"వ్యక్తిగతంగా జిన్నా మతాన్నెప్పుడూ పాటించలేదు. ఆరంభంలో తన ఉద్దేశం ముస్లింలకు రాజకీయ ప్రాతినిధ్యం. హిందూ-ముస్లిం ఐక్యత. కానీ అతివాదం, ఎమోషనలిజం తప్ప మరెటువంటి విధానమూ పనికిరాని వ్యవస్థ నైరాశ్యంలో తన రాజకీయ మనుగడకోసం, లేని మతం రంగును ఆపాదించుకుని మొండివైఖరి అవలంభించిన ఫలాయనవాద "బలవంతపు మతవాది"గా మారిన రాజకీయనాయకుడు జిన్నా. "
జిన్నా మతవాది అవునా కాదా అనే విషయంలో చాలానే అపోహలు ఉన్నాయి. మతాల ప్రామాణికంగా రెండు దేశాల సిద్ధాంతాన్ని పట్టుకు వేలాడిన జిన్నా, తన వ్యక్తిగత జీవితంలో 'మతాన్ని ఏనాడు పాటించలేదు' అంటూ 'జిన్నా భూతం' గురించి వ్రాయబడ్డ 'కామెడీ పోస్టులో' అయ్యవారు తన అభిప్రాయాన్ని అలా ఆపాదించారు.
తమ వాదనను వెలిబుచ్చే ఇతరులకు చరిత్ర పుస్తకాలు చదవమని సలహాలిచ్చే అయ్యవారు, తన విషయం వచ్చేసరికి, తనో చరిత్రను తిరగేసిన మేధావిగా ఎందుకు ఫీలవుతారో నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఏదేమైనా, అయ్యవారి పోస్టులు 'కామెడీ పోస్టులే' గాని 'చారిత్రక పోస్టులు' కావు కాబట్టి, కాసేపు నవ్వుకొని వదిలేద్దాం.
ఆ మాటకొస్తే, అసలు జిన్నా వ్యక్తిగతంగా 'లౌకికవాదా' అనే విషయం మనకు అనవసరం. రాజకీయంగా ఆయన ఏ పరిమితుల మధ్య తన అభిప్రాయాలు వ్యక్తం చేసాడు, ఏ ఆశయాలతో పని చేసాడు అనేదే ముఖ్యం. తన రాజకీయ లబ్దికి జిన్నా మతాన్ని వాడుకున్నాడనే విషయంలో ఎవ్వరికీ అనుమానం లేదు. చివరాఖరుకు 'కామెడీ అయ్యవారి కమ్యూనిస్టు హిస్టారియన్లతో సహా'. కావాలంటే, కామెడీ పోస్టులో చివరి పేరాలో మొదటి లైను చదవండి.
"ఆరంభంలో భారతీయ చరిత్రకారులు జిన్నాను ఒక విలన్ గా చిత్రీకరించడం nation building process లో భాగంగా మనం అర్థం చేసుకున్నా, ఇప్పుడు జిన్నాను "సరిగ్గా" అర్థం చేసుకోవడం అవసరం. సమస్యాత్మకం చేసుకోవడం అనవసరం."
సరే, అసలు జిన్నా మతవాది అవునా కాదా అనేది ఆయన వ్యక్తం చేసిన ఈక్రింది అభిప్రాయాల్లోనే అర్ధమౌతుంది. కాబట్టి, 'కామెడీ వారి' అభిప్రాయాలని బుట్ట దాఖలు చేసి, పాఠకులు వారి వారి అభిప్రాయాలు ఏర్పరచుకోండి. ఇక్కడ కోట్ చేయబడుతున్న జిన్నా ప్రసంగ పాఠాలు, నేను వ్రాసినవి కాదు. అవి రికార్డు చేయబడిన చారిత్రక సత్యాలు.
