ముసుగుతన్ని పడుకున్నా
తెరిచే ఉన్న కళ్ళు
గతంలోకి జారుతున్నా
ముందుకే నడుస్తున్న
గడియారం ముల్లు
కొత్త భవిష్యత్తువైపు
సరికొత్త ఆశలతో...
* * *
ఒంటికాలి రాక్షసుడిలా
చీకట్లో తాటి చెట్టు
అటూ ఇటూ తోడుగా
నడిచొస్తున్న నక్షత్రాలు
అయినా, ఇంటికెలా చేరానో
నాకే తెలీదు
* * *
వస్తూపోయే మేఘం
కళ్ళాపీ చల్లి వెళ్ళింది.
తెలిసినట్లే ఉన్నా
తెలుసుకోలేక పోతున్నా
వాన నీటిలో
మబ్బు లోతులు
* * *
చేయని పాపాలు
మోస్తున్న క్రీస్తులా
ఆగిపోయిన
గడియారం ముల్లులా
పైరుమధ్యలో
దిష్టిబొమ్మ
ప్రాణం పోసి అడగాలనుంది
ఎలా నుంచునే
ఉండగలిగావని!
sai kiran gaaru:
ReplyDeleteee kavitalu baagunnaayi. kluptamgaa, manasuki hattukunelaa...
afsar
అనుకోకుండా లభించిన మీ ఆశీస్సులకు చాలా ధాంక్సండి అఫ్సర్ గారు.
ReplyDeleteపైరుమధ్యలో
ReplyDeleteదిష్టిబొమ్మ
ప్రాణం పోసి అడగాలనుంది
ఎలా నుంచునే
ఉండగలిగావని!
బాగుంది