ఇస్మాయిల్ నిబద్ధ కవి కాదా? అనే వ్యాసానికి కొనసాగింపుగా ఇది వ్రాయటం జరుగుతున్నది. దీనికి ముందుగా కొన్ని వివరణలు, సంజాయిషీలు.
బొల్లోజుబాబా గారు అనని విషయాలని అన్నట్లుగా నేను వ్రాసినట్లు ఆయన అభియోగం చేసారు. ఇది కొంతవరకు సహేతుకమైన అభియోగమే. అయినప్పటికి, నా వివరణ ఇది.
బుడుగోయ్ గారి బ్లాగులో "నిబద్ధ, అనిబద్ధ" అన్న వర్గీకరణలు ప్రస్తావిస్తూ శ్రీశ్రీ, ఇస్మాయిల్ లకు అన్వయింపచేసింది ముందుగా బాబా గారే. దానికి సమర్ధింపుగా, అలా విమర్శకులు కూడా అన్నారని చెప్పడమే కాకుండా, ద్వా.నా.శాస్త్రి గారు కూడా వాడారు అని చెప్పింది బాబాగారే. ఆ విషయాన్నే, పరోక్షంగా ప్రస్తావించానని నా సంజాయిషి.
ఇక, భైరవభట్ల గారు ఇస్మాయిల్ కవిత్వంలోని సిద్ధాంతం మీద నేనో వ్యాసం వ్రాస్తే చదివిపెడతానన్నారు, ఏం పొడుస్తావో చూస్తాం అన్నట్లుగా :)) (సరదాకేలేండి). ప్రస్తుతానికి కాకపోయినా, "పొడి"చేస్తాననే హామీ ఇస్తున్నా.
* * *
సరే అసలు విషయానికి వద్దాం :
పాయింట్ నెం. ౧
నలుగురు అర్ధం చేసుకునే ఆంగ్ల భాషలో "నిబద్ధత" అన్న పదానికి అర్ధం కమిట్మెంట్ . ఇస్మాయిల్ అనిబద్ధ కవి అంటే, కమిట్మెంట్ లేని కవి అని అర్ధం! అంటే, "నిబద్ధత" అనే పదం ఎలా పెడార్ధాలు ఇస్తుందో కూడా తెలియకుండానే, మన విమర్శకులు, సమీక్షకులు ఇటువంటి పదప్రయోగంతో కవులను, కవిత్వాన్ని వర్గీకరించారన్న మాట!
ఆ దిక్కుమాలిన పద ప్రయోగాన్ని సమర్ధించుకుంటూ, "నిబద్ధతకు", "అనిబద్ధతకు" వాళ్ళిచ్చే తాత్పర్యం మరింత సిగ్గుచేటు. ఒక సిద్ధాంతానికో, లేదంటే ఒక వాదనకో కట్టుబడి వ్రాసే కవులందరూ నిబద్ధ కవులట. అలా ఏ సిద్ధాంతానికీ, వాదనకూ కట్టుబడని కవులందరూ అనిబద్ధ కవులట. తెలుగు పదాలకు అర్ధమే తెలుసుకోని ప్రబుద్ధులు చేసే వర్గీకరణకు వ్యాఖ్యానాలు వ్రాస్తూ చేసే సమర్ధింపులు కూడా. ఆపైన, "నిబద్ధత-అనిబద్ధత"లకు కొత్త పదాలు కనిపెట్టమని మనవి కూడా!
* * *
పాయింట్ నెం. ౨
సరే, మాట వరసకు "నిబద్ధ, అనిబద్ధ" కవిత్వాలను ఒప్పుకుందాం. అంటే, విమర్శకుల, సమీక్షకుల ప్రకారం కవిత్వం "నిబద్ధమైనా" అయ్యుండాలి, లేదంటే "అనిబద్ధమైనా" అయ్యుండాలి. ఈ రెంటిని మించిన "సర్వబద్ధ కవిత్వం" వ్రాసిన మొనగాడైన కవి తెలుగులో లేడన్న మాట. అలా లేడని ఎలా తీర్మానించారు అని అడగకూడదేమో! అడిగితే, మరో వ్యాసం వ్రాయమంటారు "సర్వబద్ధ కవిత్వం" అనే వర్గీకరణ గురించి :))
* * *
పాయింట్ నెం. ౩
వైయుక్తికమైన భావనను అక్షరరూపంలో పెట్టి సార్వత్రికం చేయగలగటం కవిత్వమనే విషయంలో బహుశా ఎవరికీ ఎట్టి విపత్తు లేదనే అనుకుంటాను. అటు శ్రీశ్రీ వ్రాసిన కవితలైనా, ఇటు ఇస్మాయిల్ వ్రాసిన కవితలైనా ఆ కోవకు చెందినవే అనటంలోనూ ఎటువంటి సందేహాలకూ తావు లేదనుకుంటాను. మరి, తన వైయుక్తికమైన భావనను ప్రకటించిన శ్రీశ్రీ కమ్యూనిజం అనే సిద్ధాంతం లేదా వాదనకు చెందిన కవిత్వమే వ్రాసారని ఎలా తీర్మానిస్తాం?
