Wednesday, February 13, 2008

అమరగాయకునికి అక్షరాంజలి

ముద్దబంతి పూవులో...
నీవేనా నను పిలచినది...
శివశంకరి... శివానందలహరి...
మనసున మనసై, బ్రతుకున బ్రతుకై...
దేవదేవ ధవళాచల...
ఘనాఘన సుందరా...
కుడిఎడమైతే...
జేబులో బొమ్మ...
తెలుగువీర లేవరా...
రాజశేఖరా నీపై...
కనుపాప కరువైన...

పాడాలని పాడేసిన పాటలు కావివి. ఒక్కో పాట ఆణిముత్యమనటంలో నేను కొత్తగా చెప్పేదేమీ లేదు. సినిమా చూసినా చూడకపోయినా, ఆయన పాటలు వింటే చాలు, సినిమా చూసినట్లే అంటే అతిశయోక్తి కాదు. కవి వ్రాసిన కవిత్వాన్ని గొంతుతో చిత్రంగా ఆవిష్కరించగలిగిన నేర్పరి. అందుకే ఆయన, ఆయన గాత్రం అజరామరం.

చాలామంది గాయనీగాయకులకు వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం గా కొన్ని అవకాశాలొస్తాయి. అవి పాడి చరిత్రలో నిలిచిపోతారు. కానీ, పాడిన ప్రతిపాటని లైఫ్ టైం అవకాశంలా మలుచుకుని, పాటలని అవి వ్రాసిన కవులను చిరంజీవులుగా చేసిన ఘంటసాల అపరబ్రహ్మ.

For Complete Article click :http://www.aavakaaya.com/showArticle.aspx?a=li&articleId=395&pageNo=0

1 comment:

  1. "పాటలని అవి వ్రాసిన కవులను చిరంజీవులుగా చేసిన ఘంటసాల అపరబ్రహ్మ."

    భలే చెప్పారు! ఈ పాటలు తల్చుకుంటే ఘంటసాల పాట అని గుర్తొస్తుందే కాని, రచయితా, సంగీత కర్తా గుర్తుకి రారు! టాప్ టెం లిస్టులో ఉండాల్సిన ఇంకో పాట శేషశైలావాస శ్రీవేంకటేశా .. రీతిగౌళ రాగంలో అద్భుతంగా పాడారు.

    ReplyDelete

మీ అభిప్రాయం :