Thursday, February 26, 2009

మన గురివింద మాత్రం తెలుపా - గొల్లపూడి గారు

ఈమధ్య 'కౌముది'లో గొల్లపూడి గారి వ్యాసమొకటి చదవటం జరిగింది. 'స్లమ్ డాగ్ మిలియనీర్' గురించి చాలా ఆవేశపడుతూ, ఆయన 'దరిద్రకళ' అనే వ్యాసం వ్రాసారు. శీర్షికను బట్టే ఆయన అభిప్రాయం సగం అర్ధమౌతుంది. పావులా తీసుకొని అర్ధరూపాయి నటన ప్రదర్శించే చాలామంది నటుల మాదిరిగానే ఆయన ఆక్రోశం వెలిబుచ్చారు. ఆయన కుమారుడు చెప్పగా విన్న ఒక సన్నివేశం దానికి కారణం. దర్శకుడి సంస్కార హీనతను చాటిచెప్పే ఈ 'అభిరుచి దారిద్ర్యం' కళ కాదని, కళ కాకూడదని కూడా నిర్ణయించేసారు. అడుక్కుతినే, గర్భ దరిద్రుల, వ్యభిచారుల, వ్యసనపరుల, నీచుల దేశంగా విదేశీయులు మనదేశాన్ని ఎలా భావిస్తున్నారో కూడా చెబుతూ బాధపడిపోయారు. అశుద్ధంలో మునిగిపోయిన పిల్లవాడిలో వాస్తవికతను, కళను చూసిన మహాకళాకారులై ఉంటారని గోల్డెన్ గ్లోబ్ న్యాయనిర్ణేతలను కూడా కొద్దిగా ఏకేసారు.

మనం మన సినిమాల్లో విదేశీయులని విలన్లుగా చిత్రీకరించటం లేదా? మాఫియా నాయకులుగా, స్మగ్లర్లుగా వారిని చిత్రించినప్పుడు, అలానే విదేశీ వనితలను సినిమా పాటల్లో అసభ్యంగా వాడుకుంటున్నప్పుడు మీరు ఇలానే ఆక్రోశాన్ని వెలిబుచ్చారా? పాకిస్తాన్ ను, చైనాను బూచిగా చూపించే సినిమాలపై మీ అభిప్రాయం ఏమిటి? అయ్యా గొల్లపూడి గారు ఆ వ్యాసంలో మన దేశ వైభవాన్ని, మన వ్యక్తుల ఔన్నత్యాన్ని రిచర్డ్ అటెన్ బరో 'గాంధీ' చిత్రంలో అత్యద్భుతంగా చిత్రీకరించారని మీరు కీర్తించారు. ఒక విదేశీయుడు చేయగలిగిన ఆ పనిని మన దేశీయులు ఎందుకు చేయలేకపోయారంటా?

మన భారతీయులను మించిన 'హిపోక్రాట్లు' మరెక్కడా ఉండరు. వ్యక్తి ఔన్నత్యాన్ని గురించి చెప్పిన గొల్లపూడిగారే, మోనికా లెవెన్స్కీ 'రంకుతనాన్ని' ఉదాహరణగా ఎందుకు చెప్పారు? దేశీయ ఉదాహరణలు లేకనా? లేక చెప్పగలిగే ధైర్యం లేకనా? అసలు అసందర్భంగా ఒకరి వ్యక్తిగతమైన విషయాన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఏమిటి? స్లమ్ డాగ్ నిర్మాతలకు అజంతా ఎల్లోరా సౌందర్యాన్ని, హాలీబీడు శిల్ప సంపదను, త్యాగరాజ కీర్తనలను గట్రాగట్రా చాటే వాస్తవాలను చూపమనే దమ్ము లేకపోయిందని ఆయన అపర కళాకారులని ప్రశ్నించారు.

అయ్యా గొల్లపూడి గారు, సినిమాల్లో ఇంతకాలం ఓ రచయితగా, నటుడుగా ఉండి మీరు ఎంతమంది దర్శక నిర్మాతలను ప్రభావితం చేసారు మీరు చెప్పే వాస్తవాలనే చూపమని? ఒక నటుడుగా మీరు నటించిన సినిమాల్లో 'మెరుపుదాడి' (లేక ప్రళయసింహమో పేరు గుర్తులేదు) వంటి 'సి' గ్రేడు సినిమాల్లో మీరెలా నటించారో అని అడగాలనుకుంటున్నాను. సంవత్సరానికి కొన్ని వందల సినిమాలు తయారౌతున్న భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో మీరు చాటిచెప్పే విషయాలపై ఎవరు ఎన్ని సినిమాలు తీస్తున్నారని మీరు ఆడగరే?

