Sunday, September 26, 2010

శ్రీదేవి పెళ్ళి - ఓ అద్భుత కళాసృష్టి

1980 లలో ఆంధ్రదేశాన్ని నవ్వుల్లో ముంచెత్తింది "శ్రీదేవి పెళ్ళి". మిమిక్రీ ప్రసాద్ అనే కళాకారుడు రూపొందించిన హాస్యవల్లరి ఇది. రావుగోపాలరావు పెళ్ళిపెద్దగా, శ్రీదేవి - చిరంజీవిల పెళ్ళికి హాజరయిన తెలుగు నటీనటులతో ఓ అద్భుతమైన కళాసృష్టి చేసిన ఈ ప్రసాదు గారి గురించి ఎవరికైనా వివరాలు తెలుసా?

రేడియోచిల్లీ లో శ్రీదేవి పెళ్ళి వినండి :

6 comments:

  1. సాయి కిరణ్ గారూ, M.R ప్రసాద్ గారు ఇంకా బుద్ధవిగ్రహం హుస్సేన్ సాగలో పడినపుడు ఒక ఆడియో చేశారు. అది కూడా ఎంతో బావుంటుంది. ముతక హాస్యంతో మరి రెండు మూడు ఆడియోలు కూడా చేశారు. ఆ ఆడియోల్లో ఆయన "ఎమ్మార్ ప్రసాద్, ఆరూ బై మూడు, పండరీ పురం, గుంటూరు" అని అడ్రస్ చెప్పడం భలే ఉంటుంది.

    ఇప్పుడు అసలు విషయానికొస్తాను! ములుగు రామలింగేశ్వర వర ప్రసాద్ అనే జ్యోతిష్కుడి పేరు విన్నారు గా! రాశిఫలాలు రాస్తూ, అడపా దడపా టీవీ ఛానెల్స్ లో కూడా కనిపిస్తుంటారు.

    వారే వీరు! :-))

    ReplyDelete
  2. ఎం.ఆర్. ప్రసాద్
    మిమిక్రీ ఆర్టిస్ట్
    6/3, పండరీపురం
    గుంటూరు

    అని ఆ క్యాసెట్‌లోనే చెప్పిన అడ్రస్‌లోనే దొరుకుతారు. కాకపోతే మీకో surprise...

    ఇప్పుడు ఆ ఎం.ఆర్.ప్రసాదే - మూలుగు రామలింగేశ్వర సిద్ధాంతి.

    ReplyDelete
  3. నిజంగా ఆశ్చర్యకరమే. ధన్యవాదాలు సత్యప్రసాద్ గారు, సుజాత గారు.

    ReplyDelete
  4. lol @ mimicri అచ్చి రాలేదని జ్యోతిష్యం లోకి దిగారేమో. ప్రస్తుతం వారి వ్యాపారం లాభాల బాటలోనే ఉన్నట్టుంది.

    ReplyDelete
  5. శ్రీదేవి పెళ్ళి కేసెట్టు ఆ రోజుల్లో ఎలా నా దగ్గర చేరిందో గుర్తు లేదుగాని, కొన్నేళ్ళ పాటు తల్చుకు తల్చుకు నవ్వేంతగా వినోదాన్ని అందించింది. ఎలా తెలియకుండ చేతికి వచ్చిందో అలాగే తెలియకుండా పోయింది. ప్చ్!
    Brilliantly conceived and flawlessly executed.

    ReplyDelete
  6. ప్రసాదు గారు ఎవరో తెలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు బాగా నచ్చిన క్యాసెట్ అది. నేను మా ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఈ మిమిక్రీనే చేసే వాడిని. ఐతే శ్రీనివాస్ గారు చెప్పినట్టు మిమిక్రీ కంటే జ్యోతిష్కంలోనే ఆదాయం ఎక్కువ. (నేను మాత్రం ఇంజనీర్ అయ్యాను అనుకోండి, అది వేరే విషయం.)

    ReplyDelete

మీ అభిప్రాయం :