Wednesday, March 10, 2010

కామెడీ స్వాములు-బూతు బొమ్మలు

చిడతల కామెడీ స్వాముల వారు దేవతల నగ్న విగ్రహాల ఫొటోలను తమ బ్లాగులో ప్రదర్శనకు పెట్టారు. స్వామివారి ఉద్దేశ్యం "దేవతలను నగ్నంగా చిత్రించడం హిందు సాంప్రదాయం కాదంటున్న మూఢులకు జ్ఞానబోధ కాకపోయినా, మరికొందరు మూఢులుగా తయారు కాకుండ ఉండటానికి" ఈ ప్రదర్శన ఏర్పాటు చేసారు.

నిజానికి అయ్యవారి అసలు ఉద్దేశ్యం వేరు. హుస్సేన్ గాడు చేసింది తప్పు అనేవారు, హిందు సాంప్రదాయాన్ని కూడా తప్పు అనాలి. లేదా, అది హిందు సాంప్రదాయమే అనేట్లయితే, హుస్సేన్ గాడిని అక్కున చేర్చుకోవాలి, లాలించాలి, బుజ్జగించాలి. మానసిక పరిపక్వత లేని పరిస్థితుల్లో ఇటువంటి "చీప్ ట్రిక్సు"కు పాల్పడతారు ఈ దొంగ స్వాములు.

ఏతావాతా, కామెడీ స్వామి వారు తీర్మానించిన విషయం దేవతలని నగ్నంగా చిత్రించటం హిందు సాంప్రదాయం అని. అయ్యా, ఏ ఆగమ, వాస్తు శాస్త్రాల ప్రకారం దేవతా విగ్రహాలను, దేవాలయాల గోడలపై బొమ్మలను నగ్నంగా చిత్రించాలని ఉందో చెబితే సంతోషిస్తాం.

నాకు తెలిసీ, ఆయా కాలాలలోని సామాజిక పరిస్థితుల కనుగుణంగాను, ఆయా రాజుల, శిల్పకళాకారుల, ఆగమశాస్త్ర నిపుణుల ఆధ్యాత్మిక పరిణతికి అనుగుణంగాను, ఆయా దేవాలయాలను నిర్మించాలనుకున్న "థీం"కు అనుగుణంగాను అవి నిర్మించబడ్డాయి. నగ్న విగ్రహాలే ఉండి తీరలన్న సాంప్రదాయమనేది ఉండి ఉంటే, దేశంలోని అన్ని దేవాలయాలలోనూ ఇదే పరిస్థితి ఉండాలే!

అయోధ్యలోని రామ మందిరమే కాదు, దేశంలోని ఏ రాములవారి గుడి అయినా, హనుమంతులవారి గుడిలోనైనా, సీతారాముల, హనుమంతులవారి విగ్రహాలు నగ్నంగా ఉండవు. మరి హుస్సేన్ గాడు చిత్రించిన సీత, హనుమంతులవారి నగ్న చిత్రాలకు ఆధారం ఏమిటి? ఇక "లజ్జ గౌరి" లాంటి తీవ్ర దేవతలకు, మన ప్రాంతాలలోని గ్రామ దేవతలకు సంబంధించిన విషయాలు వేరు. అవి అర్ధం కావాలంటే, కొద్దిగానైనా మంత్ర, తంత్ర పరిజ్ఞానం అవసరం.

చెప్పొచ్చేదేమిటంటే, ఈ హుస్సేన్ గాడికి అంత సృజనశీలత ఏమీ లేదు. కేవలం హిందువుల మనోభావాలు గాయపరచటానికి, విదేశాలలో భారత పురాణేతిహాసాల దేవతల చిత్రాలు అమ్ముకోటానికి మాత్రమే నగ్నత్వం కావల్సి వచ్చింది. వాడి అమ్మనో, అయ్యనో, పెళ్ళాం పిల్లలనో నగ్నంగా చిత్రిస్తే కొనేవాడు ఎవడు?

ప్రజల మధ్య అగాధాలు సృష్టించే హుస్సేన్ గాడిలాంటివాళ్ళను అడ్డుకోకపోతే, అహంకారం తప్పించి అణుమాత్రమైనా ఆలోచన లేని కామెడీ మూఢ స్వాముల ఆసరాతో, రేపు మరో దావూద్ ఇబ్రహిం బయలుదేరతాడు. సుప్రభాతాలు, సహస్రనామాలు బూతు మయం, నేను వ్రాసే బూతు పాటలతో పూజలు చేసుకొమ్మంటాడు. అటువంటి ఉపద్రవాలు రాకుండా, ప్రజల మధ్య విద్వేషాలు పొడచూపకుండా ఉండాలంటే, దేశద్రోహులైన కేతిగాళ్ళకు ప్రభుత్వం పగ్గాలు వేయాలి.