మీరు నొక్కి నొక్కి చెబుతున్న 'అభిరుచి దారిద్ర్యం'తో తీసిన ఒక సన్నివేశాన్ని చూసి మనం బాధపడకూడదు, సిగ్గుపడాలి. వాస్తవాలని మరచి సినీ నటులకు (కళాకారులు కొందరే) గుళ్ళు గోపురాలు నిర్మించే మూర్ఖాభిమానులను చూసి సిగ్గుపడాలి. అభిమానం పేరుతో యుద్ధాలు చేసుకునే వ్యవస్తను 'మలం'లా చూపించారని గ్రహించాలి. భారతదేశ దరిద్రాన్ని చూపినందుకు అవార్డు ఇచ్చారని ఎలా భావిస్తున్నారు? మనం మనకు చెప్పుకోలేని, మనం ఒప్పుకోలేని వాస్తవాలని చూపినందుకు ఇచ్చారని ఎందుకు అనుకోరు?

ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే, మన సినిమావాళ్ళే, కళను ఏనాడో భ్రష్టు పట్టించి 'దరిద్రం' కాదు,' సినిమా' చేసారు. అయినా మనం ఒప్పుకోం!! మన ఇంట్లో అశుద్ధం పెట్టుకొని, పక్కవాడు ముక్కు మూసుకొమ్మన్నాడని బాధపడటం ఏమిటి?

33 comments:

  1. "ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే, మన సినిమావాళ్ళే, కళను ఏనాడో భ్రష్టు పట్టించి 'దరిద్రం' కాదు,' సినిమా' చేసారు."
    శెభాష్. భలే చెప్పారు.

    ReplyDelete
  2. very well written..!!

    last para is simple superb..!!

    ReplyDelete
  3. చాలా బాగా వ్రాశారు.
    అసలు ఈ సినిమా తీసింది ఒక నవల ఆధారంగా. అది వ్రాసింది భారతీయుడే. అప్పుడు లేని బాధంతా ఇప్పుడెందుకో. భారతదేశాన్ని దారిద్ర్య దేశంగా చూపించాలనే ఒక లక్ష్యం పెట్టుకొని ఇన్ని డబ్బులు ఖర్చుపెట్టి, ఇంత శ్రమపడి తీస్తారా?
    'వాళ్ళ' జీవితాలకు మన సినిమాలలో ఎలాగూ స్థానం లేదు. ఇంకొకరి సినిమాల్లో ఉన్నా ఈ గోలేమిటో.

    ReplyDelete
  4. Spirited defence of a brilliant film!

    కాని ఒక పంటికింది రాయి...

    "ఒక నటుడుగా మీరు నటించిన సినిమాల్లో 'మెరుపుదాడి' (లేక ప్రళయసింహమో పేరు గుర్తులేదు) వంటి 'సి' గ్రేడు సినిమాల్లో మీరెలా నటించారో అని అడగాలనుకుంటున్నాను."

    That was a cheap shot.

    ReplyDelete
  5. అదరగొట్టే సమాధానం.

    ReplyDelete
  6. నాకు కానీ వీల కానీ వెయ్యటం వచ్చుంటే వీర లెవెల్లో ఓటి కొట్టి అభినందించుండేవాడిని. రాదు కాబట్టి ప్రస్తుతానికి అదిరిపోయే చప్పట్లు.

