Saturday, March 13, 2010

జిహాదీల కన్నా, నక్సల్స్ తోనే ప్రమాదమా!

"జిహాదీ ఉగ్రవాదం కన్నా, నక్సలిజంతోనే దేశానికి అధిక ముప్పు"!

ఎవరో అల్లాటప్పాగాళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే, దులుపుకొని వెళ్ళిపోవొచ్చు. తొమ్మిదవ ఇండియా టుడే సదస్సులో సాక్షాత్తు దేశ గృహ మంత్రి పి.చిదంబరం చేసిన వ్యాఖ్య ఇది.

నక్సలైట్ల హింసాకాండను నేను సమర్ధించనూ లేను, నిరసించనూ లేను. సమర్ధించలేకపోవటానికి ప్రధాన కారణం - వీరి వల్ల అన్నెంపున్నెం ఎరుగని అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవటం. నిరసించలేకపోవటానికి కారణం -  ప్రజాస్వామ్యం మీద ఏమాత్రమూ నమ్మకంలేని వీరు తమ సిద్ధాంతాలకి అనుగుణంగానే ఆయుధాలు చేపట్టటం. మహాత్ముని వారసులమైనా, హింసలేని ఏ పోరాటమూ మన ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను కదిలించలేదని నమ్ముతాను కనుక.

ఘనత వహించిన మన ప్రజాస్వామ్య దేశంలోని అసమానతలను రూపుమాపటానికి, అన్నిటినీ వొదులుకొని, ఆయుధాలు చేపట్టిన మహామహుల చరిత్ర నక్సల్ ఉద్యమంతో పెనవేసుకుంది. వీరి ప్రధాన శత్రువు రాజ్యం అంటే ప్రభుత్వం. ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి వ్యతిరేకంగా సాయుధపోరాటం చేస్తున్నారు. వీరి దృష్టిలో వీరి పోరాటపు ఉద్దేశ్యం మన దేశంలోని అణగారిన వర్గాల సంక్షేమం.

మరి జిహాదో! ఇస్లాం పేరిట పరాయి దేశమైన పాకిస్తాన్ మన దేశంలో సృష్టిస్తున్న సంక్షోభం. పాకిస్తాన్ కుట్రలో పాలు పంచుకుంటున్న దేశ విదేశి మతోన్మాదులు - అల్ ఖాయిదా, జైష్-ఎ-మొహమ్మద్, ఇండియన్ ముజాహిదీన్, సిమి. దేశాన్ని అల్లకల్లోలం చేస్తూ, ప్రజల ప్రాణాలకు విలువలేకుండా చేసిన ఈ దుర్మార్గులు మాత్రం మన ప్రభుత్వాలకు మానసపుత్రులు.!

పట్టుబడిన నక్సలైట్లను మాత్రం ఎన్ కౌంటర్ పేరిట చంపేసే దమ్మున్న ప్రజాస్వామ్యం మనది. పట్టుబడ్డ తీవ్రవాదులకు, ఉరిశిక్ష పడ్డ తీవ్రవాదులకు రాచమర్యాదలు చేస్తూ, శిక్షించాలా వద్దా అని ఏళ్ళ తరబడి తాత్సారం చేసే ప్రజాస్వామ్యం కూడా మనదే!

మతం పేరుతో ప్రజల ప్రాణాలను హరిస్తున్న జిహాదీ ఉగ్రవాదులతో పోలిస్తే, ప్రజల కోసం అన్నిటినీ వదులుకొని, ప్రాణాలు కూడా పణం పెట్టే నక్సలైట్లు దైవ సమానులు.

ఎన్ కౌంటర్ లో మృతి చెందిన శాఖమూరి అప్పారావు తదితర నక్సలైట్ల ఆత్మ శాంతి కోసం ఈ కవిత. శాఖమూరికి ఈ కవిత నిజమైన నివాళి. ఎందుకంటే, ఈ కవితలో నేను వ్యతిరేకించినట్లుగానే, ఆరేళ్ళ క్రితం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలను వ్యతిరేకించాడు శాఖమూరి అప్పారావు.
 
