ఛీత్కారాలు, చీదరింపులు పట్టించుకోని జాతి మన ఆంద్ర కాంగ్రెస్ నాయకజాతి. అధినేత్రి ఆదరించకున్నా ఏమీ అనుకోము. అధినేత్రి అదిలించినా ఆహో ఓహో అనేస్తాం. పదవిని ముష్టిగా పడేస్తుందని దేబిరించుకుంటూ అధినేత్రి అడుగులకు మడుగులొత్తటానికైనా సిద్ధం!
Who is Veerappa Moili? Who is Pranab Mukherji? And who the hell is Sonia Gandhi to decide on తెలంగాణ? అడుక్కుతెచ్చుకోవాల్సిన పరిస్థితా తెలంగాణా రాష్ట్రానిది? ఎన్నుకున్న ప్రజలు ఈ నేతలకందించిన గౌరవాన్ని కాంగ్రెస్ అధినేత్రికి తాకట్టు పెట్టిన కాంగ్రెస్ నాయకులను ఏమనాలి? అంతకు మునుపు ఈ ఛీత్కారసత్కారానికి నోచుకున్నవారే తె.రా.స. నాయకమ్మణ్యులు కూడా.
నీతిలేని నేతలు తెలంగాణాను భుజాలకెత్తుకొని, దేశరాజధానిలో అవమానించిన తీరు తెలంగాణాకు, తెలుగువారికి లజ్జాకరమైన విషయం. ఈ నేతలను కలవడానికే ఇచ్ఛగించని అధినేత్రి, తెలంగాణా ఇస్తుందనే భ్రమలు ఇప్పటికైనా వీరికి దూరమై ఉండాలి.
పరిస్థితి తద్భిన్నంగా ఉంది. చేవ చచ్చిన ఈ నేతలు తెలంగాణా ప్రజలకింకా ఆశలు చూపిస్తూనే ఉన్నారు. మూకుమ్మడిగా ఈ నేతలందరూ రాజీనామాలు చేస్తే, మూలవిరాట్టు కదలిరాదా? ఇంకా ఏం ఉద్ధరించటానికి వీరు పదవులు పట్టుకు వ్రేలాడుతున్నారో ప్రజలకు వీరు చెప్పితీరాలి.
ఒక్క పార్టీతో తెలంగాణ రాదట.
తెలంగాణాకు భా.జ.పా., తె.దే.పా.లే అడ్డంకట.
తాగుడుమైకంలో వీరప్ప వేసే పిల్లిమొగ్గలివి. అంతకు ముందు, రెండో ఎస్సార్సీ తప్పదన్న పెద్దమనిషి ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యానాలేమైనా అర్ధం పర్ధం ఉన్నవేనా?కాంగ్రెస్ తప్ప, ప్రతి పార్టీ తెలంగాణ పై తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించాయి. చాలావరకు పార్టీలు దాదాపుగా ఒప్పుకునే పరిస్థితే. అయినా, ఏకాభిప్రాయసాధన అనటంలో ఉద్దేశ్యమేమిటి? ఇంతవరకూ కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని ఎందుకు బయటపెట్టటంలేదు. ఇండియా గురించే ఏమీ తెలియని సోనియా, తెలంగాణ గురించి ఏం నిర్ణయించగలదు?
ప్రజాస్వామ్యంలో మెజారిటీ అభిప్రాయానికే విలువ అన్న విషయం తెలియని వాజమ్మలా, ఏకాభిప్రాయ సాధన అనే నెపంతో తెలంగాణాను తొక్కేస్తున్నది? సిగ్గులేని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఇంకా ఏం ఉద్ధరించాలని పదవులు పట్టుకొని ప్రాకులాడుతున్నారో అర్ధంకాదు.
తెలంగాణా వారికి తెలుగు వారు అంటే ఆలుసు... (కేసిఆర్ మాటలు తెలుగు వారికి అవమానం కాదా!)
ReplyDeleteడిల్లీ వారికి తెలంగాణా వారు అంటే ఆలుసు...
(ఇంకా ఎంపీల ఆవసరం రాలేదు మరి!)
మహరాష్ట్ర వారికి డిల్లీ వారు అంటే ఆలుసు...
(ఆర్ధిక రంగం అంతా వారిదే మరి!)
నీవు ఏమి ఇతరులకు చేసినావో అదే నీకు పాప్తి బాబు. దానికి ఎందుకు నీకు అంత కసి... ఒకసారి విశ్వకవి రవీంద్రుడు మాటలు గుర్తు చేసుకో .. ప్రాంతీయ విద్వేషాలను రేపకు.
I don't see any sensible reason to seperate Telangana. BJP is playing dirty politics, though they hadly have any strength in the assembly. They are opportunists. Why didn't they seperate Telangana when Jarkhand, uttaranchal, chattisghad was formed? Were they not aware of the issue?
ReplyDeleteRascals now they are playing differant tune.
Have BJP MLAs resign and show way...
ReplyDeleteThose who use resignation to LA as a tool to protest should be barred from contesting for 6years.