    ReplyDelete
  7. * మనం మన సినిమాల్లో విదేశీయులని విలన్లుగా చిత్రీకరించటం లేదా? మాఫియా నాయకులుగా, స్మగ్లర్లుగా వారిని చిత్రించినప్పుడు, అలానే విదేశీ వనితలను సినిమా పాటల్లో అసభ్యంగా వాడుకుంటున్నప్పుడు మీరు ఇలానే ఆక్రోశాన్ని వెలిబుచ్చారా?పాకిస్తాన్ ను, చైనాను బూచిగా చూపించే సినిమాలపై మీ అభిప్రాయం ఏమిటి? *
    ఆంధ్రలో అలా ఆక్రోశాన్ని వెలి బుచ్చితే వినేవారు ఎవరైనా ఉన్నరా? పోని మీకు తెలుసా గొల్లపుడి గారు వెలి బుచ్చ లేదని? మీరు రాసిన దాని లో చాల లోపాలు ఉన్నాయి. మీ విమర్శ గొల్లపుడి గారి మీదనా లేక భారతీయులు హిపోక్రట్లు అనే లేక గుళ్లు గోపురాలు నిర్మించే మూర్ఖాభిమానుల మీదనా?
    1. గుళ్లు గోపురాలు నిర్మించే మూర్ఖాభిమానుల మీద ఐతే దానికి మారుతి రావు గారికి సంబందాం ఎమిటి? వారిని విమర్శిస్తు ఒక వ్యాసం రాయాలా మీ ఉద్దెశం లొ?
    2. మన భారతీయులను మించిన 'హిపోక్రాట్లు' మరెక్కడా ఉండరు. నా చిన్నపటి నుంచి వింటున్నాను హిపోక్రసి లేని ఓ 5 దేశాల పేర్లు నాకు మీరు చెప్పండి? ప్రపంచమంతా అప్పులు చేసిన అమేరికా వాడు నెనే నంబర్ 1 అనడం కూడా నా ఉద్దేశం లో హిపొక్రసి నే.
    3. గొల్లపుడి గారు ఒక రచైత గా కాలమిస్ట్ గా రాసిన వ్యాసం అది,భారత దేశము మీద అభిమానం తో రాశినది మీరు ఆ ఫ్రేం వర్క్ లో చూడండి అంతే గాని ఆయన చేసిన తెలుగు సినెమాలు అంతర్జాతియ ప్రేక్షకులు ఎవ్వరు చూడరు అవి ఆంధ్రా బార్డర్ కూడ దాటవు. దాని వలన మనకు వచ్చె నష్టం ఎమి లేదు. మీరు ఆస్కార్ అవార్డ్ వచ్చిన సినెమా లో చూపిన్స్తె అది చూసి మన గురించి ఇతర దెశాల వాళ్లు ఏమను కుంటరో మీకు తెలియదా? మాంసం తిన్నుట్టునామని మెడలో ఎముకలు మాల వెసుకొని తిరగాలని మీ అభిప్రాయం లా ఉన్నది.

    ReplyDelete
  8. "ఒక నటుడుగా మీరు నటించిన సినిమాల్లో 'మెరుపుదాడి' (లేక ప్రళయసింహమో పేరు గుర్తులేదు) వంటి 'సి' గ్రేడు సినిమాల్లో మీరెలా నటించారో అని అడగాలనుకుంటున్నాను."

    That was a cheap shot.
    ===

    Hello Suuren D'sa gaaru - I know it was a cheap shot. There is a reason for that.

    తన వ్యాసంలో గొల్లపూడి గారు ఈ సినిమాకు రహమాన్ సంగీతం ఎలా ఇచ్చాడో అని సందేహపడ్డారు. ఈ సినిమాకన్నా, నేను ఉదహరించిన ఆ తెలుగు సినిమాలో గొల్లపూడిగారిని చూసి నేనూ అలానే ఆశ్చర్యపోయాను. చాలా చౌకబారుతనంగా ఒక జూనియర్ ఆర్టిస్టుతో ఆయన ఒక వానపాటలో ఆడటం ఏమిటా అని. టాప్ లెస్ గా ఉన్న ఆ ఆర్టిస్టుతో (సెన్సారు నుంచి ఎలా బయటపడిందో ఇప్పటికీ నాకు అర్ధం కాలేదు) ఆయన వేసిన ఆ స్టెప్పులని ఫామిలీతో చూడాల్సిన దుస్థితికి సిగ్గుపడాల్సి వచ్చింది.

    Anyways, No one is a holy cow!

    ReplyDelete
  9. "ఒక నటుడుగా మీరు నటించిన సినిమాల్లో 'మెరుపుదాడి' (లేక ప్రళయసింహమో పేరు గుర్తులేదు) వంటి 'సి' గ్రేడు సినిమాల్లో మీరెలా నటించారో అని అడగాలనుకుంటున్నాను."

