ఏ ప్రజా ఉద్యమమైనా ఒకానొక స్థాయిలో హింసాయుతంగా పరిణమించటం సర్వసాధారణం. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేయటం ఒక ఎత్తైతే, లూటీలు మానభంగాలకు పాల్పడటం మరో ఎత్తు. వీటిని మించి, మన సంస్కృతిని మనం ధ్వంసం చేసుకోవటం మూర్ఖత్వం. ప్రజా ఉద్యమాలు హింసాయుతంగా మారటానికి గల కారణాలు విశ్లేషిస్తే, నాలుగు ముఖ్య విషయాలు గమనించొచ్చు. ప్రభుత్వాలు ఉద్యమానికి సానుకూలంగా స్పందించకపోవటం, బల ప్రయోగంతో ఉద్యమాన్ని అణచటానికి ప్రయత్నించటం, ఉద్యమంలో అసాంఘిక శక్తుల ప్రవేశం, అసమర్ధ నాయకత్వం ముఖ్యమైన కారణాలు.
ప్రత్యేక తెలంగాణా ఉద్యమం పెడదోవ పట్టటానికి ఇవన్నీ కారణాలే. ఇదివరలో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమం హింసాయుతంగా మారటానికి పొట్టి శ్రీరాములు బలిదానం దోహదపడింది. అంతవరకు, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం శాంతియుతంగానే కొనసాగింది. ప్రస్తుతం, అటువంటి బలిదానాలేవీ లేకుండానే ఉద్యమం పెడదోవ పట్టిందంటే కారణం అసమర్ధులు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించటం. నిన్నటి టాంక్ బండ్ విధ్వంసానికి కొన్ని నిముషాల ముందే, ఉద్యమకారుల చేత శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తామని కె.సి.ఆర్. ప్రతిజ్ఞ చేయించటం, జరగబోయే విధ్వంసాన్ని చూచాయగా చెప్పినట్లే. ముందస్తు ప్రణాళికతో చేయబడిన విధ్వంసమే ఇది. అందుకే, కె.సి.ఆర్. తనకు ఎలిబీగా ఉద్యమకారుల చేత ప్రతిజ్ఞ చేయించటం.
ప్రత్యేక తెలంగాణా ఉద్యమం మరోసారి మొదలు పెట్టినప్పటి నుంచి కె.సి.ఆర్. చేసింది ఉద్యమం కాదు, మోసం. సామూహిక జన మోసం. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటం, పదవుల కోసం వెంపర్లాడటం........ ,
No comments:
Post a Comment
మీ అభిప్రాయం :