ఏమిటీ దౌర్భాగ్యం! నాలుగు పదాలతో పేనితే అది నానో కవిత్వమా? ఈ ఛండాలాన్ని నానోలనుకోండి, ఇంకేవైనా అనుకోండి కానీ కవిత్వం అనటం ఏమిటి? ఒక మహానుభావుడు వేమన మీద పరిశోధన చేసి ఆ ప్రేరణతో నానీలని మొదలేసారు. ఇప్పుడు ఆయన ప్రేరణతో మరో మహానుభావుడు కనీసం పేరులోనైనా ప్రత్యేకత చూపించలేక 'నానీ'లనే కొంత మార్చి 'నానో'లనేస్తున్నాడు.
ఇంకపైగా ఆయనకు నచ్చే నానోలు వ్రాయగలిగితే మూడొందల రూపాయల బహుమతి కూడానట! కవిత్వాన్ని చిల్లరకొట్ల స్థాయికి దిగజారుస్తున్న ఇటువంటి పనికిమాలిన విషయాలని ప్రయోగాలుగా ఎలా చెప్పుకుంటున్నారో అర్ధం కాదు. విమర్శకులు కూడా వీరికి వత్తాసు పలకటం విచిత్రం. కవిత్వం కన్నా వీరికి వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యంలాగుంది.
పేరులో కూడా తెలుగుదనం చూపలేని వ్యక్తులు తెలుగు సాహిత్యానికి కొమ్ముకాస్తున్నారనే మూర్ఖశిఖామణులు ఇలాంటివారికి వత్తాసుగా బ్లాగుల్లో అజరామర సాహిత్యం వచ్చేస్తున్నదని కలలు గంటూ, వ్యాసాలు కూడా వ్రాస్తు, కాదన్నవారిని ఖండిస్తున్నామంటారు. వీరి 'ఆలోచనాత్మక విశ్లేషణ' విప్లవాత్మకమని అందరినీ నమ్మమంటారు.
అయ్యా విప్లవాత్మకమంటే వంకాయతో వడియాలు పెట్టుకుంటామనటం కాదు. విమర్శనాత్మక శక్తితోపాటు విచక్షణా జ్ఞానం కూడా ఉండాలి. మన విమర్శకుల్లో అది లేకనే, గుడికెళ్ళి టెంకాయ కొట్టను, వంకాయ కొడతాను వెరైటీగా అనే ప్రబుద్ధులు బయలుదేరి, ప్రయోగాల పేరిట నానీలకు, నానోలకు నాన్నలమని, పెదనాన్నలమని చెప్పుకుంటున్నారు.
సరే, నానోలవారు ఎలా ఏడ్చినా, జ్ఞాపకాల తవ్వకాల్లో బయల్పడిన అలనాటి 'నానోలు' నెటిజన్సు కోసం :
శీను శీను
సిగరెట్టు
శీను పెళ్ళాం
పెసరట్టు
ఎ బి సి డి ఇ ఎఫ్
నీ తాత
ముడ్డి
ఠాప్
గూట్లో
రూపాయ్
నీ మొగుడు
సిపాయ్
వానావానా
వల్లప్ప
వాణీ మొగుడు
ఎల్లప్ప
:-),
ReplyDeleteఅంతటితో ఆపారు ఏంటి సార్, ఒక్కసారి మీ చిన్ననాటికెళ్ళండి..., వీటినే మేము
శీను శీను
సిగరెట్టు
శీను పెళ్ళాం
బిస్కెట్టు
ఎ బి సి డి ఇ ఎఫ్
నీ యబ్బడి
--
ఠాప్
వానావానా
వల్లప్ప
వావీ వరసా
ఏవప్పా
చదువెందుకు
సంకనాకనా
----
----
ఇట్లా ఓ ఎన్నో
--- వున్నచోట , బూతులు కాబట్టి..మీకు నచ్చింది రాసుకోవచ్చు
నాకు నానీలన్నా నానోలన్నా శ్రీ లక్ష్మి తవికలు గుర్తొస్తాయ్
ReplyDeleteకాళయముడు కిను
కవహించిన ఆ
క్షణం తనకిం
కరులను పున్యము
ఉర్తి ఆఫీసు కే పం పాడు పాడు యముడు
నోటికి మాట
నెత్తికి రీటా
కాలికి బాటా
నాకిష్టం సపోట
నీకూ నాకు టాట
తొందరగా పొ ఈ పూట
:)
కవిత్వాన్ని దిగజార్చొద్దు అనే మీ ఆవేదన అర్ధం చేసుకోగలను. విమర్శ మంచిదే, కానీ దూషణ వద్దని మనవి, అందులో సాటి బ్లాగర్లని.
ReplyDeleteపైగా .. నా కంటబడిన కొన్ని నానోలు, అవి కవిత్వం కాకపోవచ్చు గానీ, సామెతల్లాగా ఆకర్షణీయమైన వాక్యాలు; వాటిల్లో ఒక చమత్కారం ఉంది.
plz see this link too http://pradeepblog.miriyala.in/2009/04/blog-post_18.html (including comments)
ReplyDeleteLOLOLOL SDB!!!!!!
ReplyDeleteStill laughing at your Nanos :))
Well I do agree that the poets have their freedom to be creative - they are in their own rights to write whatever they want - But is it really worth spending time and energy on these so called Nanos?
IDEA: WHY DONT WE STARTS "MONO"s? - THE WHOLE POEM HOULD HAVE ONLY ONE WORD ..
OREI
OSEI
EME
EMITE
NUVVU
NENU
@మలక్ పేట్ రౌడీ గారు,
ReplyDeleteమీకు ఆ చాన్స్ లేదు. ఇప్పటికే వాటికి నోనోలని అబ్రకదబ్ర గారు నామకరణం చేసేసారు. (http://pradeepblog.miriyala.in/2009/04/blog-post_18.html?showComment=1240086600000)