Saturday, February 6, 2010

'తాగుడు' ఉద్యమం కాదు, 'నెత్తురోడిన' ఉద్యమం

తెలంగాణా ఇచ్చినట్లే ఇచ్చి కేంద్ర ప్రభుత్వం మోసపుచ్చినందుకు, తాడోపేడో తేలాల్సిన స్థితిలో ఉన్న ఉద్యమాన్ని కే.సి.ఆర్. నీరుగార్చినందుకు నిరాశా నిస్పృహలతో తెలంగాణా గురించి ఇక వ్రాయకూడదని నిర్ణయించుకున్నాను ఈ మధ్యనే. కానీ, తెలంగాణా సమస్య ఒక రాజకీయ, సామాజిక, సాంఘిక, సాంస్కృతిక, సాహితీ సమస్యలుగా చిత్రీకరిస్తూ వచ్చి, ఇప్పుడు దాన్ని తాగుడు సమస్యగా మరో మెట్టు దిగజారి చేస్తున్న విమర్శలు నిజంగానే మనసుని కలచివేస్తుంది. అందునా, మంచి రచయితగా, మేధావిగా అభిమానించే వ్యక్తులు చేస్తున్నప్పుడు మరింత బాధ కలిగిస్తుంది.

తెలంగాణా సమస్య అర్ధం చేసుకోలేని బ్రహ్మ పదార్ధం కాదు. మునుపు, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతానికి జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా, ఏ అభివృద్ధి ప్రాతిపదికన ఆంధ్రరాష్ట్ర ఉద్యమం మొదలయ్యిందో, అదే ప్రాతిపదికన ప్రత్యేక తెలంగాణా మొదలయ్యింది. ఉన్న తేడా అల్లా, చారిత్రక కోణం.

నిజాం నిరంకుశ పాదాల కింద నెత్తురోడింది తెలంగాణా. భారతజాతి యావత్తు అర్ధరాత్రి స్వాతంత్ర్యాన్ని ఆస్వాదిస్తుంటే, తెల్లవారే దిక్కేదో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడింది తెలంగాణా. ఆపై సంవత్సరానికి గానీ, స్వేఛ్చావాయువులు సోకని దుర్భర పరిస్థితుల్లో, రేపటి ఉషస్సు కోసం పోరుబాటన పట్టింది తెలంగాణ. ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైన పోరాటంలో రక్తసిక్తమైన చరిత్ర తెలంగాణాది. సంకుచిత రాజకీయ పరిధుల్లో పరిగణించాల్సిన పోరాటం కాదిది. నిజాం నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ చేసిన పోరాటం ఇది. పటేల్, పట్వారీ, దేశ్ ముఖ్, దేశ్ పాండే, రజాకార్ల అరాచకాన్ని ఎదిరించిన పోరాటం ఇది. విశాల భారతంలో మమేకమవ్వాలని తెలంగాణా చెసిన పోరాటం ఇది.

అలాంటి తెలంగాణా ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం అడిగితే, ప్రత్యేక దేశం అడుగుతున్నట్లుగా చీదరింపులు దేనికి? ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయని ప్రశ్నిస్తే, వెక్కిరింపులు దేనికి? ఆశించిన తీరులో అభివృద్ధి ఏదని అడిగితే, గేలి చేయటం దేనికి?

తెలంగాణా కె.సి.ఆర్. పోరాటం కాదు. ప్రజల పోరాటం. అందుకే, రెండు నెలలుగా స్త్రీ పురుష భేదం లేకుండా, చిన్నా పెద్దా అని లేకుండా ఉద్యమాన్ని నడుపుతున్నారు. ప్రస్తుతం, పార్టీలు పోషిస్తున్న పోరాటం కాదిది.

ఆ పోరాటానికి, ఇప్పటి పోరాటానికి ఉన్న సారూప్యమేమిటనేది అసలైన ప్రశ్న. అప్పుడు నిజాం నవాబు, వారి తాబేదార్లు దోచుకున్నారు, ఇప్పుడు ఆంధ్రావాళ్ళు ఆ పనే చేస్తున్నారనేది అసలు సారూప్యమే కాదు. కేవలం ప్రజలను, ఉద్యమాన్ని పక్కదోవ పట్టించటానికి కొందరు నాయకులు చేసే ప్రేలాపనలే అవి. విచారకరమైన విషయం ఏమిటంటే, చదువుకున్న వ్యక్తులు కూడా అటువంటి నాయకుల ప్రేలాపనలనే తెలంగాణా గుండె చప్పుడుగా పేర్కొంటూ తెలంగాణా ఉద్యమాన్ని వ్యతిరేకించటమే కాకుండా, అవమానిస్తున్నారు కూడా.

