Saturday, August 7, 2010

ఎపి మీడియా రాము గారికి, కలగూరగంప తాడేపల్లిగారికి ఓ "తాంబూలం"

ఈ టపా శీర్షిక సరదాగా తీసుకోమని మనవి.

ఓ దశాబ్దం క్రితం వరకు, అక్కడక్కడా, అప్పుడప్పుడు మాత్రమే జరుగుతున్న సంఘటనలుగా భావించే "మగవారిపై గృహహింస" ఈ మధ్య కాలంలో తరచుగా చదువుతున్నాము. అలానే, గృహ హింసపై, వరకట్న హింసలపై ఉన్న చట్టాలను కూడా కొందరు దురుపయోగం చేస్తున్న తీరు కూడా ఈమధ్య కాలంలో మరీ ఎక్కువైందనే చెప్పవచ్చు. ఈ విషయానికి సంబంధించి ఈరోజు "ముంబాయి మిర్రర్" పత్రికలో వచ్చిన ఒక వార్త 'తాడేపల్లి" గారి వాదనలోని కొన్ని భయాలను నిజం చేస్తున్నది. ఇక చదవండి :


14 comments:

  1. 'తాడేపల్లి" గారి వాదనలోని కొన్ని భయాలను నిజం చేస్తున్నది

    కొన్ని నిజాలని చూసి భయం వేస్తున్నది
    ఇది కరెక్టేమో!!!

    ReplyDelete
  2. ఇదేమి కొత్త కాదు కదా మిత్రమా పూర్వ కాలం నుంచి భార్యా బాధితులు ఉన్నట్లు పురాణాలు తెలుపుతూనే ఉన్నాయి కదా మరి విడ్డురం కాకపొతే మీడియా శకం వచ్చినప్పటినుంచి ప్రతి చిన్న విషయం భూతద్దంలో పెట్టి చుబిస్తున్నారు. పాపం కశ్యప ఋషికి దితి లాగ ఉండే పెళ్ళాలు వాళ్ళనించి పుట్టే అసురుల్లాంటి పిల్లలు లేరా ఏమి. కైకసికి రావణుడు ఉరికే పుడతాడా? కాక పొతే కొట్టే మగ వాళ్ళ సంఖ్య ఎక్కువ తన్నులు తినే మగ వాళ్ళ సంఖ్య తక్కువ అందుకే కదా తన్నులు తినే మగ వాడి గురించి బయట పడ్డ ఒక్క కేసును ఇంత ప్రచారం సాగిస్తున్న విధానం చూస్తేనే తెలుస్తుంది కదా సాధారణం గ జరిగేదానికి వెరైటీ గా ఉందనే కదా ప్రత్యకంగా చుబిస్తున్నారు. మరి మేము మగ వాళ్ళం చాల బుద్ధి మంతుఅలం అని రెచ్చి పోనక్కర లేదు. అది శరీర తత్త్వం పురుషునికి ఉద్దండత, స్త్రీకి అణకువ సహజ లక్షణాలు అవ్వి తారు మారైనప్పుడు ఇలా బయట పడుతూ ఉంటారు. ఏమంటారు ?

