అవసరానికో
రంగు మార్చే ఆకాశంలో
ఎదురుపడ్డ
రెండు మబ్బులు
కళ్ళ మెరుపుల మధ్య
కురుస్తున్న వర్షం
విడివడిన
కొసలు బిగిస్తూ
జ్ఞాపకాల హరివిల్లు
తడి
వాకిట్లో
వర్షం చొరబడితే
ఇల్లంతా వాకిలి చేస్తూ
నిన్నటి చినుకుల్లో
నిలువెల్లా తడిసింది
నాలాంటి పాపే!
అర్ధంతరంగా
ఆగిన వర్షాన్ని
కాగితం పడవలతో
పిలుస్తూ
మళ్ళీ ఈరోజు..
అయినా నిశ్శబ్దం
ఆకాశం చూస్తూ
ఒంటరి పూవు
వెన్నెల పరుస్తూ
ఒంటరి చంద్రుడు
దొంగలా తచ్చాడుతూ
ఒంటరి మబ్బు
అనేక ఏకాంతాలపై
సామూహికంగా
చినుకుల దాడి
అసలు సిసలు వర్షం
చిందిపడ్డ
వాన చినుకు
భళ్ళుమన్న
చీమల పుట్టలా
జ్ఞాపకాలు
అందమైన ఆకాశానికి
ఎందుకిన్ని అడ్డుతెరలు
హాయిగా ఏడ్చేసా.
Wonderful poetry!!!
ReplyDeleteSuperb!!!!
ReplyDeleteHi Subbu - :))
ReplyDeleteTQ Padmarpita gaaru.
సాయికిరణ్ గారు,
ReplyDeleteమీ కవితల జల్లు అద్భుతం!
Excellent chala baga vrasaru :)
ReplyDeleteనిజంగా చాలా బావుంది. అభినందనలు.
ReplyDelete