    That was a cheap shot.
    ===

    Hello Suuren D'sa gaaru - I know it was a cheap shot. There is a reason for that.

    తన వ్యాసంలో గొల్లపూడి గారు ఈ సినిమాకు రహమాన్ సంగీతం ఎలా ఇచ్చాడో అని సందేహపడ్డారు. ఈ సినిమాకన్నా, నేను ఉదహరించిన ఆ తెలుగు సినిమాలో గొల్లపూడిగారిని చూసి నేనూ అలానే ఆశ్చర్యపోయాను. చాలా చౌకబారుతనంగా ఒక జూనియర్ ఆర్టిస్టుతో ఆయన ఒక వానపాటలో ఆడటం ఏమిటా అని. టాప్ లెస్ గా ఉన్న ఆ ఆర్టిస్టుతో (సెన్సారు నుంచి ఎలా బయటపడిందో ఇప్పటికీ నాకు అర్ధం కాలేదు) ఆయన వేసిన ఆ స్టెప్పులని ఫామిలీతో చూడాల్సిన దుస్థితికి సిగ్గుపడాల్సి వచ్చింది.

    Anyways, No one is a holy cow!

    ReplyDelete
  10. Hello Anonymous gaaru -

    ౧.మరి ఆయన వెలిబుచ్చిన ఆక్రోశం ఎవరు వింటారని?
    ౨.మూర్ఖాభిమానుల విషయమై సంబంధమే లేకపోతే, అశుద్ధం అంటించుకుని పిల్లవాడు పరుగెత్తిన సన్నివేశంపై ఆయన అంత ఆక్రోశం చూపించాల్సింది కాదు. సినిమాలో ఆ పిల్లవాడు అశుద్ధం అంటించుకుని పరుగెత్తేది అమితాబ్ మీది అభిమానంతో. కాబట్టి సందర్భం వచ్చిందనే, గుళ్ళు గోపురాలు కట్టే మూర్ఖాభిమానులని నేను విమర్శించింది.
    ౩.అందరూ హిపొక్రాట్లు కాబట్టి, మనం అలా ఉండటంలో తప్పేం లేదు అంటారు. మీ ఇష్టం.
    ౪.ఒక రచయితగా, కాలమిస్టుగా వ్రాయాల్సింది, ముందు ఆ సినిమాను చూసి. చెప్పుడు మాటలు విని ఒక అభిప్రాయం ఏర్పరచుకోవటం రచయితలు చేసేది కాదు.
    ౫.సినిమా చూసి ఇతర దేశాలవాళ్ళు మన దేశం గురించి ఏమనుకుంటారనే బాధపడతారే! ఆ సినిమాలో చూపించిన పరిస్థితులు దేశంలో లేవా?

    ReplyDelete
  11. మరి ఆయన వెలిబుచ్చిన ఆక్రోశం ఎవరు వింటారని?
    ఆయన ఆక్రోశం నాకు మరియు నాలంటి వారు కొందరికి అర్థమైంది. సినేమ చూడలేదు/చూడను కూడా.

    * ఒక రచయితగా, కాలమిస్టుగా వ్రాయాల్సింది, ముందు ఆ సినిమాను చూసి. చెప్పుడు మాటలు విని ఒక అభిప్రాయం *
    చెప్పుడు మాటలు విని అని ఎందుకు అనుకుంటారు, ఆ ఒక్క సన్నివేశం చాలు మన పరువు తీయటానికి. పంచభక్ష పరమాన్నలు వడ్డించిన విస్తరి కొసలో చంటి పిల్లల వలన కొంచెం చాలా చాలా చిన్న పరిమాణం లో ముత్రం కాని/ మలం కాని పడితె వరైనా తింటారా?
    ఇది అంతే. పోని తెల్ల వాళ్ళు మన మేలు కోరే వారైతె అది వేరే సంగతి. మనకి లండన్, అమేరికాలు పై పై మిత్ర దేశాలే అవి ఎప్పుడు భారత దేశం బాగు పడిన దానిని చూపించిన దాఖలాలు లేవు ఏ మిడియాలో కూడాను (టి.వి.). ఒక్కపుడు వాళ్ల సినేమాలొ రష్యను ఎగతాళి చెసే వారు ఇప్పుడు ఇండియాను పట్టుకున్నట్టున్నారు.

