Friday, October 9, 2009

ఒబామా కాదు, మన్మోహన్ సింగే నిజంగా అర్హుడు

మొన్న మన రాష్ట్రస్థాయిలో, కడప జిల్లా పేరు వైయస్సార్ గా మార్చినందుకే చాలా ఆశ్చర్యమేసిందనుకుంటే, ఇప్పుడు ఒబామాకు నోబెల్ శాంతి పురస్కారం లభించటం అంతకు మించిన ఆశ్చర్యాన్ని కలిగించింది. యుద్ధకాముకుడైన బుష్ నుంచి పగ్గాలు స్వీకరించిన ఒబామా ఈ సంవత్సర కాలంలో ప్రపంచ శాంతికి ఏరకంగా దోహదపడ్డాడో నాకైతే అర్ధం కాలేదు.

ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ ల పరిస్థితుల్లో మార్పు లేదు. నిన్నటికి మొన్న, పాకిస్తాన్ పూర్వ రాష్ట్రపతి ముషర్రాఫ్ తన హయాంలో ఏవిధంగా అమెరికా సహాయాన్ని భారత్ కు వ్యతిరేకంగా ఉపయోగించారో చెప్పినా, రెండు రోజుల తర్వాతే పాకిస్తాన్ కు మరింత సహాయాన్ని ప్రకటించిన ఒబామా ప్రభుత్వం ప్రపంచ శాంతిని ఏరకంగా ఉద్ధరించిందో!

మహాత్మా గాంధిని, మార్టిన్ లూథర్ కింగ్ ను మాటిమాటికి జ్ఞప్తికి తెచ్చుకోవటమే ప్రపంచశాంతికి దోహదపడటమైతే, మన దేశంలో ఇంతకు వందింతలమందికి నోబెల్ శాంతి బహుమతి ప్రకటించాల్సి ఉంటుంది. ఆ మాటకొస్తే, ఒబామా కన్నా, మన ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ పురస్కారానికి అన్నివిధాలా అర్హుడు.

ఇటు సరిహద్దుల్లో పాకిస్తాన్ సాగిస్తున్న కాల్పులపై నోరు మెదపడు. అటు, అరుణాచల్ ప్రదేశ్ లో చైనా చొరబాటుపై పెదవి విప్పడు. దేశం నడిమధ్యలో తీవ్రవాదుల ఘాతుకంపై అడిగినా అదే చూపు, పార్లమెంటుపై దాడి కేసులో ఉరి శిక్షపడ్డ అఫ్జల్ గురు గురించి అడిగినా అదే చూపు. చివరాఖరికి నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ లు బెదిరించే పోకడలు పోతున్నా కిమ్మనడు. ఏంతో శాంతికాముకుడైతే తప్ప, సామాన్యులు అలా స్థితప్రజ్ఞత చూపలేరు.

మన కాంగ్రెస్ పార్టీ, అణు ఒప్పందం విషయంలో ఎలాగైతే లాబీయింగ్ నడిపిందో, అలానే, మన ప్రధానికి నోబెల్ శాంతి బహుమతి కోసం లాబీయింగ్ చేస్తే బాగుంటుంది.

17 comments:

  1. vaaa....sonia tho cheptha........

    idi meeku vache samadhanam ...mana adbhutha pradhana manthi vadda nunchi ...

    ReplyDelete
  2. డబ్బున్నోడిదే (అది కూడా ఇప్పుడు సరి కాదేమో), అధికారం, నోరు వున్నోడిదే రాజ్యమండి... రీసెంట్ గా అమెరికా కు పాకిస్తాను అంక్ష పెట్టింది ఏడాది కి 5 బిలియన్స్ (అవును మీరు సరిగానే చదువుతున్నారు) ఇస్తే వాళ్ళ దేశాభివృద్దికి ఆఫ్ఘనిస్తాన్ మీద పోట్లాడటానికి వీళ్ళ దేశం నుంచి ఒప్పుకుంటుంది అట...

    ReplyDelete
  3. E varthanu rediff.com lo chadivi, maa Aafeesulo evaro, Bush ku icchivudalsindannaru.

    ReplyDelete
  4. నా అభిప్రాయంలో ఇద్దరూ కాదు

    ReplyDelete
  5. ఒబామా గెలిచినపుడూ చాలా హడావుడి చేసారు. ఒబామా గొప్పతనమంతా ఆ నలుపు లోనే ఉన్నట్టుంది. మన దేశంలో మాయావతి ప్రధాని అయి ఉంటే, మన మీడియా కూడా ఆవిణ్ణి ఆకాశానికి ఎత్తేసి ఉండేది. దళిత మహిళ అంటూ! ఈ సారి నోబుల్ పీస్ ప్రైజ్ ఒబామాకొచ్చినంటే అసహ్యం కలిగింది. అంత చీపా నోబుల్ కమిటీ అనిపించింది. ఏమో.. నాకు నచ్చకపోయినంత మాత్రాన లోకానికేమీ నష్టం లేదులే అనుకున్నాను. I agree with u.