    ReplyDelete
  3. భయాలు అనే పదమిక్కడ సరికాదు. ఇవి భయాలు కావు, వాస్తవాలు. This is a thoroughly researched subject. ఆడవాళ్ళ కోసం అని చెప్పబడే చట్టాలన్నింటి ప్రధానలక్ష్యం మగవాడి కష్టార్జితాన్ని, అతని ఆస్తినీ ఆడదానికీ, ఆమె తరఫున లాయర్లకీ, పోలీస్ కాన్‌స్టేబుళ్ళకీ దోచిపెట్టడం. ఈ తరహా కేసుల్లో నూటికి తొంభై బోగస్ అని తేలింది కూడా. ఈ చట్టాలు చాలా అమానుషమైనవి. ఎందుకంటే ఇవి ఐక్యరాజ్యసమితి ఆమోదించిన, మన దేశం సంతకం చేసిన మానవహక్కుల చార్టర్ కి పూర్తి విరుద్ధమైనవి. కనుక ఎవఱైనా వీటి మీద International Court of Justice ని సమీపిస్తే వీటిని భారతప్రభుత్వం రద్దుచేయక తప్పదు. ఉదాహరణకి అంతర్జాతీయ మానవహక్కుల చార్టర్ ప్రకారం - ఎవఱైతే నేఱారోపణ చేస్తారో వారే ఆ నేఱానికి సంబంధించిన ఋజువులను సమర్పించాల్సి ఉంటుంది (Burden of proof). అలా సమర్పించలేకపోతే కేసు కొట్టివేయబడుతుంది. కానీ ఈ భారతీయ ఫెమినిస్టు చట్టాల ప్రకారం ఎవఱి మీదైతే నేఱారోపణ చేయబడుతుందో వారే తాము నిర్దోషులమని నిరూపించే సాక్ష్యాధారాలు సమర్పించాలి, నేఱారోపణ చేసినవాళ్ళు ఆ నేఱారోపణ ఒక్కటి చేసి ఇంట్లో కూర్చుని హాయిగా గోళ్ళు గిల్లుకోవచ్చు. ఆరోపించబడ్డ మగవాణ్ణి చితక్కొట్టే పనిని పోలీసులు చూసుకుంటారు. ఒకవేళ ఆ వ్యాజ్యం వట్టి తప్పుడు వ్యాజ్యమనీ, కేవలం ప్రతివాది పట్ల వ్యక్తిగత కక్షకార్పణ్యాలతో వేసినదనీ బయటపడ్డాక కూడా అలా తప్పుడు నేఱారోపణలతో ప్రతివాదిని హింసించినందుకూ, కోర్టు యొక్క విలువైన సమయాన్ని వృథా చేసినందుకూ వాది (ఆడదాని) కి ఏ విధమైన జరిమానా ఉండదు. ఇందులో ఏం న్యాయం, ఇంగితజ్ఞానం ఉన్నాయో ఒకసారి ఆలోచించండి.

    ReplyDelete
  4. ఎక్కడో ఒకటో అరో జరిగే సంఘటనల ఉదా.లతో మొత్తం వ్యవస్థలోని ఆధిపత్య భావజాలాన్ని తప్పుదోవ పట్టించలేం. కుంటి వాడైన ముష్టివాడు కూడా కదలలేని పరిస్థితులలో కూడా తనకు సహాయపడుతున్న ఆడదానిపై చేసే దాష్ఠీకం మనం నిత్యం చూస్తున్నాం. elite group లో జరిగే సంఘటనల ద్వారా అంతా ఒకే గాటన కట్టేయడం సమస్యను దారిమళ్ళీంచడమే...

    ReplyDelete
  5. ఇది ఎ౦త నిజమో తెలియదు.కానీ, దీని సాకుతో ఆ చట్టాలను సవరి౦చడ౦ మ౦చిది కాదనిపిస్తో౦ది. ఈ కథ నిజమే అయితే, ఇటువ౦టి మహిళల స౦ఖ్య ఎ౦తో తెలియదు కానీ, దాదాపు నూటికి డెబ్బయ్-ఎనబై ఇళ్ళలో పురుషులదే ఆధిక్య౦. అ౦దునా కనీస౦ యాబై ఇళ్ళలో ప్రతి రోజూ, ప్రతి చర్యలోనూ పురుషాహ౦కార ప్రదర్సన కనిపిస్తు౦ది. ఇక గణనీయ౦గానే హి౦స జరుగుతు౦ది. ఏవో ఒకటి రె౦డు వ౦దల స౦ఘటనలు చూసి లక్షల మ౦దికి మేలు చేకూర్చే చట్టాలను నీరు కార్చకూడదు. దాదాపు అయిదేళ్ళుగా నరక౦ అనుభవి౦చి, కేసు కూడా పెట్టలేని అసహాయతతో పిల్లలతో ఒ౦టరి జీవిత౦ గడుపుతున్నకనీస౦ నలుగురు మహిళలు నాకే తెలుసు.

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. This comment has been removed by the author.

