలంగాణా తేగలరా!
ఆల్మట్టి తెరవగలరా?
అనామిక డైరీలో ప్రతిరోజూ...
యవ్వనం పొలిమేరల్లో ఉన్నప్పుడే
నాలుగు అక్షింతలు వేసి
ఆంజనేయులుకు కట్టబెట్టారు
ఉత్తేజంతో యవ్వనాన్ని
ఏతమేసి తోడేసరికి
రెండు ఇష్యూలు
ఆపైన, కరీనాలాంటిదాన్ని
కొక్కిరాయినైపోయాను
ఈ అమీర్ ఖాన్ కళ్ళకు!
పేస్టు బాలేదని మారిస్తే,
నా టేస్టు బాగుందన్నవాడే
ఇప్పుడు గీచి గీచి
ట్యూబు కోసిమరీ వాడమంటుంటే
తాజ్ మహల్ గుర్తుకొచ్చి
నవ్వొస్తుంది.
తాజ్ మహలంటే గుర్తొచ్చింది,
టీ పొడి తెమ్మని గుర్తుచేయాలి.
ఎదురెదురు గోడలకి
మేకులు కొట్టి
మంగళసూత్రాన్ని
దండెంగా కట్టి
నా జీవితాన్ని ఎండగట్టిన
పెద్దవాళ్ళంటే కోపంగా ఉన్నా
ఇద్దరాడపిల్లలను చూసి
గమ్మునుండాల్సి వస్తున్నది.
ఏంటో, నాకోసం నేను గడిపే
ఈ పావుగంటలోనూ
ఎన్నెన్నో ఆలోచనలు
సబ్బు కూడా అయిపోయింది
తెమ్మంటే ఏం తెగులో
ఈరోజుకు ఇలా తెమిలేస్తా.
నాలుగు అక్షింతలు వేసి
ఆంజనేయులుకు కట్టబెట్టారు
ఉత్తేజంతో యవ్వనాన్ని
ఏతమేసి తోడేసరికి
రెండు ఇష్యూలు
ఆపైన, కరీనాలాంటిదాన్ని
కొక్కిరాయినైపోయాను
ఈ అమీర్ ఖాన్ కళ్ళకు!
పేస్టు బాలేదని మారిస్తే,
నా టేస్టు బాగుందన్నవాడే
ఇప్పుడు గీచి గీచి
ట్యూబు కోసిమరీ వాడమంటుంటే
తాజ్ మహల్ గుర్తుకొచ్చి
నవ్వొస్తుంది.
తాజ్ మహలంటే గుర్తొచ్చింది,
టీ పొడి తెమ్మని గుర్తుచేయాలి.
ఎదురెదురు గోడలకి
మేకులు కొట్టి
మంగళసూత్రాన్ని
దండెంగా కట్టి
నా జీవితాన్ని ఎండగట్టిన
పెద్దవాళ్ళంటే కోపంగా ఉన్నా
ఇద్దరాడపిల్లలను చూసి
గమ్మునుండాల్సి వస్తున్నది.
ఏంటో, నాకోసం నేను గడిపే
ఈ పావుగంటలోనూ
ఎన్నెన్నో ఆలోచనలు
సబ్బు కూడా అయిపోయింది
తెమ్మంటే ఏం తెగులో
ఈరోజుకు ఇలా తెమిలేస్తా.