గుత్తికొండ బిలం
 
మట్టిలో కాదు
నెత్తురులో జన్మించాను
మట్టిలో కాదు
నెత్తురోడుతూ మరణిస్తాను.

ఘనీభవించిన కన్నీటికి
నెత్తురిచ్చిన రూపం నాది
గుట్టలుగా కాల్చబడ్డ
రుధిరజ్యోత్స్నల తేజం నాది
మూడున్నర దశాబ్దాల
నిర్బంధానికి, నిషేధానికి
ఊపిరి బిగపట్టుకున్న
గుత్తికొండ బిలాన్ని.

మరతుపాకుల మోతకి
కాలి గజ్జెలు ఘల్లుమంటాయి
ఎన్ కౌంటర్ తూటాని
గుండె కదుముకుంటాను.

సమాజసేద్యానికి
పేగులు తెంచుకొని
పిడికిలి బిగించిన
కొమరయ్యలు, మజుందార్లు
కామ్రెడ్లు, ఆశయాలు

చదును చేయని గతం పొరలు
చీల్చుకొచ్చిన కలుపు మొక్కలు
మంత్రులు, భూస్వాములు
అధికారాలు, అవకాశాలు

ఆకాశానికి, పాతాళానికి
మధ్యనున్న అగాథాలు...

అవి పూడ్చేటందుకు
అధికారిక చర్చలు!!

విప్లవానికి జోలపాటలా?
ఉక్కుశాసనాల
కరకు మోసమా??

నిదురపోని గతం నాది
నిదురలేని స్వప్నం నాది
ఎదిరించే నైజం నాది
ఎదురులేని నిజం నాది
మట్టిలో కలిసిపోని
ఒకేఒక్క ఇజం నాది
నెత్తురులో ఈదుతున్న
నక్సలిజం నాది.
 

13 comments:

  1. జిహాదీల లక్ష్యం మతం పేరుతో భయపెట్టడం. వాళ్ళేమీ ఆస్తి సంబంధాలని కదిలించాలనుకోవడం లేదు. పాలక వర్గం వాళ్ళ అభిప్రాయం ఏమిటంటే జిహాదీలు ఎంత హింస చేసినా ఫర్వా లేదు కానీ కోట్లు విలువైన తమ ఆస్తులు కొంచెం కూడా పోకుండా ఉంటే చాలు అని.

    ReplyDelete
  2. పైత్యంMarch 13, 2010 at 2:18 PM

    మాస్టారు సూపరుగా చెప్పారు.

    ReplyDelete
  3. Both are same. One is Pakistan sponsored , other is China supported. Jihadis are international whereas Naxals are only targetting India.

    Kiran, I am perplexed by your support of conflicting idealogies - Naxals & Religion. How do you think you can manage manage both extremes , together?! :)

    Hope you are not going contest for vacated MLA seats. :P

    Sankar

    ReplyDelete
  4. is there a difference between those two?

    ReplyDelete
  5. చాలా బాగా చెప్పారు.కవితా అద్భుతంగా రాశారు.మీ స్పందనకు అభినందనలు.ఇక జిహాదిలతో రాజకీయనాయకులకు ఏమీ ఇబ్బంది లేడుకదా?నక్సలైట్లు బలపడితే తమనుండి అధికారం చేజారిపోతుందనే భయం రాజకీయ నాయకులది.

    ReplyDelete
  6. ఏ పీడిత ప్రజల కోసమంటూ చెప్పి, వాళ్లనే చంపుతున్నారో, సాధారణ వ్యాపారులను బెదిరించి, డబ్బులు వసూలు చేయటం మొదలెట్టారో, వీళ్ల పనులవలన ఏ ప్రజలకోసము వీళ్లు ఉద్యమాలు చేస్తున్నం అని చెప్తున్నారో, ఆ ప్రజలే ఇబ్బందులు పడటం మొదలయ్యిందో, రాబందులను వదిలి కోడి పుంజుల వెనక వీళ్లు పడటం మొదలెట్టారో, లక్షలు లక్షలు గోతాలలో కూక్కుకోవటం మొదలెట్టారో, చదువు పెద్దగా రాని, వళ్లు వంచి పనిచేయటానికి వళ్లు వంగని వాళ్లు, నిబద్దత అంటే అర్ధం తెలియని క్యాడర్ కూడగట్టుకోవటం మొదలయ్యిందో,
    ఆ రోజే మావో లు అనేది చైనా స్పాన్సర్ చేస్తున్న ప్రైవేట్ సైన్యం అయింది, వీళ్లకు మతం పేరుతో పాకిస్తాన్ స్పాన్సర్ చేస్తున్న జీహాదీలకు తేడా ఉంది అని ఎలా అనగలరు?
    ఇద్దరూ నిరుద్యోగ యువతను మతం పేరుతోనో, ఇడియాలజీ ల పేరుతోనో ఆకర్షించి హింసను ప్రేరే పిస్తున్న గ్రూపులే. కాదంటారా?