    ReplyDelete
  8. ఇక్కడ విషయం పక్కదారి పడుతున్నట్లుగా ఉంది. అసలు టాపిక్ మనదేశంలో మహిళా చట్టాలు, వాటి అమలు తీరు కానే కాదు. కొండొకచో మన దేశంలో ఎలాంటి చట్టమయినా మిస్‌యూస్ అవుతుందనేది అందరూ ఒప్పుకునే విషయమే.

    ఈ డిస్కషన్ మొదలు కావడానికి కారణం ఒక వ్యక్తి ప్రవర్తనను సమర్ధిస్తూ తాడేపల్లి గారు మగవాడికి కోర్ట్‌షిప్ చేసే హక్కు ఉండాలి, పెల్లయి పిల్లలు ఉన్నా సరే అని వాదించడమే. ఆ కోచ్ విషయంలో కానీ, ఇక్కడి ఉదాహరణలో కానీ ఎవరిది తప్పు అనేది అప్రస్తుతం. తాడేపల్లి గారు వాదించేట్లుగా మగవారికి కోర్ట్‌షిప్ చేసే హక్కు ఉండాల, లేదా అనేదే అసలు కాంట్రావర్సీ.

    మగవారికి కోర్ట్‌షిప్ చేసే హక్కు ఉంటే, ఆడవారికి కూడా కోర్ట్‌షిప్ చేసే హక్కు (పెల్లి, పిల్లలతో సంబంధం లేకుండా) ఉండాలా? అలా ఉంటే మగవాడు భరించగలడా, కుటుంబ వ్యవస్థ నిలుస్తుందా అనేది నా సందేహం. మగవారి హక్కులకోసం వాదిస్తున్న తాడేపల్లి గారు గ్రహించాల్సిందేమంటే ఈ హక్కు వలన చివరికి నష్టపోయేది మగవాడే. ఆడది బరితెగిస్తే ఎవరూ నో చెప్పరు మరి.

    ReplyDelete
  9. అస్సలు ఈ ఆధిపత్య ప్రదర్శనకు కారణాలేమయ్యి వుంటాయి?ఇది ఏమైనా మానసిక బలహీనతా?

    ReplyDelete
  10. *అసలు టాపిక్ మనదేశంలో మహిళా చట్టాలు, వాటి అమలు తీరు కానే కాదు. కొండొకచో మన దేశంలో ఎలాంటి చట్టమయినా మిస్‌యూస్ అవుతుందనేది అందరూ ఒప్పుకునే విషయమే*
    సత్యాన్వేషి గారు, మీకు ఈ చట్టం మీద పూర్తి అవగాహన లేదు కనుక పై విధంగా రాశారు. కొండొకచో మన దేశంలో ఎలాంటి చట్టమయినా మిస్‌యూస్ ఐతె దాని సవాలక్ష కారణాలు ఉండ వచ్చు మీరు బాగా పరిశీలిస్తె వివాహం అనేది పెద్దలు కుదిర్చినది కాని లేక పోతె ప్రేమ పెళ్లిలు చేసుకుంటారు. అంటే ఇరువర్గాలు ఆచి తూచి, పరస్పర అంగీకారం తో, దాదాపు 100% నమ్మకంతో చేసుకోనెది. మరి కేసు విడాకుల వరకు వేళ్ళింది అంటె అక్కడ కోర్ట్ అన్యాయం జరిగిన వారికి న్యాయం చేకూర్చాలి. కాని మన ప్రస్తుత చట్టాలు ఎలా ఉంది అంటె మహిళ లకు ఎంతో అనుకులం గా మగవారిని పీడించె విధంగా ఉన్నాయి.

