మతానికి ఆధ్యాత్మిక సాధనకు సంబంధం ఎంతవరకు? అసలు సంబంధం ఉందా, లేదా? ఇటువంటి ప్రశ్నలతో కా.కింగుల తత్వవిచారణ చదవటం తటస్థించింది. అనుకున్నట్లుగానే, విలువైన విషయం ఒక్కటీ లేకుండా, ఆద్యంతం హాస్యాస్పదంగా వ్రాయగలిగిన కా.కిం.గారికి ముందుగా అభినందనలు.
మనిషికి నచ్చినా, నచ్చకపోయినా, కావాలనుకున్నా, వద్దనుకున్నా పుట్టుకతోనే సహజంగా అంటగట్టబడేది మతం. కాలక్రమంలో, ఆధ్యాత్మికమైన ఎదుగుదలకు ఆ మతాన్నే ఆసరాగా తీసుకోవటం కూడా అంతే సహజం. ఆధ్యాత్మికంగా ఉన్నతస్థాయికి చేరుతున్నకొద్దీ మతాన్ని పట్టించుకోకపోవటం జరుగుతుందే కానీ, మతాన్ని తృణీకరించటం ఎన్నటికీ జరగదు. ప్రతి మతానికీ స్వాభావికమైన కొన్ని సంప్రదాయాలను అనుసరించి ఆధ్యాత్మిక రంగంలోకి ప్రవేశించటం జరుగుతుంది. అంతే కానీ, ఆధ్యాత్మిక పురోగతికి మతం అవసరమే లేదు అంటే కుదరదు.
మీ మతంలో ముక్కు మూసుకు తపస్సు చేస్తే ఆధ్యాత్మిక పురోగతి ఉంటుందన్నారు. అది అహేతుకం, ఎందుకంటే ముక్కు మూసుకుంటే చచ్చిపోతారు కనుక. నేను ఏ మతవాదినీ కాను, 'నవతా' వాదిని. కాబట్టి, ముక్కులో వేలు పెట్టుకుని తపస్సు చేస్తానంటే, మనం అనేదేమీ ఉండదు. వేలెక్కడ పెట్టుకున్నా, చేస్తానంటున్నది తపస్సే కాబట్టి.
మతపరమైన అవగాహనా రాహిత్యంతో ఆధ్యాత్మికంగా ఉన్నతస్థానానికి చేరుకోలేం. గౌతమ బుద్ధుడైనా పతంజలి ప్రస్తావించిన యోగసూత్రాలలోని 'ధ్యానయోగ మార్గాన్ని' అనుసరించి మాత్రమే బుద్ధత్వం సాధించగలిగాడు. పతంజలి యోగసూత్రాలకు హిందూమతానికి ఉన్న అవినాభావ సంబంధం గురించి వేరే ఏమీ చెప్పనక్కరలేదు.
ఉదాహరణకు గురువు దీక్ష నివ్వటం, జప, తప హోమాది అంశాలు అధ్యాత్మికపరమైనవైనా, అవి హిందూ మతానికి మాత్రమే వర్తించే విషయాలు. కాబట్టి ఆధ్యాత్మిక సాధనకు మతానికి సంబంధం లేదని చెప్పటం కుదరదు. ఇస్లాం లోనో, క్రిస్టియానిటీలోనో హోమాలు యాగాలు చేయమని చెప్పరు. కాబట్టి, ఈ సాధనలు హిందూ మతపరమైనవే. అలానే, తదితర మతాలలో కూడా వారికి మాత్రమే ప్రత్యేకమైన సాధనలు ఉన్నాయి.
అంతేకానీ, మతపరమైన ఆధ్యాత్మిక సాధనలకు, నియో హిందూత్వ రాజకీయ భావజాలానికి సంబంధం అంటగట్టి హిందువులను రెచ్చగొట్టాలని కామెడీ కింగులు చేసె అసందర్భ ప్రలాపాలను గర్హించి తీరాలి. చార్వాకుడు, బుద్ధుడు, జీనుడు ఇంకా అరిస్టాటిల్, సోక్రటీసులు తత్వ విచారణ చేసారని ప్రకటించే పెద్దమనిషికి ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము ప్రతిపాదించిన జగద్గురువులు తత్వవిచారణ చేసినట్లు ఎందుకు అనిపించలేదో! ఇక్కడి హిందూ తత్వాన్ని అర్ధం చేసుకోలేని వెంగళప్పలకు, అరిస్టాటిల్, సోక్రటీస్ మాటల్లోనే 'ఈజిప్టు తత్వం' తెలిసిందట!
