Thursday, September 9, 2010

సామాన్యుల పోరాటం కాదిది, మేధావుల పోరాటం - దళిత తీవ్రవాదం







* * *
పైన ఉటంకించిన వ్యాఖ్యలు చాలు, దళిత తీవ్రవాదాన్ని ఎగదోయడానికి కుహాన దళిత కామెడీ మేధావులు చేస్తున్న ప్రయత్నాలు అర్ధం చేసుకోటానికి.

శతాబ్దాల క్రితం జరిగిన అణచివేతకు, వివక్షకు ఈరోజు ఎవరిని బాధ్యుల్ని చేస్తారు? ఇకపైగా, ఆనాటి వివక్షను ఖండించి, దళితుల శ్రేయస్సు కోసం చట్టాలు చేసి, చర్యలు చేపట్టడం శాంతి మంత్రాలు జపించటమట! అంటే, దళితుల సంక్షేమం కోసం చట్టాలు చేసినా కయ్యానికి కాలుదువ్వటమే దళిత పోరాటపు ఏజెండా అన్నమాట!

అసలు దళిత ధిక్కారం మొదలయ్యింది ఈ రోజు కాదు. ధిక్కార స్వరాన్ని వినిపించింది అంబేద్కర్. దళిత పోరాటం మొదలేసింది ఈరోజు కాదు. మహాత్మా గాంధి, మహాత్మా ఫూలేలు ఆనాడే పోరాటం చేసారు. కాబట్టే, దళిత సంక్షేమమే ధ్యేయంగా ప్రత్యేక చట్టాలు రూపొందాయి. దళిత చట్టాలు సరిగా అమలుకాలేకపోతున్నాయంటే, దానికి కారణాలు వెదకాలి. దానికి కూడా అగ్రవర్ణాలని బాధ్యుల్ని చేయటం ఏమిటి?

ఒకటి మాత్రం నిజం. ఇస్లామిక్ తీవ్రవాదం, కాషాయ తీవ్రవాదం మూర్ఖులు నడుపుతున్నవే. అందుకే అవి హింసాత్మకంగా జరుగుతున్నాయి. కానీ, సోకాల్డ్ కుహానా దళిత మేధావుల నేతృత్వంలో మొదలైన దళిత తీవ్రవాదంలో అక్కడక్కడ తప్పించి రక్తం పారదు. కేవలం, ప్రజాస్వామికంగా చాపకింద నీరులా సామాన్య దళితుల మనసులను కలుషితం మాత్రమే చేస్తుంది. వర్గ వైషమ్యాలు పెచ్చరిల్ల చేస్తుంది. అగ్రవర్ణాల వారిని పొమ్మనకుండా పొగ బెడుతుంది. ప్రభుత్వాలు ఉపేక్షిస్తే, ఈ తీవ్రవాదం రేపు ఓ దళితస్తాన్ కావాలనే వరకు ఖచ్చితంగా కొనసాగుతుంది.

ఏ తీవ్రవాద సంస్థ అయినా వారి పోరాటానికి చెప్పే సాకులు అస్తిత్వం, అణచివేత, ఆత్మగౌరవం. ఈ దళిత తీవ్రవాదానికి కూడా ఈ సాకులే ఊతం. నిజానికి, ఈ దళిత తీవ్రవాదం సామాన్య దళితుల పోరాటం కాదు. దళిత మేధావుల పోరాటం.

అస్తిత్వం : ఇప్పుడు దళితుల అస్తిత్వానికి వచ్చిన ముప్పేమిటి? శతాబ్దాల క్రితం నాటి వివక్ష ఈరోజుల్లో ఉందా? ఈ కామెడీ మేధావుల ప్రకారం అస్తిత్వం అంటే, వారికి అధికారం కట్టబెట్టటం. దళితపోరాటం పేరుతో కోట్లు కూడబెట్టుకునే మాయావతులని, పాశ్వాన్ లని ప్రధానులుగా చేయటం!