దారి పొడవునా గుండె నెత్తురులు "తర్పణ" చేస్తూ పదండి ముందుకు అన్నాడే కానీ, దారి పొడవునా గుండె నెత్తురుల "ధారలు" పోస్తూ అని అనలేదే? హరోం హర హర హరోం హర హర హరోం హరా అని అరవమన్నాడే. "తర్పణలు", "హరోం హర"లు, జగన్నాధ రథచక్రాలు, కలకత్తా కాళిక నాలుకలు, కమ్యూనిస్టు సిద్ధాంతాలేం కావు కదా?
వైయుక్తికమైన భావనను సార్వత్రికం చేయటానికే శ్రీశ్రీ కూడా ప్రయత్నించాడు కానీ కమ్యూనిజం అనే సామూహిక భావనను కాదు.
* * *
పాయింట్ నెం. ౪
మన విమర్శకులకు, సమీక్షకులకు ఉన్న ఓ దురలవాటు ఏమిటంటే, కవిత్వాన్ని కవిత్వంతో బేరీజు వేయటం కాకుండా, బైటి లక్షణాలను బట్టి విలువ కడతారు. అందుకు ఉదాహరణలుగా భావ కవిత్వమని, అనుభూతి కవిత్వమని, విప్లవ, దళిత, స్త్రీవాద కవిత్వమని ఇలా నానా రకాలుగా ఆయా కవిత్వాలకు విలువలు కట్టేసారు. నిజానికి, కవిత్వానికి భావం, అనుభూతి ప్రధానం. భావానుభూతులు లేకుండానే శ్రీశ్రీ కవిత్వం వ్రాసాడంటారా? మరి శ్రీశ్రీ విప్లవ కవి ఎందుకయ్యాడు?
దానికి బాబాగారు ఇచ్చే వివరణ కూడా హాస్యాస్పదం. శ్రీశ్రీ వ్రాసిన కవితల్లో అధిక శాతం విప్లవానికో, కమ్యూనిజానికో సంబంధించినవి కాబట్టి, ఆయన్ని ఆ గాటనే కట్టేయాలట! వీరి అభిప్రాయం ప్రకారం, శ్రీశ్రీ కవిత్వంలో భావం కన్నా, నినాదాలే ఉన్నాయని తీర్మానించేయొచ్చా? ఆ మాటకొస్తే, శ్రీశ్రీని "అభావ" కవి అని కూడా అనేయొచ్చేమో!
* * *
అలోక్ వాస్తవ్ గారు చెప్పినట్లు "కవిత్వమంటే ఇలా గుండ్రాయిలా ఉంటుంది" అని చెప్పలేం కదా అనేనెపంతో, ఇష్టం వచ్చింది వ్రాసి అదే కవిత్వమని మభ్యపెట్టటం ఎలా తప్పో, బాధ్యతారాహిత్యంతో, అవగాహనలేమితో, అకడమిక్ విశ్లేషణ పేరుతో చేసే ఈ దండుగమారి వర్గీకరణలు కూడా తప్పే. మహాకవులను కూడాఓ గాటన కట్టేద్దామనే సంకుచిత ధోరణి తెలుగు సాహిత్యానికి హానికరం .
You got your basics wrong.‘అనిబద్ధ’కు వ్యతిరేకపదం ‘నిబద్ధం’ కాదు. "బద్ధం".అంటే బద్ధుడై ఉండటం అని అర్థం. బద్ధానికి ‘అ’తగిలిస్తే ‘అబద్ధం’ అవుతుంది అందుకే "అని" అంటే "లేని" అనే అర్థాన్ని తగిలించి "అనిబద్ధం" చేశారు.
