Friday, August 13, 2010

శ్రీరామచంద్రకే ఓటేయండి.... ప్లీజ్

 

అప్పట్లో ఇండియన్ ఐడల్ పోటీలో, కారుణ్య తెలుగువాడు, బాగా పాడుతున్నాడు, ఒక పోటీ ఫైనల్ లో వచ్చాడు అన్న ఉద్దేశ్యంతో ఓట్లేసాను. కారుణ్య ఓడిపోయిన తర్వాత, ఆ పోటీకి అర్ధమే లేదనిపించి, తరువాతి పోటీలు లైటుగా తీసుకుంటూ వచ్చా.

ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ఐడల్ పోటీలో శ్రీరామచంద్ర చాలా బాగా పాడుతున్నాడు. అయినా లాభం ఏముంది, ఉత్తరాది ఓట్ల ముందు మనం ఎన్ని ఓట్లు వేసినా ప్రయోజనం లేదని భావించి ఇంతవరకూ ఓటు వేయలేదు.  ఈరోజు యాధాలాపంగా యలమంచి కిరణ్మయి గారు ఫేస్ బుక్ లో ఇచ్చిన యు ట్యూబు లింకులో ఈ పాట విన్న తర్వాత అనిపిస్తుంది... ఇటువంటి గాయకులు ఎన్నో తరాలకు గానీ జన్మించరని. సాన పెట్టిన వజ్రం ఎక్కడైనా మెరుస్తుందనేది నిజమే అయినా, శ్రీరామచంద్ర లాంటి అద్భుతమైన గాయకుడు ఇండియన్ ఐడల్ గా నెగ్గకపోతే, ఆ పోటీ, ఓట్లు వేసే శ్రోతల సంగీతాభిమానం కూడా అనుమానాస్పదమే ఔతుంది.

ఆ మాటకొస్తే, ఈ పాట వింటే, బహుశా రాకేష్ తనంతట తనే పోటీ నుంచి విరమించుకోవచ్చు కూడా. మీ స్నేహితులకు ఈ లింకు చూపి, విన్న తర్వాతే వోట్లేయమని చెప్పండి, ప్లీజ్. ఇటువంటి గాయకుడు ఓడిపోకూడదు. ప్రాంతీయాభిమానంతో కాదు, అతని టాలెంటుకు వోటు వేయండి, వేయించండి.

6 comments:

  1. awww.. I'm soooo glad you saw that link! Yes, he is a gifted singer and he should definitely win the title..

    I've been following him since ETV's 'Sye' :-)

    ReplyDelete
  2. ఇలాంటి తిక్క పనులు తిక్కలోళ్ళే చేస్తారు. లేకపోతే ఏంటీ ఓటేస్తే (SMS)సంగీత పోటీలో గెలవడమేమిటీ. కార్పొరేట్ కంపెనీల గేం ఇది. వాళ్ళనే ఆడుకోనివ్వండి. ఇప్పుడు శ్రీరామచంద్ర కి ఓటేయకపోతే తెలుగు ఇమేజికొచ్చిన డామేజీ ఏమీలేదు. తెలుగోళ్ళు చేయాల్సిన పనులు (రామచంద్రకు ఓటేయడం కాకుండా ) చాలా ఉన్నాయి . రామచంద్రకు ఓటేస్తేనే తెలుగు తేజం నిలబడిపోయినట్టా? ఓడిపోతే తెలుగోళ్ళందరూ ఓడిపోయినట్ట్ళా ? ( నా ఈ జనరలైజేషన్ అన్ని భాషల వాళ్ళకూ వర్తిస్తుంది). ఇంతకూ ఆ పోటీలో శ్రీరాం ఒక్క తెలుగు పాటైనా పాడాడా? నాకు గుర్తు లేదు. అన్నీ హిందీ పాటలే పాడినట్లు గుర్తు

    ReplyDelete
  3. //ఇటువంటి గాయకులు ఎన్నో తరాలకు గానీ జన్మించరని //
    ఈ పొగడ్త కొంచెం ఎక్కువగా వుంది కాని బాగా పాడాడు. ఇండియన్ ఐడొల్ కు అర్హుడు, వోటు వేయవచ్చు. ఈ రసిక రాజ పాట బాగా పాడాడు కాని, ఏదో .. ఏదో .. తక్కువైనట్టనిపించింది. ఎవరో తరుముతున్నట్టుగా పాడినట్టు అనిపించింది, మెలోడీ కూడ కాస్త తక్కువే. ఐతే మీరన్నట్టు డిట్టో గా దింపేశాడు.