సరే, అప్పటి ప్రజల దుర్భర పరిస్థితులకి, ఇప్పటి పరిస్థితులకి పెద్దగా మార్పేమీ లేకపోవటమే ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి ప్రధాన కారణం. జరిగిన అభివృద్ధైనా, కాలక్రమంలో జరిగినదే కానీ, కాలాతీతంగా జరిగిన అభివృద్ధి శూన్యం. భూమి లేక, భుక్తి లేక ఇక్కట్లు పడ్డ ప్రజలు అప్పుడు ఉన్నట్లే, ఇప్పుడూ ఉన్నారు. సమైక్యాంధ్రుల మాటకొస్తే, అటువంటి దుర్భర పరిస్థితులు సీమాంధ్రలలో కూడా ఉంది. అవును. అభివృద్ధి ప్రాతిపదికగా పోరాటం చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం తెచ్చుకున్నా అభివృద్ధి జరగకపోతే, ఎవరిని తప్పు పట్టాలి? ప్రభుత్వాలని నిలదీయరే? అటు తెలంగాణా ప్రజలు, చేసిన బాసలు మరచిన ప్రభుత్వాన్ని నిలదీసి ప్రత్యేక రాష్ట్రం అడుగుతుంటే తప్పు పట్టటం ఏమిటి?

దురదృష్టవశాత్తు, ఇది రాజకీయంగా తీరాల్సిన సమస్య కాబట్టి, రాజకీయ కోణాలు వికృతంగా ఆవిష్కరింపబడుతున్నాయి. ఎన్ని రాజకీయ అభిప్రాయాలున్నా, మరెన్ని సైద్ధాంతిక విభేదాలు ఉన్నా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామిక ప్రభుత్వాలు నడవాలి. ఆ క్రమంలో ఆయా రాజకీయ పక్షాల విధివిధానాలు అడ్డు రాకూడదు. కానీ, తెలంగాణాకు సంబంధించి ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నడవడిక, తదితర రాజకీయపక్షాల నడవడిక ఆ స్ఫూర్తినే దెబ్బ తీసేదిగా ఉంది.

18 comments:

  1. క్లుప్తంగా...చాలా బాగా విశ్లేషించారు.

    ReplyDelete
  2. నేనుకోవడం - మనుషుల్లో అహంకారం ఎంత స్థాయిలో ఉంటుందంటే బహుశా మనం ఊహించలేనంత స్థాయిలో ఉంటుంది. ఇలా చేస్తే మంచి జఱుగుతుందని చెప్పినప్పుడు ఆ సందర్భంగా తమ లోపాన్ని ప్రస్తావిస్తే - ముఖ్యంగా అది తమ ప్రియతమమైన లోపమైతే కడుపు రగిలిపోతుంది. అవతలవారి అసలు ఉద్దేశాన్నే గమనించాలి. శుష్కమైన మాటలు కాదు. బ్లాగులు మాట్లాడవు. మనుషులు మాట్లాడతారు. బ్లాగులు యాంత్రికంగా అక్షరాల్ని మాత్రమే చూపిస్తాయి. మాటలకి సందర్భపరమైన పరిమితులుంటాయి. ఒక సందర్భంలో నిజాయితీగా ఒక సూచన చేసినంత మాత్రాన ఆ వ్యక్తి మనసులో ఏవో బయటికి చెప్పని దురభిప్రాయాలు ఉన్నాయనుకోవడం సరికాదు.

