Thursday, May 14, 2009

రాముడు - చారిత్రక ఆధారాలు

'ప్రస్తుతం రాముడు ఏ చరిత్రలోనూ లేడు. రామాయణం అనే పుస్తకంలో అతనొక పాత్ర. మహా అయితే పురాణపురుషుడవుతాడు. చరిత్ర పురుషుడు కాడు. కొత్తగా రాముడ్ని చరిత్రపురుషుడుగా నిరూపించే ఆధారాలు దొరికితే అంగీకరించటానికి నేను రెడీ...'

అయ్యా కత్తిలాంటి కామెడీ బ్లాగులో ఇది ఆ అయ్యవారి చచ్చుతునకలాంటి కామెంటు. 'ప్రస్తుతం రాముడు ఏ చరిత్రలోనూ లేడు' అంటే, ఏ చరిత్రలో ఉండాలని ఈయన ఉద్దేశ్యం? పురాణాలలో ఉన్నాడు కాబట్టి రాముడు పురాణపురుషుడు. చరిత్రలో లేడు కాబట్టి చరిత్రపురుషుడు కాదు. కానీ, రామాయణం పురాణం కాదే! అది ఇతిహాసమే! మరి ఏం చేద్దాం? పురుషుల్లో మరో కేటగిరీ సృష్టించేద్దాం.. ఇతిహాస పురుషుడు అని.

సరే, ఇక ఆధారాల సంగతి ఏమిటి? రాముడికి సంబంధించి ఏ చారిత్రక ఆధారాలు దొరికితే చరిత్రపురుషుడు అవుతాడు? మాక్స్ ముల్లర్లు, నందన్ నీలకేనిలు, రామచంద్ర గుహలు వ్రాసే పుస్తకాల్లో 'రిఫర్' చేస్తే రాముడు చరిత్ర పురుషుడౌతాడా? లేదంటే, ఈ అయ్యవారిని ఒప్పించటం కోసం, అయోధ్యలో తవ్వకాలు సాగించి అక్కడి ఎముకలు గట్రా గట్రాలు సేకరించి అయ్యా ఫలానా ఎముక ఫలానా రామాయణకాలానికి చెందిందని డి.ఎన్.ఎ. పరీక్షలో తేలిందని చెబితే నమ్ముతారా? అప్పుడైనా, అది రాముడిదే అనే గ్యారంటీ ఏమిటి? ఎవడో మహాలింగానిది కావచ్చుగా!

ఇక, కొన్ని ప్రాథమిక స్థాయి ప్రశ్నలు వేసుకుందాం. ఈనాటి మన అస్థిత్త్వానికి చారిత్రక ఆధారాలేమిటనేవి ఆలోచిద్దాం. ఓటరు కార్డు ఉంది కాబట్టో, పాస్ పోర్టు ఉంది కాబట్టో మనం భారతీయులం. పాస్ పోర్టు అనే ఆధారం లేకపోతే, భారతీయులం కానట్టేనా? అసలు మనం ఉన్నట్లే కాదా? అసలు చరిత్ర అంటే ఏమిటి? అసలు చరిత్ర ఎక్కడ నిక్షిప్తమౌతుంది? మునిసిపాలిటీ రికార్డుల్లోనా, పాఠ్య గ్రంధాలలోనా? ఆరకంగా చూస్టే, మనమంతా చరిత్రలో లేనివారమేగా? అంటే, మన ఉనికి లేదనేనా అర్ధం? కాదంటే, మరెవడో వచ్చి వకాల్తా తీసుకొని ఫలానా ఇది సాక్ష్యం అని చెబితేనే గానీ, అది మనం నమ్మకూడనిదా?

ఓ చాకులాంటి తలకుమాసినవాడు, వాడి నాయనతో చేస్తున్న చర్చ చదవండి.