ముందుగా 'ముస్లీంలీగ్' అధ్యక్షుడుగా మార్చి 22-23, 1940లో లాహోరులో ఆయన చేసిన ప్రసంగం :
It is extremely difficult to appreciate why our Hindu friends fail to understand the real nature of Islam and Hinduism. They are not religions in the strict sense of the word, but are, in fact, different and distinct social orders, and it is a dream that the Hindus and Muslims can ever evolve a common nationality, and this misconception of one Indian nation has troubles and will lead India to destruction if we fail to revise our notions in time. The Hindus and Muslims belong to two different religious philosophies, social customs, litterateurs. They neither intermarry nor interdine together and, indeed, they belong to two different civilizations which are based mainly on conflicting ideas and conceptions. Their aspect on life and of life are different. It is quite clear that Hindus and Mussalmans derive their inspiration from different sources of history. They have different epics, different heroes, and different episodes. Very often the hero of one is a foe of the other and, likewise, their victories and defeats overlap. To yoke together two such nations under a single state, one as a numerical minority and the other as a majority, must lead to growing discontent and final destruction of any fabric that may be so built for the government of such a state.
ఇక, సెప్టెంబరు 1945లో ఈద్ పండుగ సందర్బంగా ఆయన చేసిన ప్రసంగం :
In the message of Eid to the Muslims in September 1945 he said, "Every Mussalman knows that the injunctions of the Holy Quran are not confined to religious and moral duties. From the Atlantic to the Ganges, says Gibbon, the Holy Quran is acknowledged as the fundamental code, not only of theology, but of civil and criminal jurisprudence, and the laws which regulate the action and the property of mankind are governed by immutable sanctions of the will of God". Everyone, except those who are ignorant, knows the Holy Quran is the general code of the Muslims".
11 ఆగస్టు, 1947 పాకిస్తాన్ రాజ్యాంగసభలో ఆయన చేసిన ప్రసంగం :
"You may belong to any religion or caste or creed -- that has nothing to do with the business of the state ...... We are starting with this fundamental principle that we are all citizens and citizens of one state....... in the course of time Hindus would cease to be Hindus and Muslims would cease to be Muslims, not in the religious sense, because that is the personal faith of each individual, but in the political sense as citizens of the state".
పాకిస్తాన్ రాజ్యాంగసభలో ఆయన చేసిన ప్రసంగానికి, జిన్నా ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన అప్పటి జాతీయోద్యమ నాయకులు చెప్పినదానికి ఏమైనా తేడా ఉందా? దీన్నిబట్టి, మతాన్ని తన స్వార్దపూరిత రాజకీయ ఆకాంక్షలకు జిన్నా ఉపయోగించుకున్నాడని స్పష్టంగా తెలుస్తున్నది కదా! మరి అలాంటి వ్యక్తి 'లౌకికవాది' ఎలా అయ్యాడు?
అయ్యవారి ఆర్టికిల్లోని చివరిపేరాలోని 'కామెడీ కారుకూతలు' మరోసారి.
"ఆరంభంలో భారతీయ చరిత్రకారులు జిన్నాను ఒక విలన్ గా చిత్రీకరించడం nation building process లో భాగంగా మనం అర్థం చేసుకున్నా, ఇప్పుడు జిన్నాను "సరిగ్గా" అర్థం చేసుకోవడం అవసరం. సమస్యాత్మకం చేసుకోవడం అనవసరం. ముఖ్యంగా అది బిజేపీ చెయ్యడం వారి తెలియనితనాన్నే సూచిస్తోంది."
Nation Building Process లో భాగంగా జిన్నాను విలన్ గా చిత్రీకరించారా! ఇప్పుడు జిన్నాను 'సరిగ్గా' అర్ధం చేసుకోవాలా!! సరిగా అర్ధం చేసుకోకుండా చరిత్రకు కామ్రేడ్లు ఎర్ర అద్దాలు కప్పేసారని ఈ అయ్యవారు ఇప్పుడు ఒప్పుకుంటున్నట్లేనా? మొత్తానికి 'కామెడీవారు' 'కామ్రెడ్లని' కూడా వెంగళప్పలు చేసేస్తున్నారు.
చరిత్రను ఉటంకించేటప్పుడు మనకు పరిగణనలోనున్న ఆధారాలను తీసుకుని చూపాలి. అయితే మీరు చెప్పిన ఆ కామెడీ పోస్ట్ లో ఏ విధమైన reference లేకపొయేసరికి, "వ్యక్తిగతంగా జిన్నా మతాన్నెప్పుడూ పాటించలేదు." అన్న వాక్యం చదివినవారికి ఈ రాసిన వ్యక్తి జిన్నా స్నేహితుడో/సన్నిహితుడో అనిపించక మానదు. Reference లేకపోయినట్లైతే కనీసం "వ్యక్తిగతంగా జిన్నా మతాన్నెప్పుడూ పాటించలేదన్నది నానమ్మకం" అనయినా రాసుండాలి కదా. మన అభిప్రాయాలను ఇంత బలవంతంగా ఇతరులపై రుద్దేవాళ్ళు మీరు తీసి పారేసేంత కమిడియన్లు కాదు. ప్రమాదకారులు.