    ప్రత్యేక తెలంగాణ అడగడం ప్రత్యేకదేశం కావాలని అడగడం లాంటిదే. ఈ డిమాండుకీ ఇతర రాష్ట్రాల్ని విభజించడానికీ మధ్య చాలా తేడా ఉంది. ఆ విషయం ఇంతకుముందు కాకపోయినా ఇప్పుడు గత రెణ్ణెల్లుగా సమైక్యవాదులు స్పష్టంగా గమనించారు. ప్రత్యక్షంగా అనుభవించారు కూడా ! తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పట్ల ప్రేమ కంటే ఆంధ్రప్రాంతీయుల పట్ల కృత్రిమంగా అపప్రచారపూర్వకంగా కల్పించబడ్డ ద్వేషం చాలా చాలా అధికస్థాయిలో మితిమీఱిన మోతాదులో ఉందని, ఇది ఆంధ్రప్రాంతం పక్కన శత్రుభావంతో రగిలిపోయే ఒక భవిష్యత్ తెలుగు పాకిస్తాన్ ని సృష్టించబోతోందని అర్థమయ్యాక కూడా రాష్ట్రవిభజనని తమ యావత్ శక్తులూ ఒడ్డి అడ్డుకోకుండా సమైక్యవాదులు నోరు మూసుకొని ఊరుకోవడం సాధ్యపడదు. మీరు బాధపడతారని తెలిసీ నేను ఈ మాట వాడకూడదేమో ! క్షమించాలి. నా అభిప్రాయంలో - ఇదొక అనవసరమైన ఏడుపుగొట్టు ఉద్యమం. వాస్తవానికి ఇదొక ఒక కుట్ర, ఇది విదేశధనంతో ఒక డిసిడెంట్ వ్యక్తి ద్వారా ఇండియాకి వ్యతిరేకంగా నడిపించబడుతున్న ద్రోహం. ఇది విజయవంతం కాకపోవడం ఆంధ్రప్రదేశ్ కే కాదు, ఇండియాకి మంచిది. ఎందుకంటే ఇది ప్రత్యేక తెలంగాణతో ఆగేది కాదు.

    ఈ ఉద్యమం చాలా untimely. పాతగాయాలు మానిపోయి తెలుగువాళ్ళంతా మళ్ళీ కలిసిపోతున్న తరుణంలో, ఆంధ్రప్రాంతీయులూ, తెలంగాణప్రాంతీయులూ లిసి చదువుకుంటూ వివాహసంబంధాలు కూడా కలుపుకుంటున్న సమయంలో అనేక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ సగర్వంగా దూసుకుపోతున్న తరుణంలో మనల్ని ఉమ్మడిగా నాశనం చేయడానికే వచ్చినట్లు వచ్చింది. అసలు అది రాలేదు. రప్పించారు. కేసీయార్ కి నాయుడుతో పడకపోతే నాయుడు తన శత్రువు కనుక అతను ఆంధ్రావాడు కనుక ఇహ ఆంధ్రావాళ్ళందఱిమీదా కక్షగట్టాడు. చివఱికి ఆ యిద్దఱి మధ్యా గొడవని కాస్తా అనవసరంగా రెండు ప్రాంతాల మధ్య యుద్ధంగా మార్చేశారు. అది పక్కన బెట్టి తెలంగాణ ఉద్యమం 60 ఏళ్ళ నుంచి జఱుగుతోందని పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. గత 40 ఏళ్ళుగా నేను బతికే ఉన్నాను. అన్నీ చూస్తూనే ఉన్నాను. కేసీయార్ కి నాయుడుకూ గొడవ రాకముందు ఏది ఉద్యమం ? ఎక్కడుంది ? అప్పుడు ఎవఱడిగారు తెలంగాణ కావాలని ? ఇప్పుడు అకారణంగా హఠాత్తుగా అంధ్రావాళ్ళంటే తెలంగాణవాళ్ళకి విషమైపోవడానికి కారకులెవఱు ? ఆలోచించండి.

    ఒక మనిషిగా నాకూ నేను పుట్టిన ప్రదేశం ఆభిమానపాత్రమే. కానీ ఆ అభిమానానికి ఒక రాష్ట్రరూపం, ఒక రాజకీయరూపం కావాలని నేను కోరుకోను. ఆ అభిమానాన్ని మనసులోనే దాచుకుంటాను. తక్కిన తెలుగువారితో కలిసిపోతాను. కానీ ఇందుకు విరుద్ధమైన ప్రవర్తన ఒక ప్రాంతంలో గోచరిస్తోంది.

