తలపుల తలుపులు
బార్లా తీసి...
పుస్తకం మూసి...
ఇప్పటికో ముప్ఫై ఏళ్ళు.
ఎడారిలో అమృతం వెదకటం
తప్పని చెప్పేవాడే
ప్రతివాడూ...
ఆలోచనలు అపసవ్యంగా
సాగుతున్నాయనేవాడే
ప్రతివాడూ...
సవ్యంగా సాగే ప్రవాహంలో
గడ్డిమొక్కకేం విలువ
అని అడిగితే
మాట్లాడడే!
కాలం చెల్లిన
కబుర్లు చెప్పే ప్రతివాడూ
కందమూలాలు తినేవాడనుకోవటం
భ్రమే.
గాలిని, నీటిని, నేలను
నమ్మటం మానేసింది
సరిగ్గా అప్పుడే...
ఇప్పుడు నేనో విగతజీవిని
ముగింపు చాలా బావుందండీ!
ReplyDelete"కాలం చెల్లిన
కబుర్లు చెప్పే ప్రతివాడూ
కందమూలాలు తినేవాడనుకోవటం
భ్రమే!"
నిజమే కదా!!