    ReplyDelete
  6. మహాత్మా గాంధిని, మార్టిన్ లూథర్ కింగ్ ను మాటిమాటికి జ్ఞప్తికి తెచ్చుకోవటమే ప్రపంచశాంతికి దోహదపడటమైతే, మన దేశంలో ఇంతకు వందింతలమందికి నోబెల్ శాంతి బహుమతి ప్రకటించాల్సి ఉంటుంది. -- నిజమే - ఒబామా కన్నా ఆయన స్పీచ్ రైటర్లకి ఇవ్వాలి నోబుల్. ఒబామా అచ్చం హాలీవుడ్ హీరో లానే అరచేతి లో వైకుంఠం చూపిస్తూ ఉంటాడు.

    ReplyDelete
  7. సాధారణం గా నోబుల్ విజేతలు 'నోబుల్ నాకు వచ్చింది అని ఫోన్ రాగానే అది Prank అనుకున్నా ' అంటారు. ఒబామా కి పీస్ ప్రైజ్ వచ్చినంటే జనానికి అది prank అనిపించి ఉంటుంది.

    ReplyDelete
  8. "అణురాగ బహుమతి"కదా మరి! మీరు చెప్పిన పాయింట్ల ప్రకారం మన్మోహన్ కి ఎప్పుడో ఇచ్చెయ్యాలి పరమ శాంతి కాముకుడిగా!

    చాలా బావుంది టపా! చరిత్ర అంతా చెప్పకుండా చెప్పాల్సింది సూటిగా చెప్పారు.

    ReplyDelete
  9. MMS ki kaadu.. noble peace price peeru MMS award ani marchali. sthitapragynudu.

    ReplyDelete
  10. నేను ఒప్పుకోను.. ఇస్తే గిస్తే ఆ అవార్డ్ సొనియా కి ఇవ్వాలి.

    ReplyDelete
  11. The great Norwegian committee, in their eternal wisdom, said that they are honoring Obama with the award not for what he achieved, but for his 'great intentions'. How cool is that!

    So there! friends, have great intentions thats it. Rest assured, One day you'll get the 'Nobel Joke prize' or a Nobel crap prize

    ReplyDelete
  12. అదే మరి పెరటి చేట్టు వైద్యానికి పనికిరాదంటే, మా జగన్ అన్న కంటే ఓబామాలు, మన్మోహన్ లూ ఏమి గొప్ప అంట. వాళ్లకేమనా సొంత సేనలు ఉన్నాయా? ఉండి మా జగనన్న లాగా వాళ్లెమన్న శాంతి బాటలో నడుస్తున్నారా?
    యమ అర్జెంట్ గా ఇవ్వనందుకు ఓ నాలుగు బస్సులు మా జగన్ సేన కాస్త ఈ వరదల గోడవ తగ్గాక, కాల్చాల్సిందే!!

    ReplyDelete
  13. హార్వర్డ్ ఐనా , స్కూల్ డ్రాప్-అవుట్ సోనియా ఆజ్ఞలన్నిటికీ గంగిరెద్దులా తలూపుతాడు, కూడా.
    కాబట్టి 'గంగిరెద్దు అవార్డ్' లేదా ' బొడ్రాయీ అవార్డ్ కు అర్హుడేమో గాని, శాంతి అవార్డ్ కు కాదు.
    ( బొడ్రాయి - అంటే కోటవాకిలి ముందు పూర్వం ఒక రాయి వుంచేవారు, అది )

    ReplyDelete
  14. విషయాన్ని సూటిగా చెప్పారు.

    ReplyDelete
  15. I totally agree with you Sai, but Manmihan should be more aggressive in bringing some solutions to the current state of affairs first with our beloved neighbours and then acreoss the globe(MMS does many things without getting any publicity but others get more publicity without doing anything e.g. Barack)
    Satya Raju

    ReplyDelete
  16. మంచిదయ్యింది. నోబుల్ ప్రైజు రావడమే ఘనతకు నిరూపణ అనే భావదారిద్ర్యపు సంకెలల నుండీ విముక్తి కి సోపానం, నోబుల్ గాళ్ళ ఈ జోకరు చేష్ట. ఇంక ఈ అవార్డ్ గురించి పెద్దగా పట్టించుకోనవసరం లేదన్నమాట.

    ReplyDelete
  17. ఇలా కామెంట్లలో అసందర్భంగా దూరినందుకు ముందుగా క్షమించండి. దయచేసి ఒక్కసారి http://jeevani2009.blogspot.com/2009/10/blog-post_25.html ను సందర్శించండి పేరును సూచించండి ధన్యవాదాలతో, మీ జీవని.

    ReplyDelete

మీ అభిప్రాయం :