    ReplyDelete
  7. చట్టం న్యాయం సరిగ్గా పనిచేస్తూ, రాజకీయల నుండి విడివడి *తప్పు చేసినోణ్ణి* కఠినంగా శిక్షిస్తే, నక్సలైట్లు అవసరం లేదు, ఎవరూ అవసరం లేదు.
    ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకపోవటం అనేది, నిజమైన పోరాటాలు అనేవి ఒకప్పటి మాట. గుత్తికొండ బిలం, అక్కిరాజు హరగోపాల్ (ఈయన్ది గుత్తికొండే) ఉరఫ్ రామకృష్ణ ఇవన్నీ ఓ శకం. ఇప్పుడు ఇదీ నిజమైన అజెండా అని ఒక్కటి చెప్పండి. అసలెవరు చేరుతున్నారు, ఎవరు తుపాకీని పడుతున్నారు. ఉదా॥ బావ రేప్ చేస్తే మరదలు కోపంవచ్చి నక్సలైట్లలో చెరింది. ఇది ప్రజాస్వామ్యం పై పోరాటం కాదు. లంచగొండి తనం పై విజయవంతమైన నక్సలైట్ల పోరాటం లేదు. నిజమైన మెరుగైన సమాజమ్ కొఱకు పోరాటం లేదు. ఇది కేవలం సో కాల్డ్ డిప్రైవ్డ్ మరియూ సో కాల్డ్ అణగారిని అణిచివేయబడిన (అని అనుకుంటున్న) కులాల వాఋఇ సమూహంలా ఉందే తప్ప. పోనీ అదైనా హక్కుల కోసం జరిగిన విజయవంతమైన పోరాటం ఎక్కడా? పోనీ ఓ చుండూరి సంఘటనపై నక్సలిట్ల పంధా ఎక్కడా? లేక ఓ కారమ్చేడు సంఘటనపై నక్సలైట్ల పంధా ఎక్కడా?
    నక్స్లలిజం ఇప్పుడు ఓ చుక్కాణి లేని నావ. దేనిపై పోరాటమో తెలియని ఓ హైడ్ ఔట్.
    ఐతే!! ఘన చరిత్రగల నక్సలైట్ పోరాటాన్ని, వారు చేసిన త్యాగాలని ప్రభుత్వం ఎప్పుడూ గుర్తించలేదు. ఇప్పుడు మీరన్నట్టు, నక్సలైటును బూటకపు ఎన్కౌంటర్ చేస్తే, జిహాదీలను ఔదు నక్షత్రాల సదుపాయాలతో గౌరవిస్తోంది. అది మన దౌర్భాగ్యం.
    పన్ను కట్టే ప్రతీ పౌరుడికి ప్రభుత్వం జవాబివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

    ReplyDelete
  8. పట్టణాలలో కన్నా, గ్రామీణ ప్రాంతాలలో ఈ నక్సలైట్లను ఇప్పటికీ సమాదరిస్తున్నారు ప్రజలు. నక్సలైట్లు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారనే ఆక్షేపణలు, అభియోగాలు ఉన్నా, అవి కొంతవరకు నిజమే అయినా, అది అవసరమే అని నా అభిప్రాయం. మన ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి ఓ చెక్ పాయింట్ లా పనిచేయాల్సిన వ్యవస్థలు ఆ పని చేయనప్పుడు నక్సలైట్ల అవసరం తెలుస్తుంది.