చాకు - నాన్న నాన్న...
తండ్రి - ఏంట్రా చాకు
చాకు - నాన్న, దేవుడు ఉన్నాడంటావా?
తండ్రి - ఉంటే ఎంత లేకపోతే ఎంత? అయినా ఉన్నాడనుకుంటే సరి.
చాకు - అలా ఎందుకనుకోవాలి? ఆధారాలేంటి?
తండ్రి - కొన్ని కొన్ని పక్కవాళ్ళ కోసం నమ్మినట్లుండాలి.
చాకు - అంటే, దేవుడున్నాడని నువ్వు నమ్మనట్లేగా?
తండ్రి - మె మె మె
చాకు - సరే కానీ నాన్న, నేను వర్తమాన పురుషుడిని అవునా? కాదా?
తండ్రి - నువ్వు పురుషుడివేరా.. అయినా ఎందుకొచ్చింది అనుమానం?
చాకు - వర్తమాన పురుషుడంటే, నేను బ్రతికే ఉన్నానా, ఉంటే ఎవరికి పుట్టాను?
తండ్రి - ఇంకెవరికి? నాకు మీ అమ్మకు.
చాకు - అసలు నువ్వెవరివి, నీ నాయనెవరు?
తండ్రి - నేను కొడవలి, నీ తాత గొడ్డలి
చాకు - నువ్వు నా నాన్నవనీ, తాత నీ నాన్నని ఆధారాలేంటి?
తండ్రి - ఉంటే ఎంత, లేకపోతే ఎంత? అయినా ఉన్నాయనుకుంటే సరి.
చాకు - అలా ఎందుకనుకోవాలి? ఆధారాలేవి?
తండ్రి - కొన్ని కొన్ని పక్కవాళ్ళ కోసం నమ్మినట్లుండాలి.
చాకు - అంటే నువ్వు నమ్మవా?
తండ్రి - ??నువ్వు నావి, తాతవి మనోభావాలు కూడా గాయపరుస్తున్నావురా.
చాకు - చరిత్రలో ఏ సిరాతోనైనా చాకు నాయన కొడవలి అని, కొడవలి నాయన గొడ్డలి అని ఎక్కడైనా ఉందా?
తండ్రి - మునిసిపాలిటీ రికార్డ్సులో ఉండొచ్చురా. అయినా ఉంటే ఎంత లేకపోతే ఎంత? ఉందనుకుంటే సరి.
చాకు - పక్కవాళ్ళ కోసం నేను నమ్మినట్లు ఉండలేను. మునిసిపల్ రికార్డ్సు చారిత్రక ఆధారాలౌతాయా అనేది మరో ఆలోచనాత్మక ప్రశ్న.
తండ్రి - మరి ఎలారా? మీ అమ్మనో బామ్మనో అడుగు.
చాకు - నో.. చెప్పుడు మాటలు నమ్మకూడదు, ఆధారాలుంటేనే ఒప్పుకుంటా అన్నారే కత్తిలాంటి మహానుభావులు.
తండ్రి - అయితే ఇప్పుడేమంటావు?
చాకు - నువ్వు నా తండ్రివని ఆధారాలు చూపే వరకు నేను నమ్మను.
తండ్రి - ఒరేయ్ తండ్రి ఎవరైనాగానీ, ఆధారాలు చూపలేరురా అబ్బాయ్. పోనీ డి.ఎన్.ఎ. టెస్టులేవో వొచ్చాయట. చేయించి చెప్పు నువ్వసలు నా కొడుకువేనో కాదా?
చాకు - ఐ పిటీ యు నాయనా.
తండ్రి - అయితే ఏంటి, భావ వైశాల్యం పెంచుకొని పక్కింటివాడ్ని నాయనంటావా?
చాకు - డి.ఎన్.ఎ. టెస్టులైనా కానీ ఎలా నమ్మాలి? ఇవే సరైన టెస్టులనే చారిత్రక ఆధారాలు ఉన్నాయా?
తండ్రి - నీ *&^%$#
చాకు - ప్రస్తుతం నేను, నువ్వు, తాత ఏ చరిత్రలోనూ లేము. ఇంట్లోని పాత్రలమే. మహా అయితే ఇంటి పురుషులమౌతాము. కొత్తగా మనల్ని వర్తమాన పురుషులుగా నిరూపించే ఆధారాలు దొరికితే అంగీకరించటానికి మహానుభావులు రెడీ. మరి ఆధారాలు వెదుకుదాం నాయనా, తాతనీ పిలు.

