మనదేశంలో వి.వి.ఐ.పి.లు చాలా ఎక్కువే. ప్రభుత్వం ప్రకటించిన వి.వి.ఐ.పి.లే కాకుండా, ఆ ప్రత్యేకత అంటగట్టబడే వాళ్ళూ, అంటగట్టించుకునేవాళ్ళు చాలా ఎక్కువే. ఈ రకంలో ఎక్కువగా లభించే వి.వి.ఐ.పి.లు రాజకీయ నాయకులు, సినిమా తారలు, క్రికెట్ క్రీడాకారులు, వారి వారి కుటుంబసభ్యులు. వాళ్ళు ఎక్కేదాకా విమానాలను, రైళ్ళను ఆపుచేయిస్తారు. వాళ్ళు దర్శనం చేసుకునే దాకా గుళ్ళల్లోనూ గోపురాల్లోనూ అందరి దర్శనం ఆపుచేయిస్తారు. ఆఖరికి వాళ్ళు ప్రయాణం చేస్తున్న రోడ్లు కూడా భద్రతా నెపం మీద మిగతా జనాలకు మూసివేస్తారు.
ఈ దరిద్రాన్నంతా భరిస్తాం కాబట్టే మనం 'భారతీయులం' అయ్యాం. ప్రపంచమంతటా 'భరించేవారే' ఉండాలనుకోవటం 'ఖాన్' గారి మూర్ఖత్వం కాక ఇంకేమిటి? నీ దేశంలో నువ్వో మహాలింగానివి కావొచ్చు. ఇక్కడకొస్తే శతకోటి లింగాల్లో ఓ 'బోడిలింగానివే' అని అమెరికా అధికారులు చెప్పారని ఏడిస్తే ఎలా? ఇష్టం కాకపోతే అమెరికా వెళ్ళటం మానేయ్. అక్కడా అయ్యవారికి 'వి.వి.ఐ.పి.' అనే రిజర్వేషన్లు కావలంటే ఎలా?
ఈ వ్యవహారంలో అమెరికాను తప్పుపడుతూ సాగుతున్న వాదన ఎలా ఉందంటే, 'పేరులో ఖాన్ ఉంది కాబట్టి' ఆపేసారు అని. ఇంకా 'జాత్యహంకారం' ప్రదర్శిస్తున్నదని. భయ్యా, 'భరించే వాళ్ళ దేశం' కాబట్టే, సుప్రీంకోర్టు ఉరి శిక్ష వేసినా, పార్లమెంటు దాడి కేసులోని నిందితుడు, ముస్లీము కావటం వలన మాత్రమే మనదేశంలో ఇంకా బ్రతికే ఉన్నాడు. ముస్లీములు ఇబ్బందులకు గురౌతారని 'పోటా'ను మూసేసే మన నేతల సంకల్పానికి మన దేశంలో బలౌతున్నది వేలమంది ముస్లీమేతరులే.
అమెరికా తరహా పటిష్టమైన భద్రత లేదు కాబట్టే, విమానాలని హైజాక్ చేసి కరడుగట్టిన తీవ్రవాదులను విడిపించుకెళతారు. కాశ్మీరుకు చెందిన ఒకానొక కేంద్రమంత్రి కూతురుని కిడ్నాప్ చేసి (?) తీవ్రవాదులను విడిపించుకెళతారు. ఛోటా రాజన్ లకు, దావూద్ ఇబ్రహీంలకు పదుల సంఖ్యలో పాస్ పోర్టులు జారీ చేస్తారు. ఎమ్మేల్యేల నుంచి మంత్రుల దాకా దొంగ పాస్ పోర్టుల మీద జనాలని దొంగతనంగా విదేశాలకు తరలిస్తారు.