అణచివేత : ఈ కామెడీ మేధావుల ప్రకారం అణచివేత అంటే, అయినదానికి, కాని దానికీ అగ్రవర్ణాలను నిరసించటం, వారిని అణచివేయటం. అంటే, చరిత్రను పునరావృతం చేయటం. గతంలో వారు ఏ అణచివేతకు గురయ్యారో, అదే అణచివేతను అగ్రవర్ణాలపై అమలు చేయటం. అసలు ఆ మాటకొస్తే, ఇప్పుడు మన దేశంలో ఒక్క రాజకీయ వర్గం తప్పించి మిగిలిన వర్గాలన్నీ అణచివేతకు గురౌతున్నవే.

ఆత్మగౌరవం : ఓ దళితుడిగా నేను వ్రాసిన కవిత బాగోలేదంటావా, అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరించే మేధావులు, దళితుల ఆత్మగౌరవం కాపాడటమే ధ్యేయంగా రూపొందించిన అట్రాసిటీ చట్టాలు సామాన్య దళితుల వరకు చేరవేయటంలో ఎంత వరకు కృషి చేస్తున్నారు? చట్టాలు అమలు చేయటంలోని విధివిధానాలలో ఉన్న లోపాలు ఏనాడైనా చర్చించారా?

ఈ దళిత కామెడీ మేధావులు నియో దళితిస్టు భావజాలంతో చేస్తున్న పోరాటం ఏమిటి? కాశ్మీర్ ను పాకిస్తాన్ కు, అరుణాచల్ ను చైనాకు ఇచ్చేయమనా ఈ పోరాటంఒక వ్యక్తిని వ్యక్తిగా విమర్శిస్తే, మా సమూహాన్ని విమర్శిస్తావా అని ధర్నాలకు దిగటమా పోరాటం? హిందువుల ఇతిహాస పురాణాలను అవహేళన చేయటమా పోరాటం? ఉన్మాదంగా, దేవతల నగ్న చిత్రాలను ప్రదర్శించి హిందువుల నమ్మకాలను నవ్వులపాలు చేయటమా పోరాటం? సభలు, సమావేశాల పేరుతో మందిని పోగుచేసి వాళ్ళ ఆలోచనలు కలుషితం చేయటం తప్పించి, దళితుల్లో నిరక్షరాశ్యత ఇంకా ఎందుకని తగ్గలేకపోతుందో, చట్టాలపై వారికున్న అవగాహనని ఎలా పెంపుచేయాలో అనే విషయాలపై ఇంతవరకూ ఈ కుహానా మేధావులెవరైనా ఆలోచనాత్మకమైన దృక్ఫధాన్ని చూపారా?

నిజానికి ఈరోజు, సామాన్య దళితులకు ముప్పు పొంచి ఉన్నది అగ్రవర్ణాల వల్ల కాదు. ఈ కామెడీ మేధావుల వల్లే ప్రమాదం. ఎందుకంటే, ఆనాడు అగ్రవర్ణాల వారు తమ దౌష్ట్యాన్ని ప్రదర్శించటానికి దళితులను వాడుకుంటే, ఈనాడు తమ స్వార్ధం కోసం ఈ దళిత మేధావులు వారిని పావులుగా చేస్తున్నారు. ఈ మేధావులు ఆశించినట్లుగా దళిత ఆత్మగౌరవ పోరాటం వీధిపోరాటాలుగా దిగజారితే, అసువులు కోల్పోయేది ఈ మేధావులు కాదు.

ప్రభుత్వాలు ఇకనైనా కళ్ళు తెరవాలి, కొరడా ఝళిపించాలి.

17 comments:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. My initial thougthts after reading this post.

    "కొరడా ఝళిపించాలి". Emduku, evari meedha "కొరడా ఝళిపించాలి"? koncham clear ga chepthara?.

    Prathi addamaina topic loki Ambedkar ni laagatam maanesthe baaguntundhemo. Meeku "Katti" ideology tho emanna issues unte avi ayanatho chusukonte baaguntundi.

    Ambedkar ante intha asahyam pettukoni "REAL" Dalits gurunchi thega worry aipothaaru... adento kadhaa? Meeru chepthunna "REAL" dalits ki Ambedkar devuditho samanam anedhi meeku theilyada. Lekunte vallaku Ambedkar gurunchi emi theliyadhu anukuntunnraa.


    Ambedkar may not be a Saint, but he did what he thought is good for his community. What's your problem with it.

