దాదాపు ప్రతి వార్తాపత్రికలోనూ, వెబ్ సైట్లలోనూ తెలంగాణా వాదనతో విద్వేషాలు పొడచూపుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అసలు తెలంగాణా ఎందుకు అవసరమనే విషయాన్ని రాజకీయపక్షాలు వదిలేసి, ఇతర విషయాల మీద యాగీ చేయటంతోనే సమస్య మొదలౌతున్నది. తెలంగాణాను వ్యతిరేకించే సమైక్యవాదుల వాదన కూడా ఇందుకు భిన్నంగా ఏమాత్రమూ లేదు.
సమైక్యవాదుల అభిప్రాయంలో, ప్రత్యేక తెలంగాణా అనేది దేశసమైక్యతను, ఆంధ్రుల ఐకమత్యాన్ని దెబ్బతీస్తుందనేది ముఖ్యమైనది. తెలంగాణా ప్రజలు ప్రత్యేక తెలంగాణా కోరుతున్నారే కానీ, 'ఖలిస్తాన్' తరహాలో ప్రత్యేక దేశాన్ని అడగటంలేదే!
అసలు ఉమ్మడి మద్రాసు నుండి ఆంధ్రప్రదేశ్ విడిపోవటానికి కూడా కారణం, ఆంద్రప్రాంతంపై మద్రాసు నేతలు చూపించిన వివక్షే అనేది చారిత్రక సత్యం. ఇప్పుడు అదే వివక్షతను కారణంగా చూపిస్తూ ప్రత్యేక తెలంగాణా కావాలని కోరుకోవటం తప్పేమిటి?
మొదటి ఎస్సార్సీ 1953లోనే, ఆంద్ర తెలంగాణాలు వేరువేరు రాష్ట్రాలుగా ఏర్పరచాలని ప్రతిపాదించింది.
'...It will be in the interest of Andhra as well as Telangana if, for the present, the Telangana area is constituted into a separate state, which may be known as Hyderabad State, with provision for its unification with Andhra after general elections likely to be held in or about 1961, if by two thirds majority the legislature of the residuary Hyderabad State expresses itself in favour of such unification.'
ఇంకా
'Andhra and Telangana have common interests and we hope these interests will tend to bring the people closer to each other. If, however, hope of the development of the environment and conditions congenial to the unification of the areas do not materialize and if public sentiment in Telangana crystalizes itself against the unification of the two states, Telangana will have to continue as a separate unit.'
కానీ ప్రజాభీష్టానికి, మొదటి ఎస్సార్సీ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా విశాలాంధ్ర ఏర్పడింది. నిజానికి అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కూడా తెలంగాణా - ఆంధ్ర ల సంయుక్తరాష్ట్రానికి వ్యతిరేకమే. విశాలాంధ్ర ప్రతిపాదనను ఆయన 'Tint of Expasionist Imperialism' అని కూడా అన్నారు.
విశాలాంధ్రలో తెలంగాణాకు మొండిచేయి చూపుతారనే ప్రజల అనుమానాల నివృత్తి కోసం 'పెద్దమనుషుల ఒప్పందం' చేసుకున్నారు. ఆ ఒప్పందంలోని ఏ అంశమూ ఇంతవరకూ అమలు చేయలేదు.
తెలంగాణాలో అభివృద్ధి జరిగిందంటూ సమైక్యవాదులు హైదరాబాదునే చూపిస్తారు కానీ, తెలంగాణాలో ఇతర జిల్లాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోరు. ఈనాటికీ, నల్గొండ, సూర్యాపేట ప్రజలకు తాగునీటి సమస్య తీరలేదు.
ఉదాహరణకు, ఆంద్ర రాయలసీమల్లో థర్మల్ విద్యుత్ ఉత్పాదన 7500 మెగావాట్లు. అదే తెలంగాణాలో 1600 మెగావాట్లు థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. విచిత్రమేమిటంటే, ఆంద్ర రాయలసీమలకు బొగ్గును సరఫరా చేసేది తెలంగాణా నుంచే. ఇక్కడ వనరులు దొరుకుతున్నప్పుడు ఇక్కడే అభివృద్ధి చేపట్టవచ్చు కదా!
