ఆనాడు దేశ విభజనకు ప్రధాన కారకుడైన జిన్నాను ఆకాశానికి ఎత్తేస్తూ, ఈనాడు 'జిన్నా - ఇండియా - పార్టీషన్ - ఇండిపెండెన్స్' అనే శీర్షికతో జస్వంత్ సింగ్ పుస్తకం వ్రాయటంలోని అసలు మర్మమేమిటి? ఇది నిజంగానే, జిన్నాపై తన అభిప్రాయాలు ప్రకటిస్తూ జస్వంత్ వ్రాసిన పుస్తకమా? లేక జవహర్ లాల్ నెహ్రూ తదితర నేతల చేతకానితనాన్ని చర్చనీయాంశం చేయాలన్న ప్రయత్నమా?
జిన్నాపై నిజంగానే ఆయనకు మక్కువ ఉండి ఉన్నట్లైతే, ఇదివరలో అద్వానికి జిన్నా విషయంలోనే శృంగభంగం జరిగినప్పుడు జస్వంత్ ఎందుకని మాట్లాడలేదు? నెహ్రూ తదితర నేతల చేతకానితనాన్ని దునుమాడే ప్రయత్నమే అయితే, ఈ విషయాన్ని ఎన్నికల ముందు ఎందుకని లేవనెత్తలేదు?
ఇదంతా భా.జ.పా. వేస్తున్న ప్రమాదకరమైన రాజకీయ పాచికలు. భా.జ.పా. అస్తిత్వాన్నే రూపుమాపే వెర్రి ఎత్తుగడలు. మొన్నటి ఎన్నికలలో అటు హిందువుల ఓట్లకు దూరమై, ఇటు ముస్లీములకు చేరువ కాలేక, నెత్తిన పెట్టుకున్న 'జిన్నా కుంపటిని' దించుకునే అద్వానీ ప్రయత్నమే ఈ పుస్తకం. కేవలం మితవాద, అతివాద హిందువులను మభ్యపెట్టటానికి అద్వాని నేతృత్వంలో జరుగుతున్న ప్రయత్నాలే ఇవి.
ఇప్పుడు జిన్నా గురించి జస్వంత్ చెప్పిన విషయాలు ఖండిస్తున్న భా.జ.పా. అధినాయకత్వం ఆయన్ని బహిష్కరించటం కూడా జరిగింది. మరి అద్వానీని ఎందుకు ఉపేక్షిస్తున్నట్లు? నిజానికి ఈ వ్యవహారంలో ఆరెస్సెస్ కు ఏమాత్రమూ సంబంధం కనిపించట్లేదు. ఇప్పుడు ఏ స్థాయిలో ఆరెస్సెస్ అభ్యంతరం వ్యక్తం చేసిందో, అప్పుడు అద్వానిపై కూడా అదే స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా, అద్వానీపై ఈగ కూడా వాలనీయలేదు అప్పటి భా.జ.పా. అధినాయకత్వం.
అప్పటి తప్పును కప్పిపుచ్చి, ఇప్పుడు కావాలని తప్పు చేయించి శిక్షించినందువల్ల హిందువులు మురిసిపోతారనుకోవటం భ్రమ. పార్టీకి, పార్టీ మనుగడకు ముఖ్యమైన మూడు మూల సిద్ధాంతాలను (అయోధ్య రామ మందిరం, ఆర్టికిల్ 370, ఉమ్మడి పౌరసత్వ చట్టం) పణం పెట్టిన అద్వానీ తదితర నేతల నాయకత్వాన్ని ఊడబెరికి, మలితరం నేతలకు పగ్గాలిచ్చినప్పుడే, కనీసమాత్రంగానైనా ఆ పార్టీని నమ్మవచ్చు.
జిన్నాని కరడుగట్టిన మతవాదిగానే మనం పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం. అతని గురించిన అసలు విషయాలు, విశేషాలు తెలుసుకుంటే బహుశా మీరూ అద్వానీ, జస్వంత్‌ల మాటలు సమర్ధిస్తారు. దేశాన్ని చీల్చటంలో జిన్నా ప్రమేయం అసలే లేదనటం సరికాదు కానీ, అందులో నెహ్రూ ప్రమేయమూ ఉందనటం సరైనదే.
ReplyDeleteఇక - అద్వానీకి పూర్వ వైభవం తేవటానికి జస్వంత్‌తో నాటకమాడిస్తున్నారంటున్న మీ వాదన నమ్మశక్యంగా లేదు. తన భవిష్యత్తుని బలిపెట్టుకుని మరీ రేపో మాపో రిటైరయ్యే అద్వానీకి భవిష్యత్తు ప్రసాదించాల్సిన అగత్యం జస్వంత్‌కి ఏమిటి?
జిన్నా గురించి వ్రాయటం అసలు ఉద్దేశ్యం కాదు. జిన్నాను భా.జ.పా. ఎలా వాడుకుంటున్నదో చెప్పాలని చేసిన ప్రయత్నమే అబ్రకదబ్ర గారు. అలానే, అద్వానీకి పూర్వవైభవాన్ని కట్టబెట్టటానికే ఈ తిప్పలు అని నేనెక్కడా అనటంలేదు. భా.జ.పా.కు ఆ వైభవాన్ని తీసుకురావటానికి అద్వానీ నేతృత్వంలొ నానా పిల్లిమొగ్గలు వేస్తున్నారు ఈ నాయకులు అని మాత్రమే చెబుతున్నాను.
ReplyDeleteఇది పార్టీలో మితవాదులుగా, లౌకికవాదులుగా పేరు తెచ్చుకుందామనుకుంటున్న అద్వానీ కోటరీకి, అతివాదులకు జరుగుతున్న ముసుగులో గుద్దులాట. చేసిన తప్పును ఎలాగైనా సరిచేసుకుంటున్నట్లు నాటకమాడి, పార్టీపై మళ్ళీ పట్టు తెచ్చుకుందామనుకుంటున్న అద్వానీ చేస్తున్న కుటిల ప్రయత్నాలు. డైబ్భై ఏళ్ళ పైబడిన వయసులో జస్వంత్ సింగ్ కు మాత్రం ఏం భవిష్యత్తు ఉన్నదని? రాజస్థాన్ లో ఓటమికి వసుంధర రాజె సింధియాను బాధ్యత వహించమని కోరుతున్న రాజ్ నాథ్ సింగ్, సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత ఎందుకు వహించలేదు. అద్వానీ కూడా రాజీనామా చేసినట్లే చేసి, వాపసు ఎందుకు తీసుకున్నట్లు? కేవలం, అద్వానీ చిరకాల స్వప్నాలను, ప్రధాని పదవీ కాంక్షను తీర్చేమ్దుకు వారు పార్టీని బలిపశువుగా చేస్తున్నారు. ఇది ఇష్టంలేని అతివాదులను పొమ్మనకుండా పొగబెడుతున్నారు.
ReplyDelete