    ReplyDelete
  3. @తాడుపిల్లి:
    రెండు ప్రాంతాలు కలిసి పోయాయి అంటున్నారు... ఎక్కడ కలిశాయో చెప్తారా... మీకు మాకు వివాహ సంబంధాలు ఎంతగా కలిశాయి ?.. ఎక్కడో .. ఏ మూలకో ఎవరో ఒకరు తప్పితే అందరి మదిలో ప్రాంతీయ భావన ఉండి మీ వాళ్ళు మా వాళ్ళు సంబందాలు ఏర్పాటుచేసుకోలేదు...
    ఆంధ్ర ప్రదేశ్ దూసుకెల్తోంది అన్నావే... ప్రాంతీయంగా.... జిల్లా ల వారిగా మనుషు ల వారిగా ఎంతవరకు అలా దూసుకెళ్ళిందో తెలవని విషయమా... కొన్ని ప్రాంతాల నుండి కూలీల లాగా వలసలు .. దశాబ్దాల నుంది కుంటి బతుకులు భరిస్తూ... ఇంకా అలాగే ఎదురు చూస్తున్నారు...
    తాగటం తప్పు అన్నావే... తాగుతారని చీదరించుకున్నావే... మా దగ్గర అది తప్పు కాదు... ఎన్ని అభివృద్ది చెందిన దేశాల్లో ఆడవారు తాగటం లేదు... ఇది కేవలం నీ లో ఉన్న విషాన్ని చిమ్మడం కాక మరేంటి... తాగటం వల్లే అబివృద్ది జరగలేదా... అసలైన రెసోర్స్ అందుబాటు లొ లేక పోతే ఎం చేస్తారు... నీ బ్రాహ్మనులు చరిత్ర లో తాగేవారని తెలియదా... నువ్వేదొ నీ అబిప్రాయాలను ఇతరుల మీద రుద్దు తావా... అదీ కాక చీదరించుకుంటావా ... మరి అలాంటి మా హైదరాబాద్ లో ఎందుకు ఉన్నావు...
    మీ లాంటి వారి ధోరణి వల్లనే ఆంధ్ర ప్రదేశ్ విడి పోవాల్సిన పరిస్థితి...

    ReplyDelete
  4. tadepalli garu, hats off to your comments

    ReplyDelete
  5. ఇక్కడ సమస్య అంతా హైదరాబాద్ మూలంగానే. హైదరాబాద్ విడిగా పెట్టి మిగతా జిల్లాలతో ప్రతుతానికి తెలంగాణ ఏర్పరుద్దామనే ప్రతిపాదన వస్తే పెద్దగా గొడవ ఉండకపోవచ్చు - తెలంగాణేతరులు ఒప్పుకోవచ్చు కూడా. కానీ ఒక్క హైదరాబాద్ కోసం మిగిలిన జిల్లాలని పణంగా పెట్టడం తెలంగాణా వాదుల అసలు ప్రేమనే తెలియజేస్తుంది.

    ఇది హైదరాబాద్ కోసం జరుగుతున్న పోరాటంగానీ తెలంగాణా కోసం కాదు.

    ReplyDelete
  6. అసలు తెలంగాణా సమస్యపై మీ దృక్పధం లోనే లోపం ఉందని అనిపిస్తుంది. నిజాయితీగా లోపాలని చెప్పానంటున్నారు. ఏమిటా లోపం. తెలంగాణా వాళ్ళందరూ తాగుతారనేదేనా? మరో బ్లాగులో ఆయనెవరో చెప్పినట్లు, పెద్దాపురం, చిలకులూరిపేటలలో కడుపు నింపుకోటానికి వ్యభిచారం వృత్తిగా చేసుకుంటున్నారు కొందరు యువతులు అని, ఆంధ్ర స్త్రీలందరు వ్యభిచారులని ముద్ర వేయటమా? రాయలసీమల ఫాక్షన్ హత్యలు జరుగుతాయి కాబట్టి, రాయలసీమలోని ప్రతి వ్యక్తి హంతకుడని తీర్మానించటమా నిజాయితీ?

    ఇప్పుడు, తెలంగాణాను పాకిస్తాన్ తో పోల్చటంతో మీ నిజాయితీలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఓ కుట్ర అని చెబుతున్నారు. దాని మీద పరిశోధించి నిరూపించవచ్చుగా.

    ఇక ద్వేషభావాలు రెచ్చగొట్టటంపైన... రెండు చేతులు కలిస్తే కానీ, చప్పట్లు మోగవు. ఇటు సమైక్య ఆంధ్ర తరుఫున చదువుకున్న మీరెలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారో, అటు తెలంగాణా తరుఫున అనాగరికులు (మీ దృష్టిలో) ఆరోపణలు చేస్తున్నారు. ఇటువంటి మాటల యుద్ధాల మధ్య ద్వేషభావం కాక, సామరస్య భావన ఎలా వస్తుందనుకుంటున్నారు?