ఆంద్రప్రదేశ్ అవతరించినప్పటి నుంచి 2001 దాకా దాదాపు 200 బిలియన్ రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఖర్చు పెడితే, తెలంగాణాలో కేవలం 40 బిలియన్ రూపాయలే ఖర్చు పెట్టారు.
ఇవి నేను వండి వడ్డించిన వివరాలు కాదు. 2001 సెన్సస్ ప్రకారం ప్రభుత్వ గెజెట్ లో ప్రకటించిన వివరాలు :
EDUCATION
Literacy Rate (as per 2001 Census)
Coastal Andhra – 63.58 %
Rayalaseema – 60.53 %
Telangana – 58.77 %
National Average - 65.38 %
=============
Enrolled School going children :
Coastal Andhra – 27,57,269 (45.50%)
Rayalaseema – 13,02,673 (21.49%)
Telangana – 20,00,452 (33.01%)
==============
No. of Teachers
Coastal Andhra – 64,314 (48.16%)
Rayalaseema – 28,434 (21.29%)
Telangana – 40,798 (30.55%)
================
Schools of Primary Education :
Coastal Andhra – 25,504 (45.62%)
Rayalaseema – 12,479 (22.32%)
Telangana – 17,918 (32.05%)
While noting the above details, keep in mind the Region-wise population percentage, which is as under :
Coastal Andhra – 41.69 %
Rayalaseema – 17.77 %
Telangana – 40.54 %
చిన్న రాష్ట్రాల వలన రాజకీయ అస్థిరత ఎక్కువౌతుందనేది మరో విమర్శ. పెద్ద దేశం మనది. ఇక్కడి కేంద్ర ప్రభుత్వమే అయిదు సంవత్సరాలు ఉంటుందనే గ్యారంటీ లేదు. ఇక అస్థిరత గురించి మాట్లాడటంలో అర్ధం లేదు. అలానే, గోవా జార్ఖండ్ ల మాదిరిగా చిన్న రాష్ట్రమేమీ కాదు తెలంగాణా.
ఏమైనా రాజకీయ నాయకుల సంకుచిత ప్రయోజనాల కోసం తెలంగాణా బలౌతున్నదనేది వాస్తవం. ప్రత్యేక రాష్ట్రమనేది ఒక రాజకీయ ప్రక్రియే. కానీ, ప్రజలు మార్పును కోరుతున్నారా లేదా అనేది ప్రజాభిప్రాయం ద్వారానే సాధ్యం. ఆ దిశగా ప్రభుత్వం అడుగులేయాలి. అంతేకానీ, ప్రణబ్ ముఖర్జీలు, రఘువంశప్రసాద్ యాదవ్ లు, సోనియా గాంధీల దయాభిక్ష కోసం తెలంగాణా ప్రజలు ప్రాకులాడేలా చేయటం సమంజసం కాదు.
అన్నా! నీవు చూపిన గణాంకాలలో జనాభా దామాషాగా చూస్తే మూడు ప్రాంతాలలో huge difference ఎక్కడుందన్నా. ఒక్కసారి అనంతపురం జిల్లా గ్రామాలలో చూడు. నీటి సమస్య అంటే ఏందో తెలుస్తుంది. మూడు ముక్కలు చేసుకుని నీళ్ళకోసం మూడు ప్రాంతాల తెలుగు వాళ్ళు కొట్టుకుంటుంటే బాగుంటుందా చెప్పు. హైదరాబాదు అభివృద్ధిలో అన్నిప్రాంతాల వారి భాగస్వామ్యంలేదా. ప్రాజెక్టులు పట్టు పట్టి సాధించుకుందాము మన తెలంగాణా కోసం.