మనలా కుహానా లౌకికరాజ్యం కాదు కాబట్టే, కఠిన చర్యలు తీసుకునే సత్తా అమెరికా కలిగి ఉంది. శిక్ష పడ్డ వెధవ ఏ కులంవాడనో, మతంవాడనో ఆలోచించదు కాబట్టే, ఇంతవరకూ మరో టెర్రరిస్టుల దాడి అమెరికాపై జరగలేదు. అమెరికా స్ఫూర్తిగా దేశభద్రత కోసం మనమూ ఇటువంటి చర్యలు చేపట్టాలి.
కొంచం అటూ ఇటూ గా నా మనసులో ఉన్న భావాన్నే చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, అమెరికా లో చట్టం అమలు ఖచ్చితంగా జరుగుతుంది. రాజైనా, బంటైనా అంతా సమానమే.. తప్పు చేస్తే, ప్రెసిడెంట్ ఐనా సరే బోను ఎక్కాల్సిందే ! అసలు అవినీతే లేదా, ప్రెసిడెంట్ చేసిన అన్ని తప్పులకూ ఆయన బోను ఎక్కుతున్నాడా అనేది మరో చర్చనీయాంశం ! ఇక్కడ వి.ఐ.పీ లే చట్టానికి లొంగి ఉండగా లేనిది, బయట నుండి వస్తున్న వాడు, షా రుఖ్ ఖాన్ ఐనా సరే, ఆ వాస్తవాన్ని గుర్తించాలి. ఇలా మాట్లాడితే, నా మిత్రుడొకరు.. అబ్దుల్ కలాం గురించిన వాదన లేవదీసాడు. అబ్దుల్ కలాం కు జరిగింది అవమానమే ! ప్రెసిడెంట్ హోదాలో ఆయనకు జరిగిన దానికి బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే.. కానీ అంత మాత్రాన అబ్దుల్ కలాం = షా రుఖ్ ఖాన్ అయి పోరు!
ReplyDeleteWell said
ReplyDeleteఅమెరికా తరహా పటిష్టమైన భద్రత లేదు కాబట్టే, విమానాలని హైజాక్ చేసి కరడుగట్టిన తీవ్రవాదులను విడిపించుకెళతారు. కాశ్మీరుకు చెందిన ఒకానొక కేంద్రమంత్రి కూతురుని కిడ్నాప్ చేసి (?) తీవ్రవాదులను విడిపించుకెళతారు. ఛోటా రాజన్ లకు, దావూద్ ఇబ్రహీంలకు పదుల సంఖ్యలో పాస్ పోర్టులు జారీ చేస్తారు. ఎమ్మేల్యేల నుంచి మంత్రుల దాకా దొంగ పాస్ పోర్టుల మీద జనాలని దొంగతనంగా విదేశాలకు తరలిస్తారు.
ReplyDelete=>
ఇవన్నీ 9/11 కన్నా ముందు సంగతులు ! అపుడు అమెరికా కే సీన్ లేక 9/11 జరిగింది ! మనం మసూద్ అజహర్ ని వొదిలీడం వల్లే ! ఇవన్నీ ఇంటర్ లింక్డ్ ! అమ్రీకా వాళ్ళు తమ నీడని చూస్కుని ఝడుసుకుంటున్నారు కాబట్టే, అక్కడ ఇంకో 9/11 జరగలేదు. ఆమాత్తరం జాగర్త మనం తీసుకోం కాబట్టి, మనం భారతీయులం ! శుక్రవారం ప్రార్ధనల్లో ముస్లిము పాకిస్తానీలో, ఇరాకీయులో చనిపోయినా వాళ్ళూ ఓ రకంగా మనకన్నా దురదృష్టవంతులే అనిపిస్తూ ఉంటుంది. మన దేశంలో నెలకో సారి చొప్పున సగటున తీవ్రవాదుల దాడి జరిగితే, అక్కడ వారానికొకటి సగటు లెక్క నడుస్తూంది. అమ్రీకా లో నో ? ఎన్ని జరుగుతున్నాయి చెప్పండి ? అయినా ఎస్.ఆర్.కే దీన్ని 'మై నేం ఈజ్ ఖాన్' సినిమా కి ప్రచారం కింద వాడుకోట్లేదు కదా ?