* * * *

ఆధారాల కోసం చూస్తే, మన తల్లిదండ్రులేవరనేదే ఓ నమ్మకం మీద ఆధారపడిన విషయం. ఇక, రాముడు ఉన్నాడా లేడా అనే విషయం మీద చర్చలు తెగవు. ఫలానావాడు తండ్రి అని మనలని నమ్మించిన తల్లిదండ్రులు మనలను మోసం చేయరనే నమ్మకంతోనే రాముడు కూడా ఉన్నాడనే నమ్మాలి. ఈ విషయానికి ఆధారాలు కావాలనేవాళ్ళు వారివారి తండ్రులెవరనేదానికి కూడా ఆధారాలు వెదకండి. బహుశా అప్పుడు రాముడి ఆధారాలు దొరకవచ్చు.

13 comments:

  1. అయ్యా, సాయి కిరణ్ గారు,
    ఏదో ఒక్కరిద్దరు రాముడు లేడు అని కత్తులు దూసి, "వితండ" వాదం చేసి వాళ్లు పొందేది లేదు మనం పోగొట్టుకునేది అంతకన్నా ఏమిలేదు. వీళ్ల ద్వారా రామాయణానికి వచ్చిన నష్టమేమీ లేదు. మనకు కొంచెం చికాకు తప్ప.

    ఏదో సామేత చెప్పినట్లు,
    "గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్చపోయిందట"
    అలాగే వీళ్లకు కూడా అంగి చింపుకొని ఉరేగే ఫ్యాన్స్ ఉంటారు. ఇవన్నీ లైట్ గా తీసుకోండి. వాళ్లు చేసే చేష్టలు చూసి నవ్వుకోండి.

    ఒక్కసారి మన ఫా(గ)లు గారి కామెడీ చూడండి. నవ్వు తన్నుకుంటు వస్తుంది.
    http://www.youtube.com/watch?v=9L8BhkpLdT0

    ReplyDelete
  2. అంటే నిజానిజాలు మన నమ్మకంపైన ఆధారపడగా, నమ్మకం మన సౌకర్యం పైన ఆధారపడుతుందన్నమాట. A casual walk in an assylum proves that faith means nothing --Bernard Shaw గుర్తుకొస్తూంది.

    "రాముడేకాలానికి చెందిన వాడు?" అని బుర్రబద్దలు కొట్టుకోవడం, రాముడి అస్థిత్వానికి చారిత్రక ఆధారాలు వెదకటం అనవసరం. చాతనైతే ఆయన ఆచరించిన/ఆచరించబడినట్లుగా చెప్పబడిన మంచి విషయాలను వంటబట్టించుకోవడం. మిగతావి వదిలించుకోవడం. By the way... even I don't believe that he existed; but I am no more concerned about it.

    ReplyDelete
  3. "బ్లాగులోకపు కే ఏ పాల్" హ హ్హ హ్హా.

    ReplyDelete
  4. మొన్నటి వరకు కామెడీ పోస్టులు ఒకరి దగ్గరునుంచే వచేయి, ఇప్పుడు K A పాల్ కూడా తయారయదన్న మాట.. హ హ హ హ..

    ReplyDelete
  5. Historicity of Puranas, see the discussion here: http://pustakam.net/?p=592

    My friend, The blogger that we are talking about is a vainglorious punk. He and his band of lunatics can't make a lick of difference in the bigger scheme of events. Let them have public colonial Romilla Thaper mark orgasms to their heart's content!!

    K.A. Paul doesn't disturb me anymore. On the contrary, he is a source of amusement to me. So are these punks in the blog world!!