    ReplyDelete
  7. ఇది మరీ బాగుంది మలక్. మీ ఇంటి కోసం మీరు పోరాటం చేస్తూ, నట్ట నడిమి గది వదులుకుంటారా? ఆంధ్ర రాష్ట్రం కన్నా ముందు, తెలంగాణా జిల్లాలతో ముందుగా ఏర్పడిన రాష్ట్రం హైద్రాబాదు. ఆ హైద్రాబాదు రాష్ట్రానికి హైద్రాబాదు రాజధాని. హైద్రాబాదు రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం కలిసి విశాలాంధ్ర అయ్యింది కానీ, ఆంధ్రలో తెలంగాణా కలవలేదు. ఇక హైద్రాబాదుపై ఆంధ్రకు హక్కు ఎక్కడి నుంచి వచ్చింది?

    ReplyDelete
  8. హైదరాబాద్ పై ఆంధ్ర హక్కుల గురంచి కాదు. ముందుగా హైదరాబాద్ మినహా ప్రాంతాన్ని విడగొట్టి ఇప్పుడూ చేసే పోరాటం హైదరబాద్ కోసం కంటిన్యూ చెయ్యచ్చు కదా? హైదరాబాద్ ఒకళ్ళతో కలవడమో విడిగా ఉండడమో తేలుతుంది - ఇప్పుడు కాకపోతే మరో ఇరవై యేళ్ళ తరవాత. నట్టింటికోసం మిగిలిన ఎనిమిదిగదులనీ వదులుకోవాలా?

    ReplyDelete
  9. మీ నట్టింట్లో మీతోపాటు వేరే వాళ్ళుకూడ సెటిల్ అయ్యారు. వాళ్ళని వెళ్ళగొట్టే పరిస్థితి లేదు. మిగతా ఎనిమిది గదులతో పేచీ లేదు. మీరేంచేస్తారు? ముందు ఎనిమిది గదులనీ తీసుకుని నట్టింటి కోసం పోరాడతారా, లేక వస్తుందో రాదో తెలియని, వేరే వాళ్ళు ఎక్కువగా ఉన్న ఆ నట్టింటిక్సం మిగిలిన ఎనిమిది గదులనీ వదులుకుంటారా? మిగిలిన జిల్లాలు జిల్లాలు కావా?

    ReplyDelete
  10. అయ్యా ! మనసులో ఏ కల్మషమూ లేకుండా తెలంగాణ ప్రజల అభివృద్ధి ని డైరెక్టుగా అడ్డుకుంటున్న ఒక వాస్తవిక సామాజిక లోపాన్ని సౌమ్యంగా, నాగరికంగా, సందర్భానుసారంగా ఎత్తిచూపితే ఇంతగా రగిలిపోతున్నారు మీరు. కానీ గత తొమ్మిదేళ్ళుగా మీ తెలంగాణవాదులు సమైక్యవాదుల్ని అకారణంగా ఏ ప్రొవొకేషనూ లేకుండా ఎంత గాయపర్చారో, ఎంత దూషించారో ఎంత అవమానించారో ఎలాంటి పిచ్చికూతలు కూశారో, ఇప్పటికీ ఎలా కూస్తున్నారో బాగా గుర్తుతెచ్చుకోండి. మీకు గుర్తుకు రాకపోతే నేను దాని గుఱించి ప్రత్యేకంగా ఒక టపా రాసి గుర్తుచేస్తాను. ఎంతకాలమని తెలంగాణవాదులు చేసే అవమానాల్ని ఓర్చుకుంటాం చెప్పండి ? నా బ్లాగులో తెలంగాణవాదులు దూరి ఉచ్చరించరాని బండబూతులు, పచ్చిబూతులు తిట్టారు. సమైక్యవాదులెప్పుడైనా అలాంటి బండబూతులు తిట్టారా ? తెలంగాణలో నేను రాసినవి మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి నేను గమనించినవి. అయితే వాటి గుఱించి మేము మాట్లాడే పరిస్థితి తెలంగాణవాదులు తేవద్దు. లిమిట్స్ లో ఉంటే మీకూ మంచిది, మాకూ మంచిది.

    ReplyDelete
  11. వేరే వాళ్ళను వెళ్ళగొట్టటమనే ప్రశ్నే తలెత్తదు మలక్. ఇవన్నీ అపోహలు, అభియోగాలు మాత్రమే. ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసిన రోజు, ఆంధ్ర ప్రాంతాలలోని తమిళులపై దాడులు జరిగాయి. అది ఒక abberation గానే చూడాలి. ఆ తర్వాత సాథారణ పరిస్థితులు ఏర్పడ్డాయి కూడా. ఇప్పటికీ, రాయలసీమ జిల్లాలలో ఎందరో తమిళులు ఉంటున్నారు.

