Thursday, April 14, 2011

అన్నలదారిలో అన్నాహజారే... తెలకపల్లిగారు మీరేమంటారు?

విలేఖరి, విశ్లేషకుడు, కవి, రచయిత అయిన తెలకపల్లి రవి గారు హజారే దీక్ష-హజార్ సవాళ్లు అనే వ్యాసం తన బ్లాగులో ప్రచురించారు. నరేంద్ర మోడి, నితీష్ కుమార్ లను అన్నా హజారే ప్రశంసించటమనే కారణంతోనే, అన్నా హజారే చేపట్టిన ఉద్యమాన్ని చిన్నబుచ్చే ప్రయత్నం చేసినట్లుగా ఈ వ్యాసం చదివిన పాఠకులకు తోస్తుంది.

పురిటిలోనే సంధి కొట్టించేటట్లుగా కొనసాగిన జన లోక్ పాల్ బిల్లు ప్రతిపాదనలు ఎన్ని దశాబ్దాలుగా మనలని మభ్యపెడుతున్నాయో మనకు తెలుసు. ఆ ప్రతిపాదనలకు రూపురేఖలు కలిగిస్తున్న రాజకీయ నాయకుల అవినీతి నేపధ్యమూ తెలుసు. మరి ఇంతకాలం, లోక్ సత్తా, కమ్యూనిస్టులతో సహా ఏ రాజకీయ పార్టీ ఈ అంశంపై ఉద్యమాన్ని ఎందుకని తీసుకురాలేకపోయాయి?

ఎందుకంటే, ఈ పార్టీలన్నీ ఆ తానులోని గుడ్డలే. ఒక సాధారణ సంఘటనగా మొదలైన ఉద్యమానికి ఊహాతీతంగా లభించిన జనస్పందన పాలక, ప్రతిపక్ష పార్టీలకు దిక్కుతోచని పరిస్థితి కలిగించిందనేది వాస్తవం. అవకాశవాద రాజకీయాల్లో దిట్టలైన ఈ నేతలు, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఉద్యమానికి మద్దతు ప్రకటించాల్సి వచ్చింది కానీ, అవినీతిపై వారికి ఉన్న విముఖత కానేకాదు.

తెలకపల్లి గారు ఓ విచిత్రమైన వాదన చేస్తూ ఇలా అన్నారు "వ్యవస్థీకృతమైన అవినీతి మూలాలు చూడకుండా కాయకల్ప చికిత్సలపై కదన శంఖాలు ఎంతగా పూరించడం వేళ్లు వదిలి కొమ్మను విరచిన చందంగానే మిగిలిపోతుంది.”........

1 comment:

  1. అపొలిటికల్ అయిన హజారే కమ్యూనిస్ట్లను పొగడలేదట! మరి మహాపరాధమే కదా! అందులోనూ నరేంద్ర మోడీని పొగిడితే .

    ఇంత బాహాటంగా ఉడుక్కోవటం, లేకిగా తమను పిలవలేదని/ప్రస్తావించలేదని వామనపచ్చాలు బేలగా వాపోవడం .. పాపం అనిపించి, కన్నీరు తెప్పించింది. ఎలా వుండేవాళ్ళు ఎలా అయిపోయారో... విధి బలీయమైనది.

    నేనూ మిగిలినది ఆవకాయ లో.. ;)

    ReplyDelete

మీ అభిప్రాయం :