ఈ టపా శీర్షిక సరదాగా తీసుకోమని మనవి.
ఓ దశాబ్దం క్రితం వరకు, అక్కడక్కడా, అప్పుడప్పుడు మాత్రమే జరుగుతున్న సంఘటనలుగా భావించే "మగవారిపై గృహహింస" ఈ మధ్య కాలంలో తరచుగా చదువుతున్నాము. అలానే, గృహ హింసపై, వరకట్న హింసలపై ఉన్న చట్టాలను కూడా కొందరు దురుపయోగం చేస్తున్న తీరు కూడా ఈమధ్య కాలంలో మరీ ఎక్కువైందనే చెప్పవచ్చు. ఈ విషయానికి సంబంధించి ఈరోజు "ముంబాయి మిర్రర్" పత్రికలో వచ్చిన ఒక వార్త 'తాడేపల్లి" గారి వాదనలోని కొన్ని భయాలను నిజం చేస్తున్నది. ఇక చదవండి :

