ఈమధ్య కాలంలో సాధారణ పౌరులు అసాధారణంగా తమ నిరసన తెలియజేయటం మిగిలిన పౌరుల్లో చైతన్యాన్ని కలిగిస్తున్నది. ఆ కోవకు చెందినదే, కేంద్ర హోం మంత్రి చిదంబరంపై దైనిక్ జాగరణ్ విలేఖరి జర్నైల్ సింగ్ బూటు విసరటం. అతను చేసిన క్షమించరాని నేరమేదైనా ఉంటే, అది గురి తప్పేట్లుగా బూటు విసరటం మాత్రమే అని నేను భావిస్తున్నా. నా అంచనా ప్రకారం ఈ పౌరచైతన్యానికి ప్రభుత్వం, రాజకీయ నాయకులు ఉలిక్కి పడుతూ ఉండి ఉంటారు. ఇది ఎన్నికల మాసం కావటమే దానికి ప్రధాన కారణం. హోం మంత్రిపై ఈ బూటు దాడిని ఖండించటానికి అన్ని రాజకీయపక్షాలు ఏకమౌతాయనేది కూడా స్పష్టమే. ఎందుకంటే, రేపు వారి వంతు కూడా రావచ్చు కదా!
అసలు ఇటువంటి విషయాన్ని ఖండించటానికి కూడా సిగ్గుపడాలి మన రాజకీయ నాయకులు. మొన్నామధ్య, కొందరు ప్రజలు తమ నియోజకవర్గంలోని సమస్యలపై తమ ప్రతినిధి లాలూ యాదవ్ తో మాట్లాడటానికి వెళితే, ఆయన వాళ్ళను అమ్మనాబూతులు (నిజంగానే... టీవీలో పెదవుల కదలికౌ చూపించారు) తిట్టి మరీ పంపించాడు. బీహారులో ఆర్జేడీని కాకుండా, జెడి (యు) ను ప్రజలు ఎన్నుకున్నారన్న అక్కసే ఆయన కోపానికి కారణం. అంతెందుకు, నిన్ననే వరుణ్ గాంధీని రోడ్ రోలర్ కింద వేసి తొక్కిస్తానని బహిరంగసభలో చెప్పాడు ఈయనే. ఇటువంటి వాచాలత్వాన్ని అదుపులో పెట్టుకోలేని మూర్ఖపు వెధవలు, సామాన్య ప్రజలు మాత్రం తమనేమీ అనకూడదని, అడగకూడదని ఎందుకు అనుకుంటారు?
నిజానికి, ఈ బూటు సత్కారానికి అన్నివిధాలా అర్హుడు మన మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్. ఆయన అదృష్టం బాగుండి నిన్న కాక మొన్న హోం మంత్రి అయిన చిదంబరం ఈ సత్కారాన్ని అందుకోవాల్సి వచ్చింది. ఏమైనా, దుష్టసాంగత్యంలో ఉన్నందుకు ఇటువంటి సత్కారాలు తప్పవు మరి. ఈ సత్కారానికి ఇంకా ఎంతమంది అర్హులనేది ఓ సారి చూద్దాం.
ఈ అగ్రపూజకు అన్నివిధాలా అర్హుడు లాలూ యాదవ్. ఆ తర్వాత అంబుమణి రాందాసు, శివరాజ్ పాటిల్, అర్జున్ సింగ్, సోమ్ నాధ్ ఛటర్జీ. అలానే, మన రాష్ట్రమంత్రివర్గంలోని ప్రతి సభ్యుడు, ప్రతిపక్ష నాయకులు ప్రతి ఒక్కరూ.
ఏదేమైనా, రాజకీయ నాయకులపై కుళ్ళిన కోడిగుడ్లు, టొమేటోలు, బూటు సత్కారాలను 'ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్' కిందే పరిగణించి చట్టబద్ధం చేయాలని డిమాండు చేస్తున్నా.
Amen....
ReplyDeleteఇదే అంశం పై నా భావాలు ఇక్కడ చూడండి
ReplyDeleteబూటు గొప్పా ? పెన్ను గొప్పా ?
"ఏదేమైనా, రాజకీయ నాయకులపై కుళ్ళిన కోడిగుడ్లు, టొమేటోలు, బూటు సత్కారాలను 'ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్' కిందే పరిగణించి చట్టబద్ధం చేయాలని డిమాండు చేస్తున్నా" good one! అలాంటప్పుదు మనమీదెన్నిపడతాయో అలోచించే చెప్ప్తున్నారా ఈ మాట ;)
ReplyDeletegood one!
ReplyDeleteDo you want to contest for MLA on this platform?
:))హ హ హ
ReplyDelete