ReplyDeleteకోస్తాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థాపించినవి చాలా చాలా తక్కువ. 70 శాతం స్కూళ్ళూ కాలేజీల్ని ప్రైవేటు దాతలు స్థాపించగా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నవే.
ReplyDeleteతెలంగాణా సమస్య సాంస్కృతికమైనది. ఆర్థికం కాదు. తెలంగాణాలో తెలుగు సంస్కృతి పూర్తిగా క్షీణదశకు తేబడింది. మిగతా తెలుగువారితో ఇక్కడి తెలుగువారు మమేకం కాలేకపోవడానికి ఇదే కారణం. This is a culturally impoverished region. అందువల్ల ఈ ప్రాంతం వెనకబడిపోయింది. ముందు సాంస్కృతికంగా బాగుచెయ్యడానికి పూనుకుంటేనే ఆర్థికంగా బాగుచెయ్యగలం. అందుకోసం ముందుగా మనం చెయ్యవలసింది ఇక్కడ ప్రైవేటు భాగస్వామ్యంతో స్కూళ్ళూ కాలేజీలూ స్థాపించడం. సంగీత సాహిత్య నాట్య శిక్షణా కళాశాలల్ని నెలకొల్పడం చెయ్యాలి. కోస్తాలో మాదిరి ప్రతి పట్టణంలోను ప్రచురణ సంస్థలేర్పడాలి. అందుకు ఔత్సాహికుల్ని ప్రోత్సహించాలి. గ్రంథాలయ ఉద్యమాన్ని కూడా చేపట్టాలి.
రెండోది- కోస్తాలో మాదిరే అభివృద్ధిని వికేంద్రీకరించాలి. కోస్తాలో ప్రతి పట్టణానికీ వ్యాపారంలో తనదంటూ ఒక బ్రాండ్ ఉంది. గుంటూరంటే పొగాకు. అనకాపల్లి అంటే బెల్లం. అందువల్ల కోస్తాలో అనేక మహానగరాలేర్పడ్డం సాధ్యమైంది. తెలంగాణా అభివృద్ధిని మొత్తం హైదరాబాదే తినేస్తుంది. ఈ విధానానికి స్వ్వస్తి చెప్పాలి.
కోస్తా ఈ మార్గంలోనే అభివృద్ధికి ఓనమాలు దిద్దుకుంది. తెలంగాణావారు నిరంతరాయంగా కోస్తావారిని ద్వేషిస్తూ వచ్చారు తప్ప వారి అభివృద్ధి నుంచి ఏమీ నేర్చుకోవడానికి ప్రయత్నించలేదు. ఆ నమూనా(model)ని ఇక్కడ అవలంబించాల్సి ఉంది. అప్పుడు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లతో పని ఉండదు.
మూడో విషయం. మన సమైక్యానికి అభివృద్ధిని లక్ష్యంగా పెట్టొద్దు. Development is a very recent political concept, especially in third world countries. European nations heve been united since more than 700 years without any development. మన సమైక్యం బేషరతైనది. మన సమైక్యానికి సమైక్యమే లక్ష్యం. అభివృద్ధి చెందినా చెందకపోయినా ఒక ఇంగ్లండులాగా ఒక జర్మనీలాగా ఒక కొరియాలాగా ఒక జపాన్ లాగా ఎప్పటికీ కలిసే ఉందాం. కోస్తాలో కూడా అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందినవి కావు. అలాంటి ప్రాంతాలవారు ఉపాధి వెతుక్కుంటూ హైదరాబాదు వస్తారు. దీనర్థం ఏమిటంటే ఒకవేళ మన ప్రాంతం అభివృద్ధి చెందకపోతే అభివృద్ధి చెందిన ప్రాంతానికి వలసపోదాం. అన్ని దేశాల్లోను అందరూ చేసేది అదే. అంతే కాని "ప్రత్యేక" నినాదాలు తీసుకురావద్దు. అది ఎవరికీ సుదీర్ఘకాలంలో మంచిది కాదు.