ReplyDeleteకవులూ సాహితీకారుల వర్గీకరణలు తప్పాఒప్పా అనేది పక్కనబెడితే వాటి ప్రయోజనం ఎంత,ఎవరికి అనేవి ఆలోచిస్తే చాలు.
థాంక్యూ అనానిమస్ గారు - For trying to correct my basics.
ReplyDeleteబద్ధం అంటే బద్ధుడై ఉండటం.
అనిబద్ధం అంటే బద్ధుడై లేకపోవటం.
మరి "నిబద్ధ" మంటే?
అలానే, అనిబద్ధుడు అంటే, దేనికి అనిబద్ధుడని అర్ధం?
కవిత్వంలోని భావానికా, అనుభూతికా, శిల్పానికా లేక కవిత్వానికా?
निबद्ध అంటే కూర్చబడిన లేక నిర్వచింపబడిన అని అర్థం. అదే అర్థంలో అనిబద్ధుడంటే ఒక నిర్ధిష్టమైన కూర్పుకి లేక నిర్వచనానికి అందనివాడు లేదా మించినవాడు అని అర్థంచేసుకోవాలి. ఉదాహరణకు దేవుడు నిరాకారుడు అంటే ఆకారం లేనివాడు అనికాదు. ఒక నిర్ధుష్ట్యమైన ఆకారానికి నిబద్ధుడు కానివాడు అని అర్థం.
ReplyDeleteఅందుకే కవి ఇస్మాయిల్ అనిబద్ధకవి అంటే అది ఆయనను అవమానపరచడం కాదు,he is beyond definitions and narrow ideologies అని పొగడటం.
అందుకే కవి ఇస్మాయిల్ అనిబద్ధకవి అంటే అది ఆయనను అవమానపరచడం కాదు,he is beyond definitions and narrow ideologies అని పొగడటం.
ReplyDelete===
అంటే శ్రీశ్రీని అవమానించినట్లే కదండి! మరి ఇస్మాయిల్ ను వదిలి శ్రీశ్రీని మహాకవి అనటం ఏమిటి? సాకార / నిరాకార భగవంతుడి తత్వంతో అన్వయించకుండా చెప్పండి.
మీ ప్రశ్న ఎంత అసంబద్ధంగా ఉందో మీరే ఒకసారి చూసుకోండి.
ReplyDeleteశ్రీశ్రీ ని కమ్యూనిస్టు అన్నదెవరు? దాన్ని పరమసత్యంగా అంగీకరించింది ఎవరు? ఇవన్నీ ఎవరికి వారు శ్రీశ్రీని సొంతం చేసుకునే ప్రక్రియలో లేక తూలనాడి తృప్తిపడే తంతులేతప్ప మరొకటి కాదు. శ్రీశ్రీని కమ్యూనిస్టు అని కొందరు,తాగుబోతు అని కొందరు,డబ్బులకోసం సినిమా పాటలు రాశాడు కాబట్టి కమ్యూనిస్టు ఎలా అవుతాడని కొందరూ ఇలా ఎవరి అవసరాలకు తగినట్లు వారు ఎన్నెన్నో అంటారు. అంతమాత్రానా ఆయన కవిత్వానికొచ్చిన కొరతేమీ లేదు.
మహాకవి అన్న definition కూడా ఆయన కమ్యూనిస్టు అన్నంత సత్యమే. ఎందుకంటే దానికీ time అనే ప్రమాణం ఉంది.Situation అనే తులమానం ఉంది. He broke away from past and created his own path at THAT POINT IN TIME. కాబట్టి కాలప్రవాహంలో ఆయన contribution బేరీజుచేసినప్పుడు మహాకవి అయ్యాడు. ఆయన రాసినప్పుడు మహాకవి కాలేదు. ఇంకొన్నాళ్ళకు మహాకవిగా కొనియాడబడక పోవచ్చు.
శ్రీశ్రీ ఒక భావజాలాన్ని prescribe చేసినట్లు చెప్పాడుగనక ఆ లేబిల్ అన్ని కవితలకూ తగిలించి వారికి అనుకూలంగా వర్గీకరణలు చేసుకున్నారు. ఆయన్ను అదే లేబిల్ తో ప్రమోట్ చేశారు.Why should it be problematic? When you have a choice to agree or disagree!