    ReplyDelete
  6. అసలు మనం ఉన్నట్లే కాదా? అసలు చరిత్ర అంటే ఏమిటి? అసలు చరిత్ర ఎక్కడ నిక్షిప్తమౌతుంది? మునిసిపాలిటీ రికార్డుల్లోనా, పాఠ్య గ్రంధాలలోనా? ఆరకంగా చూస్టే, మనమంతా చరిత్రలో లేనివారమేగా? ఆ మాత్రం తెల్వదా నీకు? మన చరిత్ర అంతా సినిమాల్లో మొదలౌద్ది. ఏదైతే సినిమాల్లో లేదో, ఏదైతే నేను చదివే సాహిత్యంలో లేదో అది పనికిరానిది. ఎందుకంటే నేను సినిమాల మీద బ్లాగ్ రాత్తా! నేను అలాగే థీసీసు రాసి మాస్టర్ డిగ్రీ సంపాదించా. నీగ్గూడా ఇప్పిత్తా. కావాల్నా? ఆరుద్ర చెప్పేడా? శ్రీశ్రీ చెప్పేడా? అలా అయితే ఒప్పుకుంటా. ఎవడో అనామకుడూ (అంటే ఈ బ్లాగు రాసిన నువ్వూ, పేరివ్వకుండా కామెంటుతున్న నేను) చెప్తే కుదర్దు. ఉప్పుడు నీకు తెల్సిందా? ఇలాగెప్పుడు ప్రశ్నలెయ్యకు సాయి. నేను చెప్పేదే వేదం. నా వీపు గోకే వాళ్ళే పండితులు. ఆ మాత్రం తెల్వదా?

    ReplyDelete
  7. ఈయనకు ఇప్పుడు ప్రవీణ్ అలియాస్ మార్థాండ అనే 1940 సం || కాలం నాటి వరవడిగల యువ రచయిత తయారు అయ్యాడు. మంచి జంట. ఇద్దరు అప్పుడప్పుడు నా లోకం బ్లాగులో కలుస్తారు ప్రతి హిందు వ్యతిరేక టపాకి. అన్ని పాములు నాట్యం చేస్తుంటె ఏలిక పాము కూడా నాట్యం చెసిందని ఈ మార్థాండ గాడు ఒకడు :-)
    ఇండియన్ మినెర్వాలో కూడా కొంచెం కొంచెం వీళ్ళ లక్షణాలు కని పిస్తున్నాయి. ఆయన కూడ త్వరలో పూర్తి స్థాయి లో బయట పడతాడెమో అని నా అనుమానం. వేచి చూద్దం ఎలవుంటాడో మరి భవిషత్తులో

    ReplyDelete
  8. ఎక్కడి చరిత్ర గురించి మాట్లాడతారు జనాలు? కొన్ని వేలసార్లు ఆ చరిత్రని మార్చారు కామందులు. ఇంకెక్కడి చరిత్ర? ఏది నిజం? అక్బర్ మంచోడని చరిత్రలో రాసారు. కానీ ఆయనొక రక్తపిపాసి అని కొందరంటారు. ఏది నిజం?
    అసలు మనదైన చరిత్రని ఎందుకు మార్చాల్సివచ్చిందీ? అనేదొక పెద్ద ప్రశ్న నాకు.

    ReplyDelete
  9. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా ....... చందాన వీళ్ళు మారరు, మన నోళ్ళు నొప్పి తప్పితే

    ReplyDelete
  10. నేనెప్పుడొ చెప్పాను ..
    "మార్టాండ& శిరీష పొస్ట్ లు, ఖా పాల్ ఇంటెర్వ్యు లు అలిసిన నా మెదడుకు అహ్లదాన్ని కలిగిస్తాయి" అని.

    http://jeedipappu.blogspot.com/2009/03/blog-post_31.html

    కానీ మార్తండ రాసెది కామెడి అని అందరికి తెలుసు. అయన బ్లాగులలొ ఎప్పుడు ఒకె బెచ్ కామెంట్స్ పెడతారు. వాళ్ళు నిజం గా వున్నరొ లెక అది ఆయన కల్పితమొ తెలీదు.

    కానీ చాకు, కత్తి, సుత్తి, వీళ్ళంటి వాళ్ళు ఎప్పుడూ విషం కక్కె పాములు లంటి వాళ్ళు. వీరితొ జాగ్రత్త గా వుండాలి.