నేను రాసింది తెలుగుజాతిపరంగా ఒక సమగ్ర అవగాహన గురించి. వాస్తవం చెప్పాలంటే మాత్రం ప్రత్యేక తెలంగాణా ఒక స్వప్నం మాత్రమే. అది నెరవేరే అవకాశం లేదు. కనుక దాని గురించి మనం మర్చిపోవడం మంచిది.
There is no point in showing the statistics. There is a saying about statistics, http://en.wikipedia.org/wiki/Lies,_damned_lies,_and_statistics :-)
ReplyDeletePro-Telangana ppl will come up with 100 points why there should be a separate Telangana and the anti also will or can come up with another 100 points why there should not be a separate Telangana.
As far as my thinking is concerned all those who oppose separate Telangana is due to the fear of loosing their investments in Telangana region. If the leaders of separate Telangana can assure that nothing happens to the existing non-Telangana families and their investments, I don't think anyone will object to it.
ఈమాదిరి చర్చలు బ్లాగ్లోకంలో చాలా జరిగాయి. రాగద్వేషాలతో కాక అభివృద్ధి స్పృహతో మాత్రమే ఆలోచిస్తే తెలంగాణా అభివృద్ధికి నోచుకోక పోవడానికి, మిగిలిన ప్రాంతాలు అభివృద్ది (???) చెందడానికీ కారణాలు తెలుస్తాయి. మన సమస్యలకి కారణం అభివృద్ధి చెందినవాళ్ళే అని లేని బూచిని చూపి అసహనాన్ని రేపి రెచ్చగొట్టే నాయకులని నమ్మడం ఆత్మహత్యాసదృశం. తెలుగు వాళ్ళు వెళ్ళి స్థిరపడని చోటుందా. హైదరాబాదు వల్ల చుట్టు పక్కల జిల్లాల్లో ఎన్ని పథకాలు అమలవుతున్నాయో గమనించండి. అభివృద్ధి క్రమంలో ఉత్తరకోస్తా జిల్లాలు ఎంత వెనకబడ్డాయో చూడండి. చివరిగా రాజ్ థాకరే రగులుస్తున్న కాష్టం గమనించండి. వారు మహరాష్ట్రేతరులని ద్వేషిస్తుంటే మన తెలంగాణా సోదరులు సాటి తెలుగు వారిని ద్వేషిస్తున్నారు. వ్వాటేనైడియా దొరా ... బాంఛన్ కాల్మొక్తా..
ReplyDeleteI don't understand how far these statistics are useful in promoting your idea for seperation!
ReplyDeleteFor example , percentage of primary schools is in-line with children enrolled. You want schools should be constructed irrespective of the demand?
Coal: What a logic! Uranium mines are in Bihar, you mean all atomic reactors should be in & around Bihar? same is with Copper, Aluminum mines!
As per your logic, Godavari's birth place is in Maharashtra, should we stop it flowing out of the state?! :))
These idiots KCR , Narendra started their agitation by calling people of other regions as 'valasa vaadulu'/' dOpiDidaarulu' and with threats to kill non-Telanganaite telugu people ( not other indians fyi.. )
BJP taken-up this issue with the hope that they can flick few seats in Telangana as they have no existance in rest of Andhra! If these idiots are so concerned, why didn't they seperate at the same time Bhihar , MP were split? Were these statistics not available to them?
Whos interests the seperation is going to serve? Please think. What about MNS stand on North-Indians? Do you support it? Then these Telangana movement is clearly against other andhraites.
What was done by Telangana CMs, ministers & even PM in the past that these TRS jokers want to develop now!! It is only self-development.
They used to make lot of noise on underdevelopment, now they are not talking of it.. they now say there is sentiment and we should have it! TamilNadu people also have sentiment for Tamil-ElAM with parts of SriLanka including Tamilnadu! Should we succumb to their sentiments?
Rayalaseema is no better than Telangana as per your statistics, you want to cut& give the cake for them too? Nonsense!