ReplyDeleteమతం మీద నమ్మకం లేకపోయినా ఏదో ప్రయోజనాన్ని ఆశించి మతం పేరు చెప్పుకోవడం కూడా రాజకీయంగా అవకాశవాదమే కదా. ఏ రకంగానైనా జిన్నా సెక్యులరిస్ట్ కాలేడు.
ReplyDeleteబృహస్పతి గారు - వ్యక్తిగతంగా జిన్నా మతాన్ని పాటించలేదని ఆధారాలు చూపినా కూడా అది అనవసరమే. జిన్నా వ్యక్తిగతంగా రోజూ నమాజ్ చేసేవాదా కాదా, ఇస్లాంకు విరుద్ధంగా పంది మాంసం తినేవాడా కాదా అన్నవి ఆయన లౌకిక దృక్పధానికి ఆధారాలు కాజాలవు. సరే, ఆ ఆధారాలు ఉన్నాయి అని ఆ విషయం ఒప్పుకున్నా, ఒక వ్యక్తిగా ఆయన విసర్జించిన మతము, ఆ మతపు కట్టుబాట్లు రాజకీయాలకు మాత్రం ఎందుకు అవసరమయ్యాయి? ఆయన లౌకికవాది ఎలా అయ్యాడు?
ReplyDelete:-) Comedy post అంటె అంతె కదా మరి.
ReplyDeleteI do not know why you are taking his tapaa's very seriously. He does not have any credibility.
ReplyDeleteSri
లౌకికవాది అంటే "హిందు" అన్న ప్రతిదానిని విమర్శించేవాడే అని భావించేవాళ్లనుండి "జిన్నా" లౌకికవాది అన్న సమర్ధన "కామేడీ" ఆశ్చర్యం కలిగించలేదు.
ReplyDeleteఇంకా మున్ముందు "జిన్నానే" మన మొదటి ప్రధానమంత్రి చేసి ఉంటే బాగుండి ఉండేది అన్న "టపా" లు ఆశించటం తప్పు కాదేమో. ఇంకో "కామెడీ" సిరీస్ కి రెడీ గా ఉండండి.
ఆయన అభిప్రాయం తీసుకోని మీ అభిప్రాయం చెప్పడం వరకు బాగానే వుంది.
ReplyDeleteకామెడి కామెడి కామెడి అని పది సార్లు అనటం బాగోలేదు. కామెడి అంటే IGNORE చెయ్యాలి కాని, ఇంత సీరియస్ గా రిప్లై ఇస్తే అది కామెడి ఎలా అవుతాది ?
కామెడి కామెడి కామెడి అని పది సార్లు అనటం మీది పైచేయి అని చూపించుకోవడానికి అయితే నా కామెంట్ ను IGNORE చెయ్యండి.
@a2zdreams
ReplyDeleteహ హ హ :))
హిందువుల గురించి, కొన్ని కులాల గురించి ఆయన ఎప్పుడూ చేసే కామెడీ నాకూ అలానే అనిపిస్తుంది. నాకిక్కడ చెప్పిన మాటే 'కామెడీ'గారికి కూడా ఓసారి చెప్పి చూడండి. అక్కడ ఫలితం ఉంటే, ఇక్కడా ఉండొచ్చు.
ప్రత్యక్షచర్య (Direct Action) అంటూ హిందువుల్ని చంపమని బహిరంగంగా తన అనుచరుల్ని ఆదేశించి వందలాదిమంది అమాయకుల్ని ఊచకోత కొయ్యడానికి కారకుడైన జిన్నాలోని లౌకికతత్త్వాన్ని మనం ఇప్పుడు రీ-డిస్కవర్ చెయ్యాలా ? అతన్ని అనవసరంగా విలన్ని చేశారా ? కామెడీ కాకపోతే మరేంటిది ?
ReplyDelete