    ReplyDelete
  11. @కెక్యూబ్,
    మీరు ఒక గొప్ప మనవతా వాది అనిపించు కోవాలన్న కోరిక చాలా ప్రస్పుటం గా కనిపిస్తున్నాది. మీరె కాదు బ్లాగులో ఉన్న మరి కొందరు తాడేపల్లి కి మావత్వం లేదనే విధంగా రాయటం వారికి ప్రస్తుత సమాజంలో జరుగుతున్న దాని మీద వారి అవగాహన లేమి ని సూచిస్తున్నాది. కత్తిగారు అసలికి తాడేపల్లి గారికి మానవత్వ విలువలు లేవని రాశారు. శివగారు ఇతను తిమ్మిని బమ్మిని చేసే వాదన అనేవిధంగా మాట్లాడారు.
    -------------------------------------------
    నిన్నె తీసుకో నిద్దర లేస్తె భారత ప్రభుత్వాన్ని దూయ బడుతూంటావు, ఎర్ర జెండా వారందరు మానవతకు ప్రతీకగా రాస్తుంటావు. ఎర్ర జెండా వారికి ఎదైన జరిగితె ప్రభుత్వాన్ని దుమ్మెతి పోసె నువ్వు ఇప్పుడు మాత్రం భారత చట్టాం వలన అన్యాయం జరిగిన/జరుగుతున్న భర్తాలు,భార్యా పీడీతులు తమ నిరసన గళాని తోక్కి వేయటానికి సిద్దపడుతున్నావు. వారు మేజారిటి కాదు కనుక నోరెత్తకుండా భాదలు పడాలాని నీ ఉద్దేశం కాబోలు. వారికి కనీసం చట్ట ప్రకారం విడాకులు రాక కోర్ట్ చుట్టు అనవసరం గా తిరుగు తున్న వారేందరో ఉన్నారు. వారి మానసిక వ్యథ తో నీకు అవసరం (ఎర్ర జెండా వారికి రాజకీయం గా ) ఉండాక పోవచేమొ గాని వారిని భారత చట్టం ప్రకారం నడుచుకొని, కోర్ట్ చుట్టు తిరుగుతూ, పెళ్ళి చేసుకున్న నేరానికి జీవితానత భాదపడాలని చెప్పె హక్కు నీకు లేదు. నీకే కాదు ఏ మనిషికి లేదు.

    -------------------------------------------------
    *కుంటి వాడైన ముష్టివాడు కూడా కదలలేని పరిస్థితులలో కూడా తనకు సహాయపడుతున్న ఆడదానిపై చేసే దాష్ఠీకం మనం నిత్యం చూస్తున్నాం. *
    నువ్వు గొప్ప మానవతావదివి కనుక నిద్దర లేచిన మొదలుకొని పై సంగటనలు చూస్తూ ఉండవచ్చు. ఇకనుంచి నీకు చేతనైతే అటువంటి మగ వారి పై ఆడవారి చేత విడాకుల కేసు పేట్టించి వారికి ఇప్పించేది. కాని నువ్వు ఆపని చేయవు . ఒక వేళ తమ లాంటి వారు ముందుకు వచ్చి కుంటి వాడైన ముష్టివాడి భార్య తరపున కోర్టు వరకు వెళ్ళితే ఒక్క లాయర్ కూడా వాదించటానికి ముందుకు రారు ఎందుకంటె ఇటువంటి డబ్బులు లేని చావు గిరాకీ కేసులను ఎవ్వరు తీసుకోరు కనుక. ఇవ్వని నీకు తెలియని వి కాదు కదా. తెలియక పోతె ఒక సారి పేదవారికి జరిగే న్యాయం మీద రావి శాస్త్రి, చెరబండ రాజు రాసిన కథలు, సాహిత్యం చదువుకొనేది.వాదనకు వచ్చిన ప్రతిసారి ఎదో పేదవారికి చట్టం వలన అన్యాయం జరుగుతున్నట్లు మాట్లాడుతారు. మిగతా చటాల వలన పేదవారికి అన్యాయం జరుగుతుందేమోగాని ఈ చట్టం ఉప యోగించుకొని ఎంత మంది కూలి నాలి, పూరి గుడిసేలో ఉండేవారు విడాకులు తీసుకున్నారో తమలాంటివారు ఒక సారి ప్రశ్నించుకోండి. కనుక పేద తరగతి వారి ఈ చట్టాం వలన పెద్దగా లాభనష్టాలు రెండూ లేవనుకుంట్టున్నాను. వారి గురించి మీరు ఈ చట్టం విషయం లో భాద పడవలసిన అవసరం లేదు.