@అమెరికా స్ఫూర్తిగా దేశభద్రత కోసం మనమూ ఇటువంటి చర్యలు చేపట్టాలి.
ReplyDeleteబాగా చెప్పారు.
ఇంకో కోణం - 911 జరిగిన కొద్ది రోజులకి నేను వేరే ఊరుకి వెళ్ళేప్పుడు అందరు తెళ్ళోలు ఉండే ఏర్పోర్ట్ లో నేను ఇంకోకడు మాత్రమే బ్రౌన్ గాళ్ళాము. మళ్ళని మాత్రమే విడిగా seach చేసారు. ఇది అప్పుడే కాదు చాలా యేళ్ళూ సాగయి. ఇప్పుడు జాతినిబట్టి వీళ్ళు భయం చూపుతున్నారు. మనది ఒక extreme ఐతే ఇక్కడ ఇంకో extreme. మన దేశం లో ఐతే "లైట్ లే " అనుకుంటాం.. ఇక్కడ paranoia ఎక్కువ.
ReplyDeleteఇక్కడ డబ్బు కనెక్షన్స్ ఉంటే ఎటువంటి శిక్ష అయిన తప్పించుకోవచ్చు. దానికి కొన్ని వేలలో నిదర్శనాలు ఉన్నాయి. మన దగ్గర ఆ సౌకర్యం కొంచం middle class వాళ్ళాకి కూడా లభిస్తుంది. ఇంకోటి మన దగ్గర చిన్న క్లాస్ -4 నుండి క్యాబినెట్ మినిస్టర్ వరకు అందరు కరప్టే .. ఇక్కడ అది highest levels కే పరిమితం. కాని మీరన్నది కరెక్టే వీళ్ళూ అమేరికా గురించి పట్టించుకుంటారు .. మన వాళ్ళు వాళ్ళ గురించే పట్టించుకుంటారు.
@sujata:
ReplyDelete>> "అయినా ఎస్.ఆర్.కే దీన్ని 'మై నేం ఈజ్ ఖాన్' సినిమా కి ప్రచారం కింద వాడుకోట్లేదు కదా ?"
పట్టేశారు. అతను చేస్తుంది అదే. ఆ సినిమా కథ కూడా పేర్లో ఖాన్ ఉన్న కారణాన వేధింపులకి గురయ్యే వ్యక్తి గాధే మరి.
Well written!
ReplyDeleteఖాన్ లకు వీ వీ ఐ పీ ఇస్తారా ఇవ్వరా అనేది వేరే విషయం కాని మీరు అమెరికా కు కట్టిన పట్టం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది కిరణ్ కుమార్ గారు.
ReplyDelete"అమెరికా తరహా పటిష్టమైన భద్రత లేదు కాబట్టే, విమానాలని హైజాక్ చేసి కరడుగట్టిన తీవ్రవాదులను విడిపించుకెళతారు. మనలా కుహానా లౌకికరాజ్యం కాదు కాబట్టే, కఠిన చర్యలు తీసుకునే సత్తా అమెరికా కలిగి ఉంది. శిక్ష పడ్డ వెధవ ఏ కులంవాడనో, మతంవాడనో ఆలోచించదు కాబట్టే, ఇంతవరకూ మరో టెర్రరిస్టుల దాడి అమెరికాపై జరగలేదు. " మీకు చాలా అభిమానమల్లే వుంది అమెరికా అంటే కాని అంత ఏమి వుండదు అండి ఇక్కడ.. వర్గ వివక్షత, రూప వివక్షత, రంగు వివక్షత, ధన వివక్షత రాజ్యమేల తాయి. అమెరికా లో ఒక కరడు కట్టిన రిపబ్లికన్ మాటలు వింటే నాకైతే మన వూళ్ళో తీవ్ర వాదులు ఇలానే మాట్లాడతారేమో అనుకుంటా.. ఖాన్ సినిమా కోసం పబ్లిసిటి స్టంట్ చేసేడేమో కాని అమెరికా మాత్రం మీరు అనుకున్నంత రామ రాజ్యం కాదు..