    ReplyDelete
  9. // ఎన్ కౌంటర్ లో మృతి చెందిన శాఖమూరి అప్పారావు తదితర నక్సలైట్ల ఆత్మ శాంతి కోసం ఈ కవిత. శాఖమూరికి ఈ కవిత నిజమైన నివాళి. ఎందుకంటే, ఈ కవితలో నేను వ్యతిరేకించినట్లుగానే, ఆరేళ్ళ క్రితం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలను వ్యతిరేకించాడు శాఖమూరి అప్పారావు. //

    So what? ఇలాంటి కారణాలతో కూడా నివాళులిస్తారా?!

    నేను రెస్టారెంట్ లో తిన్న మసాలాదోసె ఆర్డర్ చేసుకున్న వారికందరికీ కూడా కవితా నివాళులు ఇచ్చుకోవచ్చా? :O

    ReplyDelete
  10. Naxals ku grahaSaanti baagunnaTTu lEdEmO , Saanti chEyinchanDi. :P

    ReplyDelete
  11. I agree with Home Minister. What he said is a fact.
    Naxalites are more organised terrorists, spread over wide area in India than sporadic Jehaadis.

    ReplyDelete
  12. Mantra-Tantra-Yantra Vigyan for Naxals is not a bad idea , try that :))

    ReplyDelete
  13. సారే జహాసె అచ్చా - హిందుస్తా హమారా

    హం బుల్ బులే హై ఇస్‌కీ యే గుల్ సితా హమారా,హమారా.

    పర్ బత్ వో సబ్‌సే ఊంచా హంసాయ ఆస్‌మాకా వోసంతరీ హమారా - వో పాస్ వా హమారా,హమారా.

    గోదీమె ఖేల్ తీ హై ఇస్‌కీ హజారో నదియా గుల్షన్ హై జిన్ కీ దమ్ సే రష్‌కే జనా హమారా, హమారా.

    ఆయె అబ్ రౌద్ గంగా ఓ దిన్ హె యాద్ తుజ్ కో ఉతారా తేరె కినారే జబ్ కారవా హమారా మజ్ హబ్ నహీ సిఖాతా ఆపస్‌మే బైర్ రఖనా హింధీ హై హం(3) వతన్ హై హిందూ సితా హమారా,హమారా.

    యూనాన్ ఓ మిస్ర్ ఓ రోమా సబ్ మిత్ గయే జహా సే అబ్ తక్ మగర్ హై బాకీ నామ్ ఓ నిషాన్ హమారా

    కుచ్ బాత్ హై కె హస్తి మిఠాతీ నహీ హమారా సదియో రహా హై దుష్మన్ దౌర్ ఏ జమాన్ హమారా

    ఇక్బాల్ కో ఐ మెహ్రామ్ అప్నా నహీ జహా మే మాలూమ్ క్యా కిసీ కో దర్ద్ ఏ నిహా హమారా

    సారే జహాసె అచ్చా...

    * అర్ధం:

    Better than the entire world, is our Hindustan; we are its nightingales of mirth, and it is our garden abode

    Though in foreign lands we may reside, with our homeland our hearts abide, Regard us also to be there, where exist our hearts

    That mountain most high, neighbor to the skies; it is our sentinel; it is our protector

    In the lap of whose, play thousands of rivers; gardens they sustain; the envy-of-the-heavens of ours

    O waters of the Ganga mighty, do you recall the day when on your banks, did land the caravan of ours

    Religion does not teach us to harbour grudges between us Indians we all are; India, our motherland

    While Greece, Egypt , Rome have all been wiped out till now yet remains, this civilization of ours {it has stood the test of time}

    Something there is that keeps us,our entity from being eroded For ages has been our enemy, the way of the world

    Iqbal! Is there no soul that could understand the pain in thy heart?
    "విశాల విశ్వంలో నా భారత దేశం ఉన్నతం" అంటూ ఈపాట తెలుగులో ఆకాశవాణిలో ప్రసారమయిందట.ఎవరన్నా ఆపాట తెలుపగలరు.

    ReplyDelete

మీ అభిప్రాయం :