    *సినిమా చూసి ఇతర దేశాలవాళ్ళు మన దేశం గురించి ఏమనుకుంటారనే బాధపడతారే! ఆ సినిమాలో చూపించిన పరిస్థితులు దేశంలో లేవా?*
    ఉనయి/ఉంటాయి. ఉంటె మన విపు కి దురద పుడి టె మనమే గొక్కొవాలి అంటె కాని ఇతరుల మీద ఆధార పడతామ? we have to address those issues.

    There is a lot of difference between Gollapudi and Rehman. Rehman has got international popularity before this film itself. He chooses films based on rules/values. which he framed for himself. He represents India. But Gollapudi would not represtent India not even AP.

    ReplyDelete
  12. మిత్రులారా, గొల్లపూడి గారు వెలిబుచ్చిన అభిప్రాయాలతో విభేదించవచ్చు గాని ఆయన్ని దుర్భాషలాడ్డం తగదని మనవి.

    ReplyDelete
  13. గొల్లపూడి గారు అంత ఆవేశపడడానికి ఒక కారణం ఆ సినిమా నిర్మించిన వాళ్ళ వుద్దేశ్యం గురించి - వాళ్ళ ఆడియన్స్ ఎవరూ అన్నదానిగురించి. IMHO, ఏవరో మెచ్చి అవార్డులు యివ్వడం కోసం మనల్ని మనం యింత కించపరుచుకోవాలా అన్నది ఆయన ఆవేదనకి కారణం తప్ప హిపోక్రసి కాదు.

    ReplyDelete
  14. >> "IMHO, ఏవరో మెచ్చి అవార్డులు యివ్వడం కోసం మనల్ని మనం యింత కించపరుచుకోవాలా అన్నది ఆయన ఆవేదనకి కారణం తప్ప హిపోక్రసి కాదు"

    మన దేశం గురించి గాంధీ, పాసేజ్ టు ఇండియా, సిటీ ఆఫ్ జాయ్ వంటి కళాఖండాలూ విదేశీయులే తీసున్నారు. అవీ అవార్డు చిత్రాలే. హోలీ స్మోక్, డార్జిలింగ్ ఎక్స్‌ప్రెస్ లాంటి చెత్త సినిమాలూ వాళ్లే తీశారు. వీటికి అవార్డులు కావు కదా, అవి వచ్చి పోయాయన్న గుర్తింపూ రాలేదు. చెప్పొచ్చేదేమంటే - మన దరిద్రాన్ని అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకుని డబ్బులు చేసుకుందామని వాళ్లనుకున్నా, ఆ దరిద్రాన్ని డబ్బులు పెట్టి మరీ చూసే తీరిక, ఓపిక ఎవరికీ ఉండదు. సినిమా బాగుంటే అందులో మురిక్కూపాలున్నాయా, మహారాజ నిలయాలున్నాయా అనేది పట్టించుకోకుండా అందరూ చూస్తారు.

    గొల్లపూడి వారి విమర్శ స్లమ్‌డాగ్ మిలియనీర్ చూసిన/చూస్తున్న కోట్లాదిమంది ప్రేక్షకుల, దానికి అవార్డుల వర్షం కురిపిస్తున్న జ్యూరీ మెంబర్ల విజ్ఞతని అవమానించేదిగా ఉంది. అవార్డు జ్యూరీల్లో కొందరు జాత్యహంకారులుండొచ్చేమో, అందరూ అలాంటోళ్లే ఎందుకుంటారన్న చిన్న ఆలోచన కూడా రాలేదా ఆయనకి? ఈ అవార్డులిచ్చేదేమీ ఆషామాషీ వాళ్లు కాదు. సినిమా రంగంలో గొల్లపూడి వారికన్నా కాకలు తిరిగిన యోధులూ ఉన్నారు వాళ్లలో. సినిమా ఆయనకి నచ్చకపోతే ఆ విషయం రాయటం వేరు. ఆయనసలు సినిమాయే చూడకుండా తోచిందంతా రాసెయ్యటం, పన్లో పనిగా అసలు కళ అంటే ఏమిటి అనే దాని గురించి లెక్చర్లివ్వటం, విదేశీయులందర్నీ టోకున జాత్యహంకారులని ముద్రెయ్యటం, మూల కధ రాసిన మనవాడిని మాత్రం పల్లెత్తు మాటనకపోవటం .. ఇదంతా ఎలా అర్ధం చేసుకోవాలి?

