ఈ ఎన్నికల ఫలితాలు చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించాయనేది వాస్తవం. ముఖ్యంగా, రాష్ట్రస్థాయిలో తెలుగుదేశం సానుభూతిపరులని, చిరంజీవి అభిమానులని, ఈనాడు పాఠకులను ఈ ఫలితాలు ఆశ్చర్యంలో ముంచేసాయి.
మొన్నటిదాకా, ఉచితంగా లభించేవాటికి కక్కుర్తిపడేవాళ్ళు మన ఓటర్లు అనే అభిప్రాయం (నాక్కూడా) ఉండేది. కానీ, ఈ ఎన్నికల్లో ఫ్రీగా ఎన్నో ఇస్తామని వాగ్దానాలు చేసిన తెలుగుదేశాన్ని మరో అయిదేళ్ళు ఫ్రీగా ఉండమని ప్రజలు తీర్పు నివ్వటం ఆహ్వానించదగ్గ పరిణామం.
ఈ ఎన్నికల్లో అటు కేంద్రస్థాయిలోనూ, ఇటు రాష్ట్రస్థాయిలోనూ ఓటర్లు చూపిన పరిణతి పార్టీలన్నిటికీ కనువిప్పు కావాలి. ముఖ్యంగా కేంద్రస్థాయిలో ఏ ఏ ఒత్తిళ్ళమధ్య గత అయిదుసంవత్సరాలుగా ప్రధాని దేశాన్ని నెట్టుకువచ్చారో ప్రజలు గుర్తించినట్లే కనిపిస్తుంది. అలానే, రాష్ట్రస్థాయిలో వాపును చూసి బలుపుగా భ్రమపడ్డ ఆర్జేడి., ఎల్జెపి వంటి పార్టీలనే కాకుండా, సినీమాయలో ప్రజలను ప్రలోభపెట్టటం తేలిక అనుకునే చాలామంది సినీనాయకులను కూడా మట్టికరిపించారు.
గతంలోని ఎన్నికలతో పోలిస్తే, ఈనాటి ఎన్నికల్లో రాజకీయపార్టీలు ఏ అంశమూ లేకుండానే పోరాడాయి. భా.జ.పా. 'బలహీన ప్రధాని'ని అంశంగా చేయాలని ప్రయత్నించి భంగపడింది. ఎప్పుడూ వైరిపక్షాలపై నోరుమెదపని మన్మోహన్, మొదటిసారి నోరుమెదిపి కాందహార్ లో ఈ 'లోహపురుషుడు' ఏం చేసాడని వేసిన ప్రశ్నకు, రాబోయే అయిదేళ్ళవరకూ భా.జ.పా. సమాధానాన్ని వెదుక్కుంటూనే ఉంటుంది.
ఈ ఎన్నికల్లో అటు కేంద్రస్థాయిలోను, ఇటు రాష్ట్రస్థాయిలోనూ 'అధికారపక్షానికి' అనుకూల పవనాలు వీయటం కన్నా, 'ప్రతిపక్షాలకు' వ్యతిరేక పవనాలు వీచాయని చెప్పుకోవచ్చు. అధికారపక్షాన్ని 'యాగీ' చేయటంలో చూపిన నిబద్ధత, ప్రజా సమస్యలపట్ల ప్రతిపక్షాలు చూపలేదనే వాస్తవాన్ని ప్రజలు గుర్తెరిగారు.
ముఖ్యంగా, రాష్ట్రంలో ప్రత్యేక ఆర్ధికమండళ్ళ పేరు మీద, పేదరైతుల భూములను ప్రభుత్వం ఇతరులకు ధారాదత్తం చేయటాన్ని ఖండిస్తూ మొదలేసిన ప్రతిపక్షాల ఆందోళన చివరివరకూ సాగలేదు. అదే, పశ్చిమ బెంగాల్ లో మమతాబెనర్జీ చివరి వరకూ పోరాడి సాధించగలిగిన విషయం గుర్తించాలి. అందుకే కామ్రేడ్ల కంచుకోట బీటలువారిపోయిందన్న విషయం కూడా గుర్తించాలి.
మొత్తానికి ఈ ఎన్నికల్లో, కాంగ్రెస్ గెలిచిందనైతే ఆనందించటం లేదు కానీ, మూలసిద్ధాంతాలకు దశాబ్దం క్రితమే తిలోదకాలు ఇచ్చిన భా.జ.పా.కు, తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనే కమ్యూనిస్టులకు, వాపును బలుపుగా భ్రమపడిన ఆర్జేడి, ఎల్జెపి, పిఆర్పీలలాంటి కామెడీకింగులకు ప్రజలు నిజంగానే గడ్డిపెట్టారని ఆనందంగా ఉంది.
అటు కాంగ్రెస్ కూడా రాష్ట్రస్థాయిలో తగ్గిన తమ పరపతిని గమనించుకోవాలి. సరిపడ్డ మెజారిటీ వచ్చిందని సంబరపడితే కాదు, తమ అనుచరులకు, తమ పార్టీవారికి దోచిపెట్టటం మాని, ఎన్నో ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు వేసిన ఓట్లకుగాను, వారికి న్యాయం చేయాలి.
> ఈ ఎన్నికల్లో ఫ్రీగా ఎన్నో ఇస్తామని వాగ్దానాలు చేసిన తెలుగుదేశాన్ని మరో అయిదేళ్ళు ఫ్రీగా ఉండమని ప్రజలు తీర్పు నివ్వటం ఆహ్వానించదగ్గ పరిణామం
ReplyDelete> వాపును బలుపుగా భ్రమపడిన ఆర్జేడి, ఎల్జెపి, పిఆర్పీలలాంటి కామెడీకింగులకు ప్రజలు నిజంగానే గడ్డిపెట్టారని ఆనందంగా ఉంది.
well said...
This comment has been removed by the author.
ReplyDeleteWell Said.
ReplyDeleteనా అభిప్రాయం ఇక్కడ చూడండి
ReplyDelete2009 ఎలక్షన్ల ఫలితాలు - ఆంధ్రప్రదేశ్
please visit http://apaksha.blogspot.com and comment..
ReplyDeleteThanks
apaksha