సాయికిరణ్ గారు,
ReplyDeleteమీరు సరదాకే అన్నా ఎందుకైనా మంచిదని వివరిస్తున్నాను. మీరు వ్రాయగలరనే ఉద్దేశంతోనే, ఆ వ్యాసం నాకు తెలియని, అస్పష్టమైన విషయాలని తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందనే ఆశతోనే నేను నిజాయితీగనే అడిగాను. మీ వ్యాసం నా సందేహాలని తీర్చి నా అభిప్రాయాలని మార్చవచ్చు కూడా. నా నమ్మకాల పైనా, అభిప్రాయాల పైనా నాకు నిబద్ధత లేదు. అవి ఎప్పుడైనా మారే అవకాశం చాలానే ఉంది. అదే నా బలం, అదే నా బలహీనత. ఆ రకంగా నేను అనిబద్ధుణ్ణి :-)
Anonymous garu: like your explanation. But I wonder if "Anibaddha" here is used with same meaning. So, is cinare too beyond definitions and narrow ideaologies? My undestanding is that her it is being used as "committed" and "non-committal" context.
ReplyDeleteFrankly, I agree with budugoy in one aspect. I want to see original article from dvaa.naa. rather depend on others interpretation. May be Mr.Bolloju baba can take pains and publish on his blog.
sorry for the delayed reply
ReplyDeletei already expressed my complete views on this in these links
http://budugoy.blogspot.com/2009/08/blog-post_19.html
http://amtaryaanam.blogspot.com/search?updated-max=2009-11-02T22%3A52%3A00%2B05%3A30&max-results=1
nothing new is with me regarding this.
many asked me to post dvana essay in my blog. i read that in sahithee page andhrabhoomi long back (around two years back). i will try to find it . you may also pl. try. i clearly remember that i read it. whether you believe or not is upto you.
my opinios never change if some one challenges them on logicless means.
i gave another reference in the first cited link in my last comment on using the word absence of nibaddata in ismayil poetry like this
సాదాసీదాగా ఉండే ఇస్మాయిల్ కవిత్వానికి అంత శక్తి ఎక్కణ్ణించి వచ్చిందంటే ’నిబద్దత లేకపోవటమే ఆయన కవిత్వ శక్తికి కారణం’ అని ఆయన గుర్తుచేసేవారు. ---- అఫ్సర్
రిఫరెన్స్: పేజీ నం: 32 పుస్తకం: సలాం ఇస్మాయిల్-నివాళి వ్యాసాలు. వ్యాసం పేరు: అక్కడితో బాల్యం అంతమైంది. రచన: అఫ్సర్
ప్రచురణ: 2004
every body just ignored this comment.
it is a common terminalogy in the poetic circls to refer poets as nibadda and anibadda categories.
if you are not aware of this i cannot help.
bollojubaba
I know that half knowledge is dangerous but let me dare to put my two paise here :)
ReplyDeleteనిబద్ధ అంటే కట్టివేయబడిన అనే అర్థం వస్తుంది. "చౌర్యాన్మాతృ నిబద్ధ చారుచరణః" (దొంగతనం చేసినందువల్ల తల్లిచే కట్టివేయబడిన పాదాలుగల). "భుజంగరాజ మాలయా నిబద్ధ జాటజూటకః" (గొప్పవైన పాములతో కట్టబడిన జటాజూటంతో) మొదలైనవి ఉదాహరణాలుగా చెప్పవచ్చు. అలానే "బద్ధ" అంటే కట్ట(ట్టు)బడిన అనే అర్థం. అప్పుడు అబద్ధం అంటే కట్ట(ట్టు)బడని అని అర్థం.
కావున Ananymous గారు వివరించినట్లు నిబద్ధం అంటే "నిర్వచించబడిన" అన్న అర్థం ఎలా సిద్ధిస్తుందో నాకు తెలీదు.
పై ఉదాహరణాల ఆధారంగా ఈ వ్యాసంలోని విషయానికి తగ్గట్టు నిబద్ధ అంటే (ఒకానొక భావజాలానికి) కట్టుబడడం అనే అర్థం చేయవచ్చు. అలా అర్థం చేసుకున్న తర్వాత మిగతా వాదనలన్నీ అర్థమైనట్టే :)