అయ్యా, అరిస్టాటిల్, సోక్రటీస్ లు చెప్పిన 'ఆ మాటలేవో' మాకూ చెబితే 'ఈజిప్టు తత్వాన్ని' తెలుసుకుంటాం. అలాగే, పాకిస్తాన్ తత్వం, శ్రీలంక తత్వం, అమెరికా తత్వం, గట్రా గట్రాలకు ఎవరెవరి మాటలు వినాలో కూడా తమరు చెబితే ఆనందిస్తాం.
అయ్యవారి మరిన్ని 'జ్ఞాన శకలాలు' చూడండి.
"ఆధ్యాత్మిక తత్వచింతనకు మూలం మనిషి". ప్రాధమికమైన ఆలోచనలోనే తప్పు! అయ్యా, ఆధ్యాత్మిక తత్వచింతనకు మూలం మనిషి కాదు. ఆ మూలం ఓ శక్తి / ఓ ప్రకృతి / ఓ దేవుడు.
"అది మనిషి జీవితానికి సంబంధించినది". మరో తప్పు. అది మనిషి లౌకికమైన జీవితానికి సంబంధించినది కాదు, పారలౌకికమైన జీవితానికి సంబంధించిన విషయం.
ఊసరవెల్లిలా, తన వ్యాసంలోని మొదటి పేరాలో 'నియో హిందుత్వ రాజకీయ భావజాలాన్ని" విమర్శించిన పెద్దమనిషి, చివారఖరుకు తన రంగు ఎలా మార్చారో చూడండి. "మానవత్వాన్ని మంటగలుపుతున్న మతం పోకడల మధ్య...." అంటూ హిందూ మతాన్ని అధిక్షేపించటమేమిటి? ఇక్కడ మతం చేసిన తప్పేమిటి? తప్పు చేస్తున్నారనుకున్న 'నియో హిందుత్వ రాజకీయ వాదులనే' ఇక్కడ కూడా అనొచ్చుగా!
మూలభావాల్లోనే తప్పులు పెట్టుకొని, మరొకరి అభిప్రాయాల విలువను ప్రశ్నించే పెద్దమనుషులు మరోసారి కా.కిం.లుగా నిర్ధారింపబడుతున్నారని గ్రహించకపోవటం విచారకరం.
సా.కి. గారు
ReplyDeleteమీరే అంటున్నారు కా.కిం. అని. అలాంటి వాళ్ళ (దుర్)ఉద్దేశ్యాలు తెలిసి, వారి గురించి మీ అమూల్యమైన సమయాన్ని ఎందుకు వృథా చేసుకుంటారు. మీలాంటి వాళ్ళు 'అనవసరమైన' వ్యక్తుల అభిప్రాయాలకు విలువనిచ్చి, స్పందిస్తే, తామేదో గొప్ప అని ఫీల్ అయిపోయి, మరింత రెచ్చిపోతారు. అలాంటి కా.కిం. మాటలను పట్టించుకోకండి. డైనోసార్ మీద ఈగ వాలితే ఎలా ఉంటుందో, అలా స్పందించాలి.
మీరెంత చెప్పినా, తివిరి ఇసుమున తైలంబు తీయ వచ్చు... చేరి, మూర్ఖుని మనసు రంజిపరాదు
"గౌతమ బుద్ధుడైనా పతంజలి ప్రస్తావించిన "ధ్యాన యోగ" మార్గాన్ని అనుసరించి మాత్రమే బుద్ధత్వం సాధించగలిగాడు."