అమెరికా రామరాజ్యమనో, మన దేశం రావణరాజ్యమనో చెప్పటం నా ఉద్దేశ్యం కాదు భావన గారు. జరిగిన ఒక తీవ్రవాద దాడికి అమెరికా ప్రతిస్పందించిన తీరును, గత అయిదు దశాబ్దాలుగా మనం ప్రతిస్పందిస్తున్న తీరును గమనించండి.
ReplyDeleteనిజానికి మన ఈ సినిమావాళ్ళ వల్లనే సగటు భారతీయుడు కూడా అమెరికాలాంటి దేశాల్లో అనుమానాలకు గురౌతున్నారని చెప్పవచ్చు. మన బంగారమే మంచిది కానప్పుడు, పక్కవాదు ఇది బంగారం కాదన్నాదని ఉలుకెందుకు? మన బాలీవుడ్ సినీపరిశ్రమకు మాఫియాతోటి, తీవ్రవాదులతోటి ఉన్న సంబంధాలు రహస్యాలేమీ కావు. షార్జాలో దావూద్ ఇబ్రహీం పక్కన కూర్చొని క్రికెట్ మ్యాచ్ లు చూసే అనీల్ కపూర్ లు, దావూద్ ఆదేశాలపై వాడి ఇంటి ఫంక్షన్లకు వెళ్ళి డాన్సులు చేసే జాకీ ష్రాఫ్, జానీ లివర్, మెహమూద్, ఆదేష్ శ్రీవాస్తవ్ లు, మాదకద్రవ్యాలతో పట్టుబడ్డ పలువురు సినీ నటులు, దావూద్ గ్యాంగ్ ఇచ్చిన ఆయుధాలు ఇంట్లో దాచిపెట్టుకున్న సంజయ్ దత్ లాంటి వాళ్ళు మన బాలీవుడ్ వాళ్ళే. మన దేశంలో వీరందరికీ స్పెషల్ ట్రీట్మెంట్లే! అసలు ఇలాంటి వారివల్ల మన బాలీవుడ్ మీద ఎవరికీ అనుమానం రాదని, రాకూడదని ఎలా చెప్పగలం?
ReplyDeleteసాయి కిరణ్ గారు ఖాన్ అంటేనే ఎవరో తెలియని ఇమ్మిగ్రేషన్ వాళ్ళకు ఈ బాలివుడ్ గొడవలు ఏమి తెలుస్తాయి అండి.. మీరు చెప్పినవన్ని జరుగుతున్నాయి కాని అవి అన్ని కాదు కదా వాళ్ళు చెక్ చేసేది ఖాన్ పేరు వస్తే ఆపేస్తారా? వాళ్ళ డేటాబేస్ లో రెడ్ మార్క్ ఏదైన కేస్ లు వుంటే తప్ప పేరు కే రావు అని నేను అనుకుంటున్నా, ఇలా ప్రతి ముస్లిం ను ఆపాలంటే వాళ్ళకు జీవితం సరిపోదు అంతే కాదు వాళ్ళు మీరు అనుకున్నంత కఠినం గా కూడా వుండరు వాళ్ళ పాలసీ ల గురించి. ఎక్కడైనా లూప్ హోల్స్ వుంటాయండి.. పోలిస్ లలో డ్రగ్ బిజినెస్స్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ ఇక్కడ. అలా చెప్పుకుంటా పోతే చాలా పెద్ద లిస్ట్ అవుతుంది. అసలు ఇదంతా అతను సినిమా పబ్లిసిటి కోసమే ఐతే ఆ విషయం గురించి మాట్లాడటం కూడా దండుగ. :-)
ReplyDelete