15 comments:

  1. Chala baga chepparu....
    chachi kottinattu meeru anukunnadhi...chepparu

    ReplyDelete
  2. అదేంటండి అలా అనేసారు !!! ఎంత కష్టపడి ఆయన గారు కాపి చేసారు ఆ బొమ్మలు.

    ReplyDelete
  3. బాగు బాగు.ఇదేవిధంగా మేరీ మేగ్డలీన్ తో జీసస్ నగ్న చిత్రాలనూ,ఫాతిమా ఆయేషాలతో మహమ్మద్ నగ్న చిత్రాలనూ కూడా ఎవరైనా చిత్రించి బ్లాగుల్లో పెడితే బాగుండు.చూచిన వాళ్ళ జన్మ తరిస్తుంది. ఔత్సాహిక కళాకారులకు ఇదొక మంచి అవకాశం.

    ReplyDelete
  4. ఆ హుస్సేన్ గాడు వదలెయ్యడంతో దేశానికి పట్టిన శతకోటి దరిద్రాలలో ఒకటి పోయింది. సన్నాసి కుంక వాడికి కళ అంటే ఏమైనా తెలుసునా? దానికి మరి కొందరు వెధవలు చిడతల వాయించడం ఒక్కటి. హైందవి సంస్కృతిని అవమానించడమే ధ్యేయంగా కొంతమంది ప్రయత్నిస్తున్నారు.

    ReplyDelete
  5. m.f. hussain= mental fellow hussain
    scoundrel bloggers supporting him

    ReplyDelete
  6. M.F హుస్సేన్ కి ఒక కాంట్రాక్ట్ ఇద్దామనుకుంటున్నాను కత్తి గారి బొమ్మ నగ్నంగా గీయడానికి.... :

    మరొక విషయం నా దగ్గర జీసస్ నగ్న చిత్రం ఉంది. బ్లాగులో పెడదామనుకున్నాను కాని మొదటి పోస్టే అటువంటిది అయితే బాగోదని ఆగాను.

    ReplyDelete
  7. కళ గారులకు బుతు కుడా బుంది లా ఉంటుంది

    ReplyDelete
  8. కిరణ్ గారు బాగా రాసారండి .
    మీ అభిప్రాయాలను చాలా బాగా, నిర్భయముగా చెప్పారండి .ఇది చాలా ఆహ్వానించదగినది. అలాగే పైన అభిప్రాయాలు వ్రాసిన పెద్దలు శ్రీ సత్యనారాయణ ( ఆలోచనా తరంగాలు బ్లాగ్ ) గారిని నేను కోరుతున్నదోక్కటే .... సర్ ఇలాంటి వారిమీద మీరు కూడా వ్రాసి జ్యోతిష్యంలో ఏ అవయోగం వుంటే ఇలాంటి అవలక్షణాలు ఏర్పడతాయో వివరించే ప్రయత్నం చెయ్యండి .హుస్సేన్ లాంటి వారు వుంటే బుద్ధి వస్తుంది. హుస్సేన్కు కూడా.......
    మరొక్కసారి కిరణ్ గారిని అభినందిస్తున్నాను.

    అలాగే గత రెండు రోజుల క్రితం గొల్లపూడి మారుతి రావు గారి బ్లాగ్ కూడా నేను చదవటం జరిగినది.చాలా బాధ పడుతూ వారు వ్రాసారు. నిజంగా మనం ఇంత ఘోరంగా అవమానించ బడినమా అని అనిపించినది. సందీప్ గారు అన్నట్లు మన దేశానికి పట్టిన శని వదిలినట్లయ్యిందని..... కాని ఆ శని వదలటానికి పట్టింది ..... 94 సంవత్సరములు.....
    ఇక్కడ పెద్దలు శ్రీ గొల్లపూడి వారు వ్రాసుకున్న బాధను లింక్ రూపంలో ఇస్తున్న. మీరూ ఆలోచించడి.




    మీ
    రాయప్రోలు మల్లికార్జున శర్మ,
    www.sakalapoojalu.com.

    ReplyDelete
  9. PL CLICK IF WANT AUDIO .....

    http://www.koumudi.net/gollapudi/030810_I_need_to_understand.html

    బాబోయ్! నాకర్ధమయేలా చెప్పండి! మార్చి 08, 2010

    ReplyDelete
  10. @ మాక్సిమస్ మురళి

    dayachEsi A pani chEyakanDi. ivi chEtulukaavu , kaaLLanukO ... vaddu muraLi , vaddu. :((

    ReplyDelete
  11. పోప్ పై ఆరోపణలు - దర్యాప్తు http://sanghamitran.blogspot.com/

    ReplyDelete

మీ అభిప్రాయం :