    *elite group లో జరిగే సంఘటనల ద్వారా అంతా ఒకే గాటన కట్టేయడం సమస్యను దారిమళ్ళీంచడమే*
    ఎలైట్ గ్రుప్ వారు అని ఇప్పుడు మీరు చాలా ప్రత్యేకించి రాస్తున్నారు. వారు ఈ దేశానికి చేసిన అన్యాయం ఎమీటి సార్? నిద్దర లేచిన మొదలు వారికి మెట్రొ సిటి లో ఇల్లు,ఆఫీసు అనే రేండు పనులు చూసుకొనే టప్పటికి రోజులో 16 గం|| సమయం అయిపోతున్నాది . అటువంటి వారి నెత్తిన అమ్మానాన్నల ప్రోద్బలంతో, చుట్టాల,లాయర్ల సలహాల తో ఒక విడాకుల కేసు వేసి వారిని ప్రతి వాయిదాకు కోర్టుకు తిప్పుకుంటూ రాచి రంపాన పెట్టవలసిన అవసరం ఎమీటి?

    ReplyDelete
  12. మీ ఎర్ర జెండావారికి ఉచితంగా వాదించటానికి వరవర రావు, కన్నాభిరాన్ మొన్నటివరకు బాల గోపాల్ ఉన్నారు. అదే ఇటువంటి విడాకుల కేసుల విషయంలో కోర్ట్ గుమ్మం ఎక్కితె అందరు మగ వారిని దోచుకోవటానికి ఆరాట పడేవారె. ఇక్కడ వీడాకుల కేసులు వాదించె లాయర్లు,పోలీసులు ఒక వ్యవస్తగా తయారయ్యరు. కోర్ట్ గుమ్మం ఎక్కగానె లాయరు గారు మీ భర్తకున్న ఆస్థులేంతా దానిలో నీకు ఇంత % ఇప్పిస్తాను, వచ్చె దానిలో నాకింత % నువ్వు ఇవ్వాలి. వాడు దారికి రాక పోతె ఎన్ని రకాల హింస పెట్ట వచ్చొ అన్ని రకాలు పెడతారు. తమరికి తెలుసోలేదో వాయిదా ఉన్న ప్రతి నెల మగ భర్త హాజరు కోర్తులో తప్పనిసరి అదే ఆడవారు హాజరుకాకపోతె ఏమనరు.

    ReplyDelete
  13. @శ్రీకర్ : కూల్ కూల్.. మీరు ఎవరితొ వాదిస్తున్నారొ తెలుసుకదా :-) కమ్యూలతొ... వాళ్ళ దగ్గరనుండి వచ్చే రెస్పాన్స్ అర్దవంతంగా వుండాలని ఆశిస్తే అది చాలా అత్యాశే :-))

    ReplyDelete
  14. ఈ కథ నిజమే అయితే, ఇటువ౦టి మహిళల స౦ఖ్య ఎ౦తో తెలియదు కానీ, దాదాపు నూటికి డెబ్బయ్-ఎనబై ఇళ్ళలో పురుషులదే ఆధిక్య౦. అ౦దునా కనీస౦ యాబై ఇళ్ళలో ప్రతి రోజూ, ప్రతి చర్యలోనూ పురుషాహ౦కార ప్రదర్సన కనిపిస్తు౦ది.
    __________________________________________________

    Do you have any data to support your claim other than the 4 women that you have mentioned?


    ఏవో ఒకటి రె౦డు వ౦దల స౦ఘటనలు చూసి లక్షల మ౦దికి మేలు చేకూర్చే చట్టాలను నీరు కార్చకూడదు
    ________________________________________________

    ఏవో ఒకటి రెండు లక్షలని చూపించి కొన్ని కోట్లమందిని ఇబ్బంది పెట్టే చట్టాలు కూడ ఉండకూడదు అయితే - One thing is sure, as Srikar and Tadepally mentioned, the Indian judicial system is extremely biased towards the women - సమానత్వం ఎమయిపోయింది ఇక్కడ?

    ReplyDelete

మీ అభిప్రాయం :