    ReplyDelete
  12. [అయ్యా ! మనసులో ఏ కల్మషమూ లేకుండా తెలంగాణ ప్రజల అభివృద్ధి ని డైరెక్టుగా అడ్డుకుంటున్న ఒక వాస్తవిక సామాజిక లోపాన్ని సౌమ్యంగా, నాగరికంగా, సందర్భానుసారంగా ఎత్తిచూపితే ఇంతగా రగిలిపోతున్నారు మీరు.]
    =====
    తాడేపల్లి గారు - తాగుడు ఒక్క తెలంగాణాకు చెందిన సమస్యే కాదు. యావద్భారతానికి సంబంధించిన సమస్య. ప్రత్యేక తెలంగాణ విషయంలో తప్పుడు లెక్కలతో ఈ సమస్యను భూతద్దంలో చూపాలని మీరు చేసిన ప్రయత్నం కూడా విఫలం అయ్యిందనేది వాస్తవం.
    ===
    [కానీ గత తొమ్మిదేళ్ళుగా మీ తెలంగాణవాదులు సమైక్యవాదుల్ని అకారణంగా ఏ ప్రొవొకేషనూ లేకుండా ఎంత గాయపర్చారో, ఎంత దూషించారో ఎంత అవమానించారో ఎలాంటి పిచ్చికూతలు కూశారో, ఇప్పటికీ ఎలా కూస్తున్నారో బాగా గుర్తుతెచ్చుకోండి. మీకు గుర్తుకు రాకపోతే నేను దాని గుఱించి ప్రత్యేకంగా ఒక టపా రాసి గుర్తుచేస్తాను. ఎంతకాలమని తెలంగాణవాదులు చేసే అవమానాల్ని ఓర్చుకుంటాం చెప్పండి ?]
    ===
    నా వరకు, ఆ అనాగరికులు (మీ దృష్టిలో) చేసినదానికి, "కల్మష రహితంగా" మీరు చేసిన అసందర్భ ప్రస్తావనలు రెండు తప్పే. ఇంతకు మించి నేను చెప్పేదేమీ లేదు.
    ===
    నా బ్లాగులో తెలంగాణవాదులు దూరి ఉచ్చరించరాని బండబూతులు, పచ్చిబూతులు తిట్టారు. సమైక్యవాదులెప్పుడైనా అలాంటి బండబూతులు తిట్టారా ?
    ===
    దాదాపు అటువంటి బండబూతులే, నా బ్లాగులో వచ్చినప్పుడు నేను వాటిని తీసేసానంటే మీరు నమ్మరేమో. బ్లాగుల్లోనే కాదు, నా ఆర్కుట్ ప్రొఫైలులో కూడా కొందరు నా తెలంగాణా అనుకూలవాదానికి గాను నన్నూ బండ బూతులే తిట్టారు. ఎవరి సంస్కారం వారిదని ఊరుకోవటం తప్ప చేసేదేమీ లేదు. కానీ, వ్యక్తులపైని అభిప్రాయాలను, సమూహాలకు అన్వయింపచేయటం మాత్రం ఘోరం.

    ReplyDelete
  13. నేనూ అదే అంటున్నాను. వేరే వాళ్ళని వెళ్ళగొట్టడమనే ప్రసక్తే లేదు.

    అప్పుడు ఏం చేస్తారు? ఎనిమిది గదులు ముఖ్యమా, లేక ఒక్క గది కోసం ఎనిమిది గదులని పణంగా పెడతారా? నా ప్రశ్న ఒక్కటే - హైదరాబాద్ సమస్య అంత తొందరగా తేలదని తెలిసికూడా తెలంగాణాని హైదరాబాద్ తో ముడి పెట్టడానికి కారణం ఏమిటి? హైదరాబాద్ ని ఎవరికీ చెందకుంద, గొడవ తేలేదాకా పక్కన పెడితే ఇప్పుడున్న తొమ్మిది జిల్లాల బదులు హైదరాబాద్ ఒక్కటే అప్పుడు వివాదాస్పదమౌతుంది, మిగతా ఎనిమిది జిల్లాలకి స్వయం పాలన వస్తునంది - కానీ తెలంగాణా మేధావులు దానికెందుకు ఒప్పుకోవడం లేదు?

    ఎందుకంటే ఆంధ్రా నాయకులకి కావలసినట్టే తెలంగాణా నాయకులకి కూడ కావాల్సింది హైదరాబాద్ లో భూములు, రియల్ ఎస్టేట్. తెలంగాణా మీద ప్రేమ ఉంటే ఈ మడతపేచీ పెట్టరు.