Wednesday, January 2, 2008
రాజు
భరణిలో పుట్టాడు
ధరణిని ఏలతాడు
అన్న పూజారి వల్లే
తానో రాజు అయ్యాడని
వాడికి తెలీదు
ఆరో ఏటికే
అమ్మానాన్నకి
అంత్యక్రియలు చేసి
అందరి దయతో రోడ్డునపడ్డ
తానో అనాథ అని
వాడికి తెలీదు
రోడ్డుపక్క గోడమీది
చిరంజీవి బొమ్మ
మరోపక్క పడుకున్న
చిన్న కుక్కపిల్ల
వాడో అనాథ అని
తెలియనీలేదు
అడుక్కున్న డబ్బుతో
ఆర్రూపాయలు
సినిమాకు పెడతాడు
ఒక్కరూపాయితో
రొట్టె తినటం వేస్టని
నమ్ముతాడు
ఎంగిలిబీడీ దొరికితే
వాడికి ఆనందం
ఆ రోడ్డంతా వాడిదే
అరవై పీకలు
వాడి అదనపు ఆదాయం
ప్రతిరోజూ
వర్షం పడితే
కర్షకుల్లా
ఎగిరి గంతేయడు
కసురుకుంటాడు
పడుకునే చోటు మారిందని కాదు
చిరంజీవి బొమ్మ
అక్కడ కనిపించదని
పున్నమి చంద్రుడిని చూసి
భావకవిలానో, ప్రేమరోగిలానో
మురిసిపోడు
చిరాకు పడతాడు
నిద్రకి అడ్డమైందని
అరచేతిలో చిల్లరని
ఆకాశంలో నక్షత్రాలని
పడుకునే ముందు
లెక్కపెట్టుకోవటం
వాడికున్న
రోజువారీ అలవాటు
చేతిలో అగ్గిపెట్టె
వాడి పీక వెలిగిస్తుంది
నక్షత్రాలు
ఆకాశాన్నివెలిగిస్తాయి
చిరంజీవి
వాడి కలలు వెలిగిస్తాడు
వాడు దేశాన్ని వెలిగిస్తాడు
మొత్తానికి దేశం వెలిగిపోతోంది
రోడ్డునపడ్డ రాజు సాక్షిగా
నిద్రలో మునిగిన చీకటి సాక్షిగా
ధరణిని ఏలతాడు
అన్న పూజారి వల్లే
తానో రాజు అయ్యాడని
వాడికి తెలీదు
ఆరో ఏటికే
అమ్మానాన్నకి
అంత్యక్రియలు చేసి
అందరి దయతో రోడ్డునపడ్డ
తానో అనాథ అని
వాడికి తెలీదు
రోడ్డుపక్క గోడమీది
చిరంజీవి బొమ్మ
మరోపక్క పడుకున్న
చిన్న కుక్కపిల్ల
వాడో అనాథ అని
తెలియనీలేదు
అడుక్కున్న డబ్బుతో
ఆర్రూపాయలు
సినిమాకు పెడతాడు
ఒక్కరూపాయితో
రొట్టె తినటం వేస్టని
నమ్ముతాడు
ఎంగిలిబీడీ దొరికితే
వాడికి ఆనందం
ఆ రోడ్డంతా వాడిదే
అరవై పీకలు
వాడి అదనపు ఆదాయం
ప్రతిరోజూ
వర్షం పడితే
కర్షకుల్లా
ఎగిరి గంతేయడు
కసురుకుంటాడు
పడుకునే చోటు మారిందని కాదు
చిరంజీవి బొమ్మ
అక్కడ కనిపించదని
పున్నమి చంద్రుడిని చూసి
భావకవిలానో, ప్రేమరోగిలానో
మురిసిపోడు
చిరాకు పడతాడు
నిద్రకి అడ్డమైందని
అరచేతిలో చిల్లరని
ఆకాశంలో నక్షత్రాలని
పడుకునే ముందు
లెక్కపెట్టుకోవటం
వాడికున్న
రోజువారీ అలవాటు
చేతిలో అగ్గిపెట్టె
వాడి పీక వెలిగిస్తుంది
నక్షత్రాలు
ఆకాశాన్నివెలిగిస్తాయి
చిరంజీవి
వాడి కలలు వెలిగిస్తాడు
వాడు దేశాన్ని వెలిగిస్తాడు
మొత్తానికి దేశం వెలిగిపోతోంది
రోడ్డునపడ్డ రాజు సాక్షిగా
నిద్రలో మునిగిన చీకటి సాక్షిగా
గాయం
ఏ కడలిహోరులో
ఏ కెరటంకరిగిపోయిందో
ఆమె గుండె చేసే అలజడికి
జారిపోతూ...
మానవత్వం
కన్నీరై కారిపోతోంది
ఏ చీకటి మేఘం
ఏ మెరుపుని మింగిందో
ఆమె కన్నీటి చారికల్లో
ఆరిపోతూ...
కంటివెలుగు
మసకబారి మాసిపోతోంది
దారుణ ఆ రణ మారణహోమానికి
తెలియదు ఆ గాయం
కాలే ఆ శవాల ఆశయాలకు
తెలియదు ఆ గాయం
ఏ తల్లీ, ఏ చెల్లీ
మరువలేదు ఆ గాయం
ఏ కెరటంకరిగిపోయిందో
ఆమె గుండె చేసే అలజడికి
జారిపోతూ...
మానవత్వం
కన్నీరై కారిపోతోంది
ఏ చీకటి మేఘం
ఏ మెరుపుని మింగిందో
ఆమె కన్నీటి చారికల్లో
ఆరిపోతూ...
కంటివెలుగు
మసకబారి మాసిపోతోంది
దారుణ ఆ రణ మారణహోమానికి
తెలియదు ఆ గాయం
కాలే ఆ శవాల ఆశయాలకు
తెలియదు ఆ గాయం
ఏ తల్లీ, ఏ చెల్లీ
మరువలేదు ఆ గాయం
Subscribe to:
Posts (Atom)