    ReplyDelete
  4. హల్లో అనానిమస్ గారు ... మీ కామెంటు ఎడిట్ చేసి ప్రచురిస్తున్నాను.
    ======
    Anonymous has left a new comment on your post "శ్రీరామచంద్రకే ఓటేయండి.... ప్లీజ్":

    బ్లాగులో కొందరు మరీ అతి చేస్తునంటారు. అందులో మొదట వ్యక్తి ఈ శంకర్. ఇతనికి ఇష్టం లేక పోతే మూసుకొని కూచో వచ్చు కాని అతను అలాంటి వ్యక్తిలా లేడు. ఇతను వేలు పెట్టని విషయం ఉండదు.....

    *ఇటువంటి గాయకులు ఎన్నో తరాలకు గానీ జన్మించరని *
    ఈయనకి ఎంత ప్రవేసం ఉందో తెలూయ్దు కాని శ్రీరాం ని విమర్శించేటంతటి వాడు కాడు. ఒక వేళ శంకర్ అలా అనుకుంటె, ఆయన అంత గొప్ప సింగర్ ఐతె ఇప్పటికే ఇతని పేరు బ్లాగుల్లో కాక టి.వి. లో మారు మోగేది కదా. పెద్ద పుడింగి అనుకుంట్టున్నాడు. ఊరకనే శర్మ అనే ఆయన మీద పడటం, అతి గా విమర్శించటం తో ఇతను ఎమీ ప్రువ్ చేయాలను కుంట్టున్నడొ అక్కడ అర్థం కాలేదు. ఎదోలే చూడబోతే నాస్తిక వాద కన్నయ గారి అనుచరుడను కుంటె ఇక్కడ మళ్ళీ పాటల పాడేవారిని కూడా విమర్సించ కుండా వదలటం లేదు. ఇతనికి కొన్ని రోజుకు విశ్రాంతి అవసరం.
    -----------------------------------------------
    సాయి గారు మీరు చెప్పినట్లు శ్రీ రామచంద్ర తెలుగు వారికి ఈ తరం లో చిక్కిన ఒక అద్బుతం. ఇతనిని మీరు బాగా గమనిస్తె క్లాసికల్ సంగీతం లో కూడా ఒక మంగళంపల్లి అంత ఎత్తుకు ఎదిగే స్టామినా ఉంది. అలాగే సినేమా సంగితం లో ఇక చెప్పనక్కరలేదు. కాని రానున్న రోజులలో తెలుగు సినేమాలు ఎక్కువ చూసేవారు,తీసే వారు ఉండకపోవచ్చేమో కనుక ఇతను,కారుణ్య లాంటి వారు క్లాసికల్ సంగీతం మీద ఫోకస్ పేదితె మన సంగీతానికి రానున్న 30సం|| చీకు చింతా ఉండదు.

    ReplyDelete
  5. PuDangi - pEru baavundi. meerE kanipeTTaaraa?
    :))

    ReplyDelete
  6. గెలిచాడు కదా.పాడడం మాత్రమేనా ఆ హావభావాలు,ఆస్వాదిస్తూ పాడడం,సెలబ్రిటీలతో మాట్లాడే తీరు,అందం,గొంతును మార్చి పాడడం(ఆడ మగ గొంతులు),గెలిచాకా వినయం అన్ని విధాలా అర్హుడు ఇండియన్ ఐడల్ టైటిల్ కి తెలుగు వాడనో మరొకటనో కాదు దేశం గుండె దోచుకున్నాడు.
    నా దృష్టిలో భావి బాలసుబ్రహ్మణ్యం(ఇటువంటి గాయకులు ఎన్నో తరాలకు గానీ జన్మించరంటే అదే కావచ్చు).నిజంగా శ్రీరామచంద్ర ఎన్నో లక్షణాల కలనేత.
    ---సంతోష్ సూరంపూడి

    ReplyDelete

మీ అభిప్రాయం :