Tuesday, February 23, 2010

అనుకోని అతిథి

కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయో అంచనాలకు అందదు. మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధనామార్గంలో ఉన్నప్పుడు కలిగే అనుభవాలు. జరిగే ప్రతి సంఘటనా, కలిగే ప్రతి అనుభవం ఎక్కడో ఎప్పటికో లింకు కలిగే ఉంటుంది. అది ఏమిటనేది మాత్రం సమయానికి స్ఫురించదు.


అది 16 ఫిబ్రవరి, 2010. యధాప్రకారం రాత్రి 11 కు పడుకున్నా. కానీ, 2 గంటలకే నిద్ర ఎగిరి పోయింది. దానికి సగం కారణం "కొత్తపాళి" గారైతే, మరో సగం కారణం "అఫ్సర్" గారు. :))


నిద్రలేమితో అలా పొర్లుతూ ఉండగానే, 3.30 కు అలారం మోగింది. దాన్నో అరగంట ముందుకు జరిపి మళ్ళీ పొర్లుతూనే ఉన్నా. దాదాపుగా నాలుగైంది. లేవగానే, ముందస్తుగా పూజ గదిలో అమ్మవారిని చూడాల్సిందే. లైటు వేసుకుంటే, నా మొహమే చూడాల్సొస్తుందనే భయంతో అలానే బయలుదేరుతా.


క్రమంలో స్టడీ రూము దాటుతుండగా పక్కనే కుప్పలా కనిపించింది. మాములుగా అయితే, కాళ్ళు తుడిచే పట్టాగా భావించి పక్కకు నెడతాను. ఎందుకో సమయంలో మాత్రం సం థింగీజ్ రాంగ్ అనిపించింది. పిల్లల స్కూలు బ్యాగో, గుడ్డలో అయ్యుంటాయిలే అని సర్దిచెప్పుకుంటూ, పక్కన పెడదామని కొద్దిగా వంగితే వెంటనే స్ఫురించింది అదో పాము అని!


వెంటనే బెడ్రూములో మా ఆవిడను నిద్రలేపి చెప్పి, తిరిగి వచ్చి చూస్తే, పాము మాయం. మళ్ళీ అనుమానం. అదసలు పామేనా, లేక నిద్రమత్తులో నా భ్రమా! భ్రమ అయినా ఫర్వాలేదు కానీ, అది నిజమైన పామే అయ్యుంటే, మూలకు వెళ్ళిందో? వెంటనే లైటేసి మరో అర నిముషం వెతికితే, వాషింగ్ మెషీన్ వెనుక పడుకొని, మమ్మల్ని చూస్తూ కనిపించింది. నిజానికి భయంకన్నా, బెదిరిపోయిన మాట మాత్రం వాస్తవమే కానీ, అదే బెడ్రూములోకి వెళ్ళుంటే అన్న ఆలోచన మాత్రం ఇప్పటికీ వణుకు తెప్పిస్తుంది.


వెంటనే, మా వాచ్ మన్ ను పిలచి, పాము కదలికలు కనిపెడుతూ అక్కడే కూర్చున్నాం. పక్కింటతనికి (జితేంద్ర కాంబ్లే) రెండు సార్లు ఫోను చేస్తే, రెండుసార్లూ కట్ చేసాడు. తర్వాత పది నిముషాలకు అతను ఫోను చేసి, అంతకు ముందు మోగింది అలారం అనుకొని కట్ చేసాను ఏమిటి విషయం అని అడిగాడు. మొత్తం చెప్పగానే, వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చాడు.


అంత తెల్లవారుజామున ఏం చేయాలో తోచటంలేదు. పామును చూస్తూనే ముప్పావు గంట గడిచింది. సరిగ్గా, అప్పుడు మా పక్కింటతను కార్పొరేటర్ అశోక్ ఘోర్పడెకు ఫోను చేసాడు. అంత తెల్లవారుఝామున ఫోను చేసినా, ఎంతో స్వాంతనగా మాట్లాడి, పావుగంటలో మనిషిని పంపిస్తానని చెప్పారు అశోక్ ఘోర్పడె. చెప్పినట్లుగానే దాదాపు 5.15 కు నితిన్ అనే స్నేక్ కాచర్ వచ్చాడు. అప్పటికి, దాదాపు గంటసేపు కదలకుండా, మెదలకుండా వాషింగ్ మెషీన్ వెనుకే ఉన్న మా అతిథి మెల్లగా, పక్కనే ఉన్న పుస్తకాల రాక్ క్రిందకు పాకి వెళ్ళింది.


పామును పట్టుకోటానికి అయిదు నిముషాలు పడితే, దానిని గోతాంలో వేయటానికి అంతకన్నా ఎక్కువే పట్టింది. మొత్తానికి 5.30 కు ఊపిరి పీల్చుకున్నాం.


ఆల్ ఈజ్ వెల్, దట్ ఎండ్స్ వెల్. జవాబులేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి సంఘటనలో.