    ReplyDelete
  11. వీడి లాంటి విషపురుగులు బయట అమాయక ప్రజల్ని ఎలా ఎమరుస్తున్నరొ, ఇప్పుడు పల్లెటూర్లలొ పరిస్తితి ఎలా వుందొ ఇక్కడ చూడంది.
    http://nenu-laxmi.blogspot.com/2009/01/blog-post_12.html

    ఇదంతా చాలా పెద్ద నెట్వర్క్. కొన్నాళ్ళకి హిందూ మతం అంతిరించుకు పొయినా అశ్చర్యం లెదు.

    ReplyDelete
  12. మీ బ్లాగులోని చచ్చు కవితలకూ పుచ్చు రాజకీయ అభిప్రాయాలకూ కనీసం ఐదు స్పందనలు కూడా రాని మీరు. నా మీదపడి ఏడిస్తేగానీ పది వాఖ్యలు కూడా(అందులో సంగం అనామకులు అజ్ఞాతలు)రాని మీకు నా బ్లాగు హాస్యంగా ఉంటే అర్థం చేసుకోదగ్గ పరిణామమే. నా ప్రఘాఢసానుభూతి మీతో ఉంది.

    ఇక రామాయణం సంగతి. పురాణాన్ని చరిత్రను చెయ్యలనే ప్రయత్నంలో భాగంగా "ఇతి + హ = ఇతిహాసం. అంటే ఈ విధంగా జరిగింది అని అర్ధము. అంటే చరిత్ర." అని ఒక పదాన్ని మనవాళ్ళు కనిపెట్టారు. ఇక్కడ సరాదా విషయం ఏమిటంటే హిందీవాళ్ళు చరిత్రని "ఇతిహాస్" అనే అంటారు. ఏవిధంగా చూసినా రామాయణం చారిత్రక ప్రమాణాల దృష్ట్యా "నిజంగా" జరిగింది కాదు. అదొక కథ, కావ్యంగా చెప్పబడిన గాధ.

    ఇప్పటివరకూ కనుక్కోబడిన చరిత్ర ప్రకారం రామాయణం మౌర్యుల కాలం తరువాత రాయబడింది. బహుశా అంతకు ముందు మౌఖికంగా ప్రచులితమై ఉండొచ్చు. రాసినతరువాతే ఇన్ని సంశోధనలు చెయ్యబడిన రామాయణం రాతకు పూర్వం నోళ్ళలో నానుతూ ఎన్ని మార్పులు చెందిందో ఎవరికి తెలుసు! ఈ పరిస్థితుల్లో దీన్ని "చరిత్ర"గా పాస్ చెయ్యాలని చూడటం మీ సిమిత చారిత్రక దృష్టికి నిదర్శనం. మీరు పైన ఉటంకించిన చరిత్రకారుల్ని (అందులో నీల్ఖని చరిత్ర కారుడు కాదు) మీరు ఖచ్చితంగా చదివుండరు. వీరిగురించి మీబోట్లు ప్రచారం చేసే అపోహలుతప్ప. కనీసం డి.డి.కౌసంబిని చదవండి. అప్పుడైనా కొంత చరిత్ర ముమ్మల్ని అంటకపోదు.

    ReplyDelete
  13. హ హ హ.. ఇలా అఘోరించారన్నమాట మీ లాజిక్ ని. సరే, మీ చెంచాలెవరో అలెక్సాలో మీ ర్యాంకింగుల గురించి ఏదో గోప్పగా చెప్పారుగా! ఈ బ్లాగు ర్యాంకింగ్ చూడండి తెలుస్తుంది. ప్రస్తుత ర్యాంకు 580,441. ఈ ర్యాంకేదో చెత్త కవితలకే వచ్చిందో, పుచ్చు వ్యాసాలకే వచ్చిందో మరి! మీ మీద రాసిన ఈ రెండు రోజులకే ర్యాంకు పెరిగిందో మరి!! ఇంక ఆయాసపడకుండా రెస్టు తీసుకోండి. నా బ్లాగుకు నేనే రాజును. మీ ఈ కామెడీని కామెంటు మాత్రం ఉంచుతా మీవెంత వెధవ తెలివితేటలో లోకానికి తెలియాలి కాబట్టి. ఇకపై ఏ కామెంటూ ఉండదు.

    http://www.alexa.com/siteinfo/amtaryaanam.blogspot.com

    ReplyDelete