    ReplyDelete
  15. "మూల కధ రాసిన మనవాడిని మాత్రం పల్లెత్తు మాటనకపోవటం .."

    ఆ నవల గురించి సినిమా రాక ముందు, వచ్చిన తర్వాత కూడానూ ఎంత మందికి తెలుసు? గొల్లపూడి వారు ఆ మూలకథ వ్రాసినాయన్ను పల్లెత్తు మాట అనలేదంటే - దానికి కారణం, ఆయనకు ఆ విషయం (అదో నవలని) తెలియకపోయుండవచ్చు. లేదా, ఆ సినిమా కున్న పరిధి నవల కు (రా)లేదు కాబట్టి, ఆ విషయం పట్టించుకొని ఉండకపోవచ్చు.

    ఇవి కూడా కారణాలు కావటానికి ఆస్కారం ఉంది. గొల్లపూడి వారు (భారతీయుడు కాబట్టి) ఆ రచయితను defend చేశారని ఖచ్చితంగా ఎలా తీర్మానిస్తారు?

    ReplyDelete
  16. >> "ఇవి కూడా కారణాలు కావటానికి ఆస్కారం ఉంది. గొల్లపూడి వారు (భారతీయుడు కాబట్టి) ఆ రచయితను defend చేశారని ఖచ్చితంగా ఎలా తీర్మానిస్తారు?"

    ఆయన వికాస్ స్వరూప్‌ని డిఫెండ్ చేశారని నేననలేదు. ఆయన వ్యాసం చదివాక నాకనిపించింది - పాశ్చాత్యుల మీద విరుచుకు పడటానికి ఈ సినిమాని ఆయనో సాకుగా వాడుకున్నారు. అందుకే ఉద్దేశపూర్వకంగా వికాస్ స్వరూప్ విషయం ప్రస్తావించ లేదు.

    సరే, మీరన్నట్లు ఆయనకి వికాస్ సంగతి తెలీదనుకుందాం. ఆయన స్వయంగా సినిమా చూడలేదు, కనీసం దాని మూల కధకుడి గురించి తెలీదు. చెప్పుడు మాటలు విని ఓ అభిప్రాయానికొచ్చేసి ఏదేదో రాసేశారు. అర్ధ జ్ఞానంతో విమర్శలు చెయ్యటం అంత పెద్ద రచయితకి సమంజసమా?

    >> "లేదా, ఆ సినిమా కున్న పరిధి నవల కు (రా)లేదు కాబట్టి, ఆ విషయం పట్టించుకొని ఉండకపోవచ్చు"

    ఆ నవలే లేకపోతే సినిమా కూడా ఉండేది కాదు. అప్పుడు గొల్లపూడి గారి విమర్శా ఉండేది కాదు. కాబట్టి విమర్శని సినిమాకి మాత్రమే పరిమితం చెయ్యటం సరి కాదు.

    ReplyDelete
  17. *గొల్లపూడి వారి విమర్శ స్లమ్‌డాగ్ మిలియనీర్ చూసిన/చూస్తున్న కోట్లాదిమంది ప్రేక్షకుల, దానికి అవార్డుల వర్షం కురిపిస్తున్న జ్యూరీ మెంబర్ల విజ్ఞతని అవమానించేదిగా ఉంది.*
    What ever you said was correct,
    I don't think gollapudi have knowledge to criticize Jury people. Take with whom he worked as a writer and as an actor. He did not have good knowledge about hollywood films first of all. He worked with heros who were 60 years old had big tummy, worn out faces, dancing with their grand daughter aged heroines like sridevi,jayaprada. Later he started working with their son's who don't know how to speak telugu also. How come this person who worked throughout his life worked with these kind of people will criticize English people whose first preference is quality in their movies.