My humble gratitude to our Corporator – Mr. Ashok Ghorpade, for timely help in those odd hours.


My sincere thanks to Nitin – The Snake Catcher, my neighbour – Jitendra Kamble and our Watchman – Gopal Bahadur.


ఆలోచనా తరంగాల అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు.

11 comments:

  1. with the eternal grace you r all fine..
    gud to know that

    ReplyDelete
  2. glad to know nothing untoward happened.

    ReplyDelete
  3. వావ్ .. దుప్పట్లో మిన్నాగు .. అంత రోమాంచిత అనుభూతి కలిగించారు.
    మీ కార్పొరేటర్ కి ఒక సెల్యూట్.
    అవునూ, మీకు నిద్రపట్టకుండా నేనేమి చేశాను సార్?

    ReplyDelete
  4. మీ బెడ్రూంలోకి వెళ్ళీనా ఏమి జరిగేది కాదు. పాముల్ని చూసి మనం భయపడతాంగానీ అవి అంత భయంకరమైన జీవాలు కాదండీ.

    Its good nothing happened to you and its better you didn't kill the snake. I should commend you for latter.

    ReplyDelete
  5. Thank you all.

    కొత్తపాళీ గారు :)) - అవునండి. మా కార్పొరేటర్ చాలా హెల్పింగ్ నేచర్ ఉన్నవాడు.

    మలక్ - అది కామన్ ఇండియన్ కోబ్రా - పాయిజనస్ అనే స్నేక్ కాచర్ చెప్పాడు తర్వాత. మేముండేది మూడో అంతస్థులో... ఎలా వచ్చిందో ఏంటో.

    ReplyDelete
  6. అమ్మయ్య, చంపేశారనుకుని భయపడుతూ చదివాను. మూడో అంతస్థులోకెలా వచ్చింది. ఈ లెక్కన బాల్కనీ నిండా మొక్కలు పెంచే నేను జాగ్రత్తగా ఉండాల్సిందే!అసలే మా పార్కులో పెద్ద పాముని పట్టారు మొన్న!

    మొన్నీ మధ్య కొండాపూర్ లోని బొటానికల్ గార్డెన్లో స్నేక్ షో ఏర్పాటు చేశారు. అన్నీ ఇల్లా ఇళ్ళలో పట్టి తెచ్చిన పాములే! పాములు కనిపిస్తే చంపొద్దని వాళ్ళకు ఫోను చేయాలని నంబర్లు ఉన్న కార్డులు అందరికీ ఇచ్చారు.(సంస్థ పేరేదో ఉండాలి).

    ఎన్ని చెప్పినా తాచు పాముని ఇంట్లో అంత దగ్గరగా చూస్తే భయం వేయకమానదు.

    ReplyDelete
  7. అబ్బాయ్ కిరణూ,
    నాగదేవత కనిపించిందని సంతోషించి చిందేయక అంత ఆందోళన దేనికయ్యా?! నాగదేవతకు పాలు పోయాల్సి ప్రణమిల్లక అలా గోతాం లో భంధించడం ఏంబాగోలేదు. రాహువు శుభప్రదుడై నట్టింట శయనించగా అతన్ని శని వక్రకంట చూడటం వల్ల గోతాంలో పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, చూశావా ' అంతా గ్రహ ప్రభావం ' :) విధి ఎవరూ తప్పించలేరయ్యా అంటే విన్నావు కాదు! :P

    శంకర్

    ReplyDelete
  8. మలక్ చెప్పింది అక్షరాలా నిజం! అదే మలక్ ఇంట్లో వచ్చివుంటే కీబోర్డ్ తో ' మన్ డోలే తేరే తన్ డోలె ' అని వాయించి గాని వదిలిపెట్టేవాడు కాదు. అందుకు ఆ పాము ' మనోభావాలు & కర్ణభేరి ' దెబ్బతిని 'బలిదానం' చేసుండేది , కాదా?! :D

    శంకర్

    ReplyDelete
  9. GRRRRRR Shankar ... cheptaaa nee pani

    ReplyDelete
  10. హాయ్ మలక్ , :))
    ' పాములు అంత భయంకరమైన జీవాలు ' కాదన్నావ్ .. ఆ విషయం కిరణ్ కు తెలుసనే అనుకున్నా, ఆ పాముకు తెలుసో లేదో ఎవరికి తెలుసు? ఆఁ !
    ఒక వేళ కిరణ్ ధైర్యం చేసి చెప్పినా , పాము వినిపించుకునే స్థితిలో లేదు.. నిద్రపోతోందిగా!

    శంకర్

    ReplyDelete
  11. హయ్యబాబోయ్! ఎంత పెద్ద పామో!!! అంతసేపు దానికి కాపలా కాశారా!! నేనైతే అది పామని తెలిసిన రెండో క్షణాన పైనించి కిందకి ఒక్క జంప్ చేసేదాన్ని :-)
    Thank god you all are fine!!

    ReplyDelete

మీ అభిప్రాయం :