ఇంతకి అసలు విషయం మన అసెంబ్లీలో నేతల ప్రవర్తనో, ప్రభుత్వంలోని అవినీతో కాదు। ప్రత్యేక తెలంగాణా కోరుకోవటంవల్ల నలుగురి దృష్టిలో పలచనైపోయామని ఈయన బాధ. తెలంగాణా డిమాండు వల్ల, తెలుగుజాతి ప్రతిష్ట దెబ్బతిందట! తెలంగాణా వాదులు ప్రపంచవేదికపై తెలుగుజాతిని బట్టలువిప్పి బద్నామ్ చేసారట! ప్రాంతీయ ఉన్మాదంతో తెలంగాణా వాదులు, నోళ్ళకే పని చెబుతున్నారు కానీ, మెదళ్ళకు కాదని అంటూ, తమ నోటి తీటను నెట్లో వ్రాతలతో ఈయన తీర్చుకున్నారులా ఉంది॥ ఇంకా ఈ వ్యాసంలో తెలుసుకోవాల్సింది, ప్రత్యేక తెలంగాణా కేవలం ఏడు సంవత్సరాల ఉద్యమమని!!
అంతటితో ఆగదు ఆ తీట। శాపనార్ధాలతో కొనసాగుతుంది. పరిస్థితులు ఇలానే ఉండవుట. తెలుగుజాతికి మంచిరోజులు వస్తాయట. అవి రావాలంటే, నిజాం కాలంలో పుట్టిన ముసలివాళ్ళంతా చావాలట! వీళ్ళందరూ ఆకు తొలిచే పురుగులు, తెలుగుజాతికి పట్టిన కాన్సర్లు నట.
ఈయన పెట్టినంతగా, ఆ ఒరియా పెద్దమనిషి కూడా బహుశా ఇన్ని తిట్లు, బూతులు, శాపనార్ధాలు పెట్టి ఉండరు. ఒరియావాడు తెలుగువాళ్ళనేదో అన్నాడని, కన్నీళ్ళ పర్యంతమైన పెద్దమనిషి తను మాత్రం తోటివాళ్ళపై కారుకూతలు కూయొచ్చా?
ఈ వ్యాసం చదివి ఒకరు 'ఆనాడు నెహ్రు కూడా తెలంగాణా కలసి ఉండలేని పక్షంలో విడిపోవచ్చని నిజామాబాద్ సభలో ప్రకటించారు' అని ఓ వ్యాఖ్య వ్రాస్తే, దానికి ఈ మేధావిగారు ఇచ్చే సమాధానం విచిత్రం। ఈయన అంటారు 'నెహ్రూ ఇలా అన్నాడని చెబుతున్నవాళ్ళు ఆ అన్న మాట ఎక్కడుందో ఎవరు ఆమాటని ఆ రోజుల్లో ఏ పత్రికలో ప్రచురించారో ఆధారాలు చూపించలేకపోయారు. ఊరికే పుకార్లు వ్యాపింపజెయ్యడం తప్పిస్తే !' అని ప్రకటించారు.
అయ్యా, ఇక్కడ రెండు విషయాలు గమనించాలి। ఆనాడు నెహ్రూ అన్న మాటలు ఏ వార్తా పత్రికలో వచ్చిందో చెబితే, అది కూడా పుకారు, తారీఖు చెప్పమంటారు. తారీఖు చెబితే, ఆ 'క్లిప్పింగ్' ఆధారంగా చూపించమంటారు. (నెహ్రూ చెప్పిన మాట, 17-అక్టోబరు-1953 ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో వచ్చింది. )
రెండో విషయం, ఆ ఒరియా పెద్దమనిషి ఎక్కడ తెలుగుజాతిని నానామాటలు అన్నాడో చెప్పమంటేనే, ఆ లింకు చూపలేని మీరు ఎప్పుడో 50వ దశకంలో నెహ్రూ అన్న మాటకు ప్రమాణం చూపమని అడగటంలో అర్ధం లేదు।
మాట్లాడితే, తూర్పు పశ్చిమ జర్మనీల ఉదాహరణ ఊదరగొడతారు। చెకొస్లోవేకియా గురించి అడిగితే మారు మాట్లాడరు.పాడిందే పాటరా.... అన్నట్లు, తెలంగాణావాదులు ప్రజల ఎమోషన్లను, సెంటిమెంటును రాజేస్తున్నారని విమర్శించే మీరు మాత్రం, సమైక్యవాదన పేరుతో చేసే ఈ అర్ధరహిత వాదనవల్ల ఏం సాధిస్తున్నారు। సమైక్యవాదన పేరుతో తమరు మాత్రం ప్రజలను రెచ్చ కొట్టటంలేదా? తెలుగుజాతి విడిపోకూడడదు, సమైక్యంగా ఉండాలని చేసే ఉద్బోధలే తప్ప, తెలంగాణా కలసి ఉండటంవల్ల కలిగే లాభాలేంటి, విడిపోతే నష్టాలేంటి అనే దానికి మాత్రం సమాధానం ఉండదు. పాడిందే పాటగా మరి.