    ReplyDelete
  14. అచ్చినం అచ్చినం తెలంగాన బిడ్డలం
    ఆటపాట పాడినం వంటవార్పుచేసినం
    బందులెన్నొ పెట్టినం బస్సులెన్నొ కాల్చినం
    పోరలను చంపినం తల్లుల కడుపుకోసినం
    ఆంద్రోల్లను కొట్టినం తెలుగుతల్లిని తిట్టినం
    ఎందుకొరకు చేసినం? ఏమో ఏమో తెల్వది
    ఎవ్వలు మట్టికొట్టుకోని పోతేమాకేమి?
    మా తెలంగాన బరాబర్ తెచ్చుకుంటం
    శవాల గుట్టలమద్దెల అశోకునిలెక్క ఎగురుతం
    కానీ అప్పుడు బుద్ధుడెవ్వలు రారు
    అదిగో ఆంద్రోడు చుక్కలీల్లు ఎక్వ తాగిండు. కక్కించు
    అదిగో నీ అన్న తమ్ములు ఒకరూక ఎక్కువ తెచ్చుకుండు. గుంజుకో
    అదిగో నీ అక్కచెల్లి . అదిగో నీ తెలుగుతల్లి. మీరెట్లయితరు.
    నా అక్కచెలి తల్లి తెలంగానలోనే ఉంటరు. మీరు ఎవ్వలో మాకేమీ అవసరం.
    మేము విడిపోతాం. మీరు చెడిపోవుండ్రి.

    ReplyDelete
  15. సాయి గారు,
    మీకు తిలిసింది గోరంత తెలియాల్సింది కొండంత.
    మీరు ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు, మీకు తెలిసింది పుస్తకాల్లో మీరు చదువుకున్న విషయాలు మాత్రమే.
    మీరు చెప్పిన నిజాం, రజాకర్ల కధలు, నక్సల్ ఉద్యమాలు ఇన్నేళ్ళుగా ఇక్కడ ఉంటున్న మాకు తెలుసు.
    ముస్లిం పాలన ఫలితాన ఇల్లు వాకిళ్ళు వదిలి కోస్తాకు వెళ్ళిన మొదటి తరం కుటుంబాలే మావి.
    మీరు చెప్పినంత చక్కగా, సున్నితం గా విడిపోయే సూచనలు ఇక్కడ ఇప్పుడు లేవు.
    మీరు చెప్పిన మొదటి తరం ఉద్యమాల్లో అధికారం కోల్పోయిన వారు వారి అధికారం కోసం చేస్తున్న పోరాటం ఇది.
    రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత భూపోరాటాల్లో పొలాలు, ఇల్లు వదిలి సిటి కి వచ్చిన పెద్ద మనుషులు తిరిగి పల్లెలకు వెళ్లి తమ పొలాలు స్వాధీనం చేసుకొని, సొమ్ము చేసుకొని రావటానికి ఈ ఉద్యమం ఉపయోగపడింది.
    ఈ మాట నేనన్నది కాదు గద్దర్ స్వయం గా కెసిఆర్ జ్యుసు తాగినప్పుడు చెప్పిన నిజం.
    దాశరధి బోటి వారికి ఇక్కడ విలువ లేదు. సంధ్యను, కృష్ణ మాదిగను స్టేజి పైనుండి నెట్టారు.
    మీరు ఉటంకించిన దొరలే ఇక్కడ ఈ పోరాటం లో అన్నీ. కూల్చాల్సిన నిజాం సమాధులకు దండలు పడుతున్నాయి. నల్ల బురఖాలకు తెల్ల గడ్డాలకు పట్టం కడుతున్నారు. ప్రత్యెక బడ్జట్లు అంటున్నారు.
    నిజాం తన కోసం తన ముం.. ల కోసం కట్టిన మహల్లు చూపి నిజాం మనకు ఇవన్ని చేసాడు, మంచోడు అంటున్నారు. రామారావు, చంద్ర బాబు కట్టినవి చేసినవి మరచి ఆంధ్రోల్లు దొంగలు అంటున్నారు.
    దారిన పొయ్యే వాళ్ళను కొట్టి, పంజా గుట్ట లో రాళ్ళు వేసేంత వరకు చాలా మంది దీనికి వ్యతిరేకం కాదు. తర్వాతే తెలిసింది ఇప్పుడు ఇలా వస్తే ఎంతఅనర్ధమో