    Anyway keep writing about Kuhana Dalit medhavulu to enlighten your readers(BTW i am also your regular reader).

    I would like to know whom you may call "REAL" Dalita medhavulu. Do I safely conclude that you have not yet seen any Medhavulu from Dalit castes in this country.

    Seems except Mayawati, Paswan every other politician is so effeicient and not corrupt.

    Regards,
    One of "REAL" dalit.

    ReplyDelete
  3. @ "REAL" dalit - In this article, where did you find indecent remarks about Dr. Ambedkar?

    ReplyDelete
  4. "Real" again here.

    "అసలు దళిత ధిక్కారం మొదలయ్యింది ఈ రోజు కాదు. ధిక్కార స్వరాన్ని వినిపించింది అంబేద్కర్."

    emi dikkaram gurunchi maatlaaduthunnaru meeru. Hindu matham meedha dikkaramaaa? or some thing else. could you please provide some reference regarding this. Why is it that Ambedkar's "ధిక్కారం" could n't be looked as another point of view on Hinduism or issues in Hinduism.

    BTW, meeru idhi cheppane ledhu. Meeku intha varaku "Dalitha medhavulu" evaru kanpincha ledhaa ee dheshamlo. Antha "Kuhana" dalitha medhavule kanipinchaaraaa.

    When you write about "Kuhana" medhavulu I look forward to see in your opinion who is/was a real "medhavi" from Dalit castes. If you cannot name any, then for a guy like me, there are only "Kuhana's" to look forward in our castes.

    Really I want to know from you on this.

    ReplyDelete
  5. అవును అసలు అంబేడ్కర్ గురించి ఇక్కడ నాకు చెడుగా ఏమీ కనిపించలేదే? అసలు మీరు ప్రస్తావించినవి ఏవీ టపాలో నాకు కనపడలేదే?

    >>అసలు దళిత ధిక్కారం మొదలయ్యింది ఈ రోజు కాదు. ధిక్కార స్వరాన్ని వినిపించింది అంబేద్కర్.

    దీనికంటే చాలా ముందునుంచే పోరాటాలు మొదలు అయ్యాయి కదా? అసలు రిజర్వేషన్లు కావాలి అనే భావన బ్రిటిషు హయాంలోనే మొదలు అయ్యింది కదా..
    ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు కాదు వారు అడిగినవి, అవి కుడా, దళితులకి అధిరాకరంలో భాగం లేకపొతే వారికి న్యాయం జరగదు అని రాజకీయాల్లో అడిగారు తప్ప, కనపడినచోటల్లా కాదు, అంబేడ్కర్ కుడా ఆ రిజర్వేషన్లు మాత్రమే ఆలోచించాడు..

    ReplyDelete
  6. హ హ హ... వ్రాసిన విషయాన్ని అపోహలతో చదివి మీరు కల్పించుకున్న అపోహ అది. అంబేద్కర్ మేధావే అనటంలో ఏమాత్రమూ సందేహం లేదు. అణచివేతకు వ్యతిరేకంగా ఈనాడు పోరాటం చేస్తున్నామని చెప్పుకునే "కుహానా" మేధావులకు "అయ్యా, ఈ పోరాటాన్ని అంబేద్కర్ ఆనాడే చేసాడు" అని చెప్పటమే అసలైన ఉద్దేశ్యం. ఆనాడు ఆయన హిందు మతాన్ని ధిక్కరించటానికి, కొందరు స్వార్ధపరుల వల్ల ఆ మతంలో వేళ్ళూనుకున్న అసమానతల నేపధ్యం ఉంది. మరి ఈనాటి నేపధ్యానికి, పోరాటం పేరుతో, హిందుమత విద్వేషాన్ని ప్రచారం చేయటం సబబు కాదు.

    ఇక ఎవరు మేధావులనే విషయానికి వస్తే, నేను విమర్శించిన లక్షణాలు లేనివారందరూ మేధావులే అని నా అభిప్రాయం.

    ReplyDelete
  7. Seems except Mayawati, Paswan every other politician is so effeicient and not corrupt.
    ===
    I don't think, you are a regular reader of my blog. I am sure you did not see my series of articles "మేడిపండు ప్రజాస్వామ్యం".