ReplyDeleteపతంజలి యోగసూత్రాలు మౌలికంగా "యోగశ్చిత్త వృత్తి నిరోధః" అన్న కాన్సెప్టు తో ఆరంభమవుతాయి. బుద్ధుడి "విపాస్సన" మార్గం లో చిత్త వృత్తి నిరోధం అన్న "objective" లేదు. ఆలోచనలను, మనో వ్యాపారాలను paasive గా observe చేయటం మాత్రమే ఉంటుంది.
పతంజలి ధ్యాన మార్గం అంతిమ లక్ష్యం "యోగం" (where in object, observer, and observed all cease to exist - thus YOGA) అయినప్పటికీ, సాధనా విధానం మాత్రం "ఏకాగ్రత" తో ఆరంభమవుతుంది. బుద్ధుని సాధనా విధానం "ఏకాగ్రత" కాదు. ఈ రకంగా కొన్ని మౌలిక తేడాలు ఉన్నవి, యోగ మార్గానికి, విపాస్సన మార్గానికిన్నీ.
మీ వ్యాసం లో ఇతర విషయాలపై ఆక్షేపణలు లేవు. ఇలాంటి విషయాలపై అభిప్రాయాలు ఏర్పరచుకుని, వాటికి అనుగుణంగా వాదనలు నిర్మించుకోవడం (అనుకూలంగా, వ్యతిరేకంగా కూడా) ప్రయోజనం లేని వ్యవహారం అని నేను నమ్ముతాను.
సాయికిరణ్ గారు, చాలా సూటిగా, స్పష్టంగా చెప్పారు.
ReplyDeleteఆధ్యాత్మికత అన్న గమ్య సాధనకు మతం బాణం గుర్తులతో సహా దారి చూపిస్తుంది. ఈ నిర్దేశకత్వాన్ని విశ్వసించని వాళ్ళు కనీసం ఆ సంస్కృతిలో మసలినా లక్ష్యాన్ని చేరుకోగలరు. ఈ రెంటినీ తృణీకరించిన వారు దారి తప్పే అవకాశాలే ఎక్కువ. ఇలా తృణీకరించి గమ్యాన్ని చేరుకున్నామని భ్రమిస్తున్నవారు సాధించినది ఐతే గియితే వైరాగ్యమే తప్ప పరిపూర్ణత కలిగిన ఆధ్యాత్మికత కాదు.
"బుద్ధుని సాధనా విధానం ’ఏకాగ్రత’ కాదు."
ReplyDeleteరవి గారు, ఈ ప్ర్రతిపాదన మీరు గమనించి చేస్తున్నదా లేక ఎక్కడైనా చదివి చెబుతున్నారా?
క్రిస్టియనుల Peace That Passeth Understanding, బౌద్ధుల నిర్వాణం, భారతీయుల (గమనించండి- హిందువుల మాత్రమే కాదు) ’మోక్షం’/బ్రహ్మం/పరమాత్మ, జైనుల 'జిన’, మహమ్మదీయుల ’వహి’, సూఫీ సెయింట్ల ’ప్రియతమ దేవుడ”, ఫిలాసఫర్ల 'reason', తాంత్రికులు కోరే ’అనిర్వచనీయ ఆనందం’, శూన్యవాదుల ’శూన్యం’, మధురయోగుల ’ప్రేమ’ - ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో.. వీటిలో దేనిని అనుభవించాలన్నా (experience it/ attain it or just 'be it') - ఏకాగ్రత అవసరం. దీనికి ప్రత్యామ్నాయం లేదు.
కాలనేమి గారు, రెండూనూ.
ReplyDelete"ఏకాగ్రత" - concentration కు మీరు ఇచ్చే నిర్వచనం నాకు తెలియదు. నా వరకు అయితే, focussing on some object, by excluding all other thoughts hovering around. అని.It requires effort and action.
But what buddhist way of meditation (విపస్సన) says is, Be a passive observer. Don't exclude anything, don't judge anything either. Be watchful.
దీన్నే బషో హైకూలో ఇలా చెబుతాడు.
Be watchful
The rain comes
and the grass grows by itself.
జెన్ అన్నది ధ్యాన - చాన్ - జెన్ అయిందని మీరు చదివి ఉంటారు.