Tuesday, February 5, 2008

చిన్నచిన్న సంగతులు

1.
కాకి కబుర్లు వింటూ
నిద్రపోయింది
చెట్టు
మధ్యాహ్నం ఎండలో

2.
పిచ్చుకల కిచకిచలు
కప్పల బెకబెకలు
కొలువుదీరినట్లుంది
కొబ్బరి చెట్టు

3.
అల్లిబిల్లి తిరుగుతూనే ఉంది
చందమామ
నాకైతే
కళ్ళు తిరుగుతున్నాయి

4.
తలకిందులుగా
తపసు చేస్తూ
చూరు మీది చినుకు

5.
ఒక్క కుంచెలో
ఎన్నేసి రంగులో
వానలోఊరంతా కొత్తగా


6.
మబ్బుకవి
వ్రాసిన పాతపాటే
ఎప్పుడు విన్నాకొత్తగా

7.
ప్రతి అడుగూ
ఒక మడుగు
మబ్బులు
నడిచే వెళ్ళాయనుకుంటా

8.
పోగేసుకున్న గాలి
పారేసుకుంది కాబోలు
పచార్లు చేస్తుంటే
పలకరించే చెట్టు
మౌనంగా ఉంది ఈరోజు

9.
మంచుబిందువులా నిశ్శబ్దం
ఒలికిపోతుంటే
ఒడిసిపట్టుకుంటూ
నేల నవ్విన అలికిడి
తెల్లవారుతున్నది కాబోలు!

10.
నవ్వుకుంటూ
వెళ్ళింది చీకటి
పొగడపూలు
ఏరుకొద్దామా?

11.
అంత ఐసు ఇంతైనా
అదే తన్మయత్వం
పాప కళ్ళల్లో

12.
అమ్మను కరుచుకున్న
పాపాయిల్లా
బోర్ల బజ్జున్నపారిజాతాలు

13.
అటు వెళ్ళిన చెట్లే
ఎదురొస్తున్నాయి
రైల్లోఇంటికి వెళుతుంటే

14.
ఇల్లంతా నిశ్శబ్దం
ముసుగుతన్నిపడుకున్నట్లుంది
ఇంట్లో సందడి

15.
అటూ ఇటూ జనం
దూరలేక
ఆగింది గాలి
లోకల్ ట్రైనులో

3 comments:

  1. chala chala bavunnayi....ivi chinna sangatulu ela avutayandi...chala pedda anubhootulu mari

    ReplyDelete
  2. Naa chinna tanam antaa meeru raasina 15 chinna sangatulalo imidipoyindemitabbaa!!!

    ReplyDelete
  3. Matti manchu bindvulni erukuvdv sabdam, Matti navvukovadam vanti adbhuta padachitralu .. manasuni ranjimche bahu chakkani anubhootula parimalalu
    ... mounam

    ReplyDelete

మీ అభిప్రాయం :