డెబ్భై ఏళ్ళు పైబడిన వయసులో అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే చేపట్టిన సత్యాగ్రహం నిద్రాణమైన దేశానికి మేలుకొలుపు కావాలి. ప్రభుత్వాలలో అవినీతికి వ్యతిరేకంగా దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న సామాజిక కార్యకర్త అన్నాహజారే తన జీవిత చరమాంకంలో పూరించిన శంఖారావం మరో స్వాతంత్ర్య పోరాటం కావాలి.ఇప్పటికే విదేశాలలో మురిగిపోతున్న లక్షల కోట్ల నల్లధనం, దానికి తోడు బోఫోర్స్ నుండి నిన్నటి స్పెక్ట్రం కుంభకోణం వరకు ఎన్ని లక్షల కోట్లు రాజకీయ నాయకుల, ప్రభుత్వ అధికారుల చేతులు మారిందో బహిరంగ రహస్యమే అయినా, ఏనాడూ, ఏ ప్రభుత్వమూ అవినీతిని అంతమొందించే దిశగా అడుగులు వేయలేదు. ఆరు దశాబ్దాల పైబడిన మన సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంలో అవినీతి నిరోధానికి సరైన చట్టం లేకపోవటం ఒక విషాదమైతే, ఆ వెసులుబాటును ఆధారంగా చేసుకొని తమ అవినీతిని నిరూపించమని సవాళ్ళు విసిరే వ్యక్తులతో మంత్రివర్గాలు నిండి ఉండటం మరో విషాదం. అధికారంలో ఉన్న వ్యక్తుల అవినీతి ఏనాటికి నిరూపించబడదనేది కటిక వాస్తవం.....
No comments:
Post a Comment
మీ అభిప్రాయం :