తెలంగాణావాదులు, మేధావులు అవకాశవాద రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలౌతున్నారని విమర్శించే తమరు, ఏ రాజకీయనాయకుల చేతిలో కీలుబొమ్మలు?
అయ్యా, తెలంగాణా రాదని మీరిచ్చే పిల్లి శాపాలవల్లనో, తెలంగాణా రావాలని కె.సి.ఆర్. చేసే చండీయాగాలవల్లనో పనులు సాగవు. మునుపు చెప్పినట్లుగానే, తెలంగాణా ప్రజల ఉద్యమం. ఇందులో నేతలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఉద్యమం ఆగదు.
http://www.aavakaaya.com/showArticle.aspx?a=li&articleId=471&pageNo=0
ఆ పెద్దాయన నోటి దురదని నేనూ గమనిస్తున్నా. తెలుగు బ్లాగులన్నింటిలోకీ ఇతనొక్కడే సభ్యత లేకుండా రాస్తాడు. ఊరుత్తరమంటే కాదు దక్షిణమంటుంటాడు. పైగా వితండవాదం చేస్తాడు. ఈ ఒక్క టాపిక్కే కాదు. అన్నింటిలో అతనంతే.
ReplyDeleteనా బ్లాగూ, వెబ్ సైటూ ఇద్దును; మొహమానికి పోయి ఏదో అవడమెందుకని ఇవ్వట్లేదు.
అన్నా! ఎందుకో గని ఈ వేమన పజ్యం యాది కొస్తాందే.
ReplyDeleteఆలిమాటలు విని అన్నదమ్ముల రోసి
వేరేపోవువాడు వెర్రివాడు
కుక్కతోక పట్టి గోదారీదినా?
విశ్వదాభిరామ వినుర వేమ!
అన్నా నారాజి గాకె. మా మాట చెప్పెటందుకు మాకుబీ సొసంత్రం ఉన్నదిలె.
Ayyaa, this is the first time I am seeing the site aavakaaya.com. Migilina vishayaalu etla unnaa, logo lo unna oka chinna descripency mee drushti ki theesuku vaddam anipinchindi: Aavakaaya vesedi patchi (raw, unripe) maamidi kaayalatho kaani golden yellow maamidi pandlatho kaadu kadaa? Kaastha maaristhe baaguntundanukuntaanu.
ReplyDeleteప్రత్యేక తెలంగాణా కోసం ఆవేశపడేవాళ్ళని చూస్తే నవ్వొస్తుంది. ఇదేదో పెద్ద ఇజ్రాయెల్, పాలస్తీనా సమస్యలాగా ఫీలవుతుంటారు. అయ్యా, మీరు భారత దేశంలో ఉన్నారనీ, ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా నివసించొచ్చనీ మర్చిపోతున్నారనుకుంటా. కేవలం రాజకీయనాయకులకి పదవులు దొరక్కా, రాజధాని కాబట్టి హైదరాబాదుకొచ్చే మిగతా రాష్ట్ర ప్రజల్ని చూసి ఏడుపుకొద్దీనూ తెలంగాణా కావాలి, కావాలి అని కొట్టుకుంటున్నారు. పీవీ నరసింహారావు గారు ప్రధానైనప్పుడు తెలుగువాళ్ళెవరికీ ఆయన తెలంగాణావాడని గుర్తు రాలేదు. పరాయి వాడైన నిజాం పాలన కమ్మగా ఉందనుకునేవాళ్ళనీ, తన తోటివాళ్ళే అయిన పక్క జిల్లావాళ్ళని చూసి ఆత్మ న్యూనత పడి ఏడుచుకునేవాళ్ళనీ చూస్తే నవ్వొస్తుంది. భావ దారిద్ర్యమూ, భావ దాస్యమూ, తమను తాము తక్కువచేసి చూసుకోవడమూ తప్ప తెలంగాణా గురించి ఆవేశపడడానికేముందో అర్ధం కాదు.
ReplyDeleteIt is senseless to comment here on some unknown article published in some website by somebody.
ReplyDeleteIf you want to promote your avakaya.com better try to send a kg bottle of avakaya.
You need to get trained in business propaganda, Mr. Kiran Kumar :))
Nice to see your reference to Nehru's words on Telangana-Andhra. What else Nehru a politician said during that time is also worth to be mentioned:
ReplyDeletehttp://www.hindu.com/thehindu/mag/2003/03/30/stories/2003033000040300.htm
Nehru was against liguistic division of states. So, he might have said 100 to undermine the formation of the state and to prove his theory to be right. Should we or are you going to follow whatever he said 60years ago? How strictly you are or your party follwed Nehru/Gandhi's words?
It is said , Gandhi wanted to make Jinnah as PM of India, did Nehru listened to Gandhi? Did Sansangh listened to Gandhi? They eliminated him for his policy on division of the nation.
Who is talking 'meaningless' , now? You or that Samaikya vaadi' ?