Thursday, April 1, 2010

కవిత్వం గురించి కొన్ని మాటలు

అలోక్ వాస్తవ్ గారు వ్రాసిన "కవిత్వం గురించి కొన్ని మాటలు" ఆవకాయలో...

కవిత్వం వొంటరిగా వున్న మనసులో పుట్టుకొచ్చినప్పుడు కవి మాత్రమే దాని సాక్షి. మూగవాడు సాక్ష్యం చెప్పాలంటే యెంత కష్టమో వొంటరితనంలో జరిగిన అంతర్మధనాన్ని బైట ప్రపంచానికి పరిచయం చైడం గూడా అంతే కష్టం. యిల్లా అష్టకష్టాలు పడి జీవితకాలంలో పట్టుమని పది కవితలు రాయడం గొప్ప. గానీ మన తెలుగునేలలో సంవత్సరానికో సంకలనం అదీ కనీసం 50-70 కేకలు పెడబొబ్బల్తో విసర్జించే ఘనాపాఠీలున్నారంటే సదరు కవిత్వం పుట్టుక యెల్లాంటిదో వూహించడం సులువు.

.....
మెప్పుకోసమో, సానుభూతి కోసమో రాసేది కవిత్వం కాలేదు. అరువు దెచ్చుకొన్న ఆవేశాలతో కవితలు పుట్టవు. పెట్టుడు మీసాలు గిన్నీసుబుక్కులోకి యెక్కవు. దుక్కిదున్ని, విత్తు విత్తకండానే సంకలనాల కొద్దీ కవిత్వ వ్యవసాయం జేయడమనేది వో మానసిక రోగం. నిజమైన బాధతో మాట్లాడినప్పుడు పచ్చి తాగుబోతు గూడా కవిత్వంలాంటిదే చెప్తాడు. దానికంటే హీనంగా రాసి కవిత్వమని బుకాయించడం "ఆత్మలోకంలో దివాలా" అనే జెప్పాలి.

పూర్తి వ్యాసం ఇక్కడ ....

3 comments:

  1. you are 100% correct. poetry is so serious subject ..to you and to mee.. but not for others.
    what to do..? just ignore it..if it is not good
    poetry..

    ReplyDelete
  2. పాఠకులకు ఓ గమనిక : ఈ వ్యాస రచయితను నేను కాదు. ఆవకాయ.కామ్ లో ప్రచురింపబడిన ఈ వ్యాసాన్ని అందరికీ అందుబాటులో తీసుకువద్దామని ఇక్కడ లింకు ఇవ్వటం జరిగింది.

    ReplyDelete
  3. మంచి వ్యాసాన్ని గురించి తెలిపినందుకు కృతజ్ఞతలు. నచ్చిన కొన్ని వాక్యాలు

    "కవిత్వం ఆత్మను ప్రదర్శిస్తుంది. కవిత్వమెప్పుడూ యేకాంతంలోనుండి పుట్టుకొస్తుంది. కవి యేకాంత మానసంలో జరిగిన మధనం చదువరి మనసులో కూడా జరగడమే రసాస్వాదన. అంటే వొక ఆత్మ మరో ఆత్మతో సంభాషించడం. ప్రపంచంలోకెల్ల కష్టమైన పని యిదేనని నా అభిప్రాయం."

    ReplyDelete

మీ అభిప్రాయం :