    No one is a holy cow in our Indian Politics. I honestly believe that our constitution too is not upholding the true spirit of Democratic Values.

    ReplyDelete
  8. @SaiKiran,

    I liked your post. You are bringing out good points for all of us to think.

    Unfortunately for us, the extremes on all sides are actually dominating the debate in our society. Everyone who espouses extreme views are justifying their existance by showing the other extreme. In this process, saner people and voices inspite of their majoriy are being silenced.

    I think our democracy is strong and will come out of the issues we are having as of now. We just need few more good leaders. We are getting there may be it will take another decade to bring about that maturity in to our democracy. So.. be glad about that and keep writing sir :)

    ReplyDelete
  9. సాయికిరణ్ గారు,
    మీ విశ్లేషణ బాగుంది. ఒకటిమాత్రం నిజం సర్ ,ఈ హిందూ ధర్మాన్ని ద్వేషించే ఈ మేధావులు ఒక్కడైనా మూల గ్రంధాలు చదువలేదు. కొంతమంది స్వార్ధపరులు వారి అస్తిత్వం నిల్లుపుకోవటం కోసం వ్రాసిన పనికిమాలిన రాతలని చదివి వాటికి మరికొంత వీళ్ళ భావజాలాన్ని రుద్ది సమాజాన్ని, వీళ్ళని గుడ్డిగా నమ్ముతున్న అమ్మాయకులను ఉద్యమాల పేరిట సమాజంపై విద్వేషా భావాన్ని కలిగిస్తున్నారు. అమ్బెడ్కర్గారు ముసాయిదా కమిటికి అద్యక్షులు, కాని అందులో ఎంతోమంది అగ్రవర్ణ మేధావులు ఉందికూడా ఆయన అభిప్రాయానికి విలువనిచ్చి ఈ రిజర్వేషన్లను సమర్దిన్చినవిషయం మరిచిపోతున్నారు ఈ కుహనా మేధావులు. ఆ రోజే వాళ్ళు వీల్లకిలాగా తల తోకా లేకుండా ఆలోచిస్తే వీళ్ళకి తెలిసుండేది.
    కాని మనం అంబేద్కర్ గారిని గౌరవిస్తాం. ఆ సంస్కారం వాళ్ళలో ఎంతమందికో గాని ఉండదు.

    ReplyDelete
  10. I honestly believe that our constitution too is not upholding the true spirit of Democratic Values.
    --------------------------------------------------
    Would part-time and week-end politicians note this and give their expert opinions on those spirits and values?

    ReplyDelete
  11. ఏ వాదనలోనైనా, వాళ్ళు, మనం అని మాట్లాడుకోవడం మొదలు పెడితే ఇంక ఇతరులకి చెప్పే నీతులకి అర్థమేం వుంటుందో నాకు తెలియట్లేదు. సాయి కిరణ్ గారూ మీరేమైనా వివరించగలరా! ఇది నేను ఇంతకు ముందు వ్యాఖ్యలో ప్రస్తావించిన విషయానికి ఒక చక్కని ఉదాహరణ.

    If you are already planning to respond to that then you can ignore this comment.

    ReplyDelete
  12. @Anonymous :)

    you are right. It is not clear what Saikiran garu meant by that. I might definitely give my opinion on that when I have more deatils from Saikiran garu on that aspect.

    I will leave that option to the blog owner to have that discussion in this post or at a later point of time.

    For now, I can say that I disagree with the view of the blog owner on constitution not upholding the spirit of democatic values.

    ReplyDelete
  13. Does Mr.Kondamudi really means what he said or it is just an outburst? would he enlighten the readers on those non-democratic values of constitution, that need to be reviewed/changed?

    ReplyDelete
  14. అనామక మాస్టారు - ఆవేశపడకండి. నా తర్వాతి వ్యాసం అదే.
    :))

    ReplyDelete
  15. కొండముది సాయికిరణ్ కుమార్ గారూ...,"సంకటహర చతుర్థి" రోజున వినాయకుణ్ని అర్చించుదాం. వినాయక చతుర్థి శుభాకాంక్షలు

    హారం

    ReplyDelete

మీ అభిప్రాయం :