    ReplyDelete
  16. telamgana seperate avvalanedi oka tala toka leni demand.. andhra lo chala prantalu venakabade unnai.. eppudo jarigina historic mistakes ni ippuudu rectify cheyyalanukovatam foolishness avtundi.. AP lo migatavallu kattina tax latho hyderabad ni develop chesaru.. hyderabad evadi babu sommu kadu.. andari kastam adi.. telanganani migata AP ni kooda develop cheyali..janala brathukulu marali..ante kani telanganani vidadeeyali ante migata prantala sangati enti. Repodduna andaman vallu mammalni pattinchukoledu so mem india nunchi vidipoyi china lo kalustam ante? asala north east states lo em jarugutundo evaru pattinchukoru.. mari valla sangati enti? state ni vidadeeyagalenidi country ni cheelchatam lo kooda pedda teda ledemo saikiran.. alochinchu

    ReplyDelete
  17. తాడేపల్లి, మలక్ మీరు చెప్పేది అర్థవంతంగా వుంది. 53 ఏళ్ళనుంచి పోరాడుతున్నాం అనికూస్తున్న ఈ జాతి అధికారంలో వున్న తమ ప్రాంతం వారిని ఎన్ని సార్లు నిలదీసింది?
    కిరణ్ చేస్తున్న వాదన ప్చ్.. ఏదో పేలవంగా వుంది. సాంసౄతిక, సామాజిక , ... ఇవన్నీ వూకదంపుడు. హైద్రాబాద్ నట్టిల్లు ఐతే మరి , వంట గది, పెంటగది , బాత్రూము కూడా ఏమిటో చెప్పాలి. :)) ఇట్లాంటి ఉపమానాలు అర్థంలేనివి. హైద్రాబాద్ ఉమ్మడి రాజధాని, 'అన్నదమ్ముల్లా విడిపోదామూ అని వారంటే మరి ఆస్థి పంపకాల మాటేమిటి?! 53ఏళ్ళ అయ్యింది మాకు డైవోర్స్ కావాలి, కాదంటే నాలుకలు కోస్తాము , ఆంధ్రావాళ్ళు భాగో , సినిమాలమీద దాడులు ఇదంతా తలతిరుగుడు వ్యవహారం కాదా?! వీటిని ఎవరైనా ఖండించారా? వెనకనుంచి ఫజులుల్లా ఏమి గొణిగాడొ , మందెక్కువై బార్లో నెహ్రూ ఏమి దో వాగిండో ఎవడిక్కావాలి? ఏమి చేశారు అనేది ముఖ్యం.
    పి.వి. నరసిమ్హారావు 5ఏళ్ళూ ప్రధానమంత్రి వున్నప్పుడీ వెధవలకు గుండెలు ఆగాయా? చప్పుళ్ళు చేయలేదా?! సంక్రాంతికి పోయినోళ్ళను రానివ్వం అని ఎవరిని ఉద్దేశించి అన్నారు? భూబకాసుర్లనా? సామాన్య ప్రజలనా?
    ఆంధ్రోళ్ళు దొంగలు అన్నారు , మరి తమ నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోకుండా విడిపోయి హైద్రాబాద్ అప్పనంగా వదలి వెళ్ళితే ఆ అపవాదు ఎప్పుడూ తొలగిపోదు. అందుకోసమైనా సీమాంధ్రులు విడిపోకూడదు. కావాలంటే ఇంకో 53ఏళ్ళు కానివ్వండి! తేల్చుకున్నాకే విడిపోతాం. ;) ఈలోపుల సమైక్యాంధ్ర నిధులతో సీమాంద్రల్లో సిటీలను డెవలప్ చేసుకోవాలి. సినిమా, ఐటి పరిశ్రమలని తరలించాలి ... బోలెడన్ని పనులు వున్నాయ్..
    ఈ తెలబాన్లు మనకు వాళ్ళను హైద్రాబాద్ నుండి తరమడంలో సహకరిస్తారు :)

    విడిపోయేముందు మళ్ళీ కలవము అని గ్యారంటీ కూడారాతపూర్వకంగా తీసుకోవాలి.

    శంకర్

    ReplyDelete
  18. Your house model is meaningless! Andhras won't leave Telangana UNTIL each and every Telangana agitator is UNDOUBTEDLY convinced that 'Andhras are NOT robberers but Telangana ministers are!' . Let it take 10,50, 100 years.. we should prove our innocence then only leave Telangan to them. :)

    Sankar

    ReplyDelete

మీ అభిప్రాయం :