కె.సి.ఆర్. నిరాహార దీక్ష దరిమిలా మొదలైన "తెలంగాణా ప్రజా ఉద్యమం" ఊపందుకుంటున్న వేళలో, ఈ ఉద్యమాన్నినిలువరించటానికి రాజకీయ కుతంత్రాలు మొదలైనాయి. "ప్రత్యేక తెలంగాణా వాదం" తెరపైకి వచ్చినప్పుడే, "ప్రత్యేకరాయలసీమ", "ప్రత్యేక ఆంధ్ర" ఉద్యమాలు తిరగదోయడానికి పలువురు నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఆశ్చర్యాన్ని కలిగించవు. ఎందుకంటే, వారి లక్ష్యం ప్రత్యేక ఆంధ్రానో, ప్రత్యేక రాయలసీమో కాదు. వారి లక్ష్యమల్లా, ప్రత్యేక తెలంగాణాను ఎట్టి పరిస్థితుల్లోనైనా పక్కదోవ పట్టించటమే.
ఇప్పటి వరకూ, ఒక్క కాంగ్రెస్ తప్ప, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని దాదాపు అన్ని పార్టీలు "తెలంగాణ" పై తమ తమ అభిప్రాయలను ప్రకటించాయి. అయినా, మెజారిటీ అభిప్రాయాన్ని తోసిరాజని, ఏకాభిప్రాయ సాధన కోసం కృషిచేస్తున్నామని ఎ.ఐ.సి.సి. ప్రకటించటం ఎవరిని మోసగించాలని చేసే ప్రయత్నం? ఎంతమంది ప్రజల ఏకాభిప్రాయంతో ఈ కాంగ్రెస్ ప్రధాని దేశాన్ని, ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు?
రాష్ట్ర కాంగ్రెస్ లో తెలంగాణా అంశంపై భిన్నాభిప్రాయలు ఉన్నాయని రోశయ్య ప్రకటించారు. అందుకని ఏ తీర్మానమూ కుదరదట! ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయే మరి! అయినా, ముఖ్యమంత్రి పదవి ఆయన అధిష్టించలేదా?
తాడో పేడో తేల్చుకోవాలసిన దశలో ఉన్న పోరాటాన్ని తె.రా.స. అర్ధంపర్ధంలేని షరతులతో ఆపేయదనే ఆశిద్దాం. ఎందుకంటే, రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసినా, సోనియా గాంధి హామీ ఇచ్చినా, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినా దీక్షవిరమిస్తానని కె.సి.ఆర్. ప్రకటించటం మరో తప్పటడుగు.
రాష్ట్ర శాసనసభలో ప్రవేశ పెట్టే తీర్మానం వల్ల దమ్మిడీ ఉపయోగం లేదు. అలానే, ఓసారి మోసపుచ్చిన సోనియా మాటలకు మరోసారి మోసపోవాలనుకోవటం మూర్ఖత్వం. కేవలం పార్లమెంటులో ప్రత్యేక తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టటమేకాకుండా, ఆ బిల్లును ఆమోదించిన తర్వాతనే కే.సి.ఆర్. దీక్ష విరమించుకోవటం అవసరం.
కాదు కూడదు, ఇక దీక్ష కొనసాగించటం వల్ల కాదు అనుకుంటే, రాజకీయ సన్యాసం తీసుకొని, నేతృత్వాన్ని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకునే నాయకుడి చేతుల్లో పెట్టటం తెలంగాణా ఉద్యమానికి మంచిది. తెలంగాణా మేథావులు సరైన దిశగా, స్పష్టమైన అవగాహనతో నిర్ణయాలు తీసుకుని మరోసారి మోసపోరనే ఆశిద్దాం.