    ReplyDelete
  18. దృశ్య మాధ్యమంలో ఒక డైలాగు ఎలా ఉండాలి శ్రవణమాధ్యమంలో అదే డైలాగు ఎలా ఉండాలి దాన్ని ఎలా పలకాలి అనే సంగతి గురించి ఆయన సోదాహరణంగా చెప్పిన సంగతి నేనెరుగుదును. ఆయన సినిమా నటుడేకాక, ఒక రచయిత అనీ, నాటక రచయిత అనీ, రేడియో నాటకాల ప్రయోక్త అనీ, సినిమాల్లోనే కాక, నాటకాల్లో కూడా నటించినవాడనీ, సినిమా గురించి సాధికారికంగా మాట్లాడగలిగినవాడనీ.. మనకు తెలిస్తే చివరి అజ్ఞాత లాగా మాట్లాడం.

    సినిమాగానీ, పుస్తకంగానీ - ముఖ్యంగా సినిమా - ఎవరో ఒకరు చెప్పిన తరవాత మనమొక అభిప్రాయాన్ని ఏర్పరచుకుని దాన్ని చూట్టమో వద్దనుకోవడమో చేస్తాం. అది చెప్పుడు మాటలు విన్నట్టు కాదు. గొల్లపూడి విమర్శలో కొంత అసంబద్ధత ఉంటే ఉందేమోగానీ, ఈ రకంగా తోసిపుచ్చిపారెయ్యాల్సింది కాదు.

    ప్రపంచ సినిమా గురించి, ఇక్కడ వ్యాఖ్యానించిన పండితులకు తెలిసినంత మాత్రం ఆయనకూ తెలుసని నేను అనుకుంటున్నాను.

    ReplyDelete
  19. గొల్లపూడి ఒక రచయితా,సినీనటుడు కాబట్టే తన అసంబద్ధత అత్యంత ప్రశ్నార్థకం హాస్యాస్పదం అయ్యాయి. ఇంకెవరైనా చెప్పుంటే తెలీదేమో అని క్షమించెయ్యొచ్చు. కానీ తెలిసితెలిసీ ఇలాంటి మూర్ఖపు పోకడలకు పోతే ఇలాంటి స్పందన తప్పదు.

    ReplyDelete
  20. అర్థం కాక పొతే అది అసంబద్ధత గా నే ఉంటుంది. నాకు అసంబద్ధత ఎమీ కనిపించ లేదు ఆయన రాసిన దానిలో. ఆయన రాసేది ఒక పేజి వ్యాసం, మనకు వచ్చిన అనుమానాలు నివృతి చెయాలంటె ఒక పుస్తకం రాయాలి. అతను కవి గా, నటుడి గా కన్నా అక్కడ దేశాన్ని కి ఆయాన ప్రముఖ్య మిచ్చాడు ( కళ కన్నా దెశం గోప్ప అనేభావం నాకు ధ్వనించింది). అంతే కాక మన దేశం అంతో ఇంతో పేరు తెచ్చుకుంటున్న ఈ సమయము లో గురించి అలా చూపినందుకు బాధ కలిగించె విషయము. అది వదిలేసి ఆయనకు విశాల భవం లేదు అనే కొంతమంది మూర్ఖకులకు లేక బ్లాగు చుర కత్తులకు అవి మూర్ఖపు పోకడలకు గానే కనిపిస్తాయి.

    ReplyDelete
  21. వికాస్ స్వరూప్ రాసిన నవల లో ఈ మురికి గుంట లో దూకే సీన్ లేదని ఈ బ్లాగ్స్ లోనే ఎక్కడో చదివాను.
    నిజమేనా?

    కుమార్

    ReplyDelete
  22. @గొల్లపూడి మాటల్లోనే: "నా ముప్పై ఏళ్ళ కాలం రచనలో ఏనాడు వ్రాసిన కాలమ్‌ మీద వివరణ గా మరొక కాలమ్‌ వ్రాయలేదు". అదే చాల చెబుతుంది. ఇక మీ అభిప్రాయలు మీవి.
    "..ఆఖరుగా నా మాట. I am entitled to defer to my space."

    He certainly does. కదా?!

    ReplyDelete
  23. కిరణ్ కుమార్ గారు,

    పైన మీ ప్రశ్న ఇది.

    "౫.సినిమా చూసి ఇతర దేశాలవాళ్ళు మన దేశం గురించి ఏమనుకుంటారనే బాధపడతారే! ఆ సినిమాలో చూపించిన పరిస్థితులు దేశంలో లేవా?"

    స్లం డాగ్ పై వివరణ అనే గొల్లపూడి రెండవ వ్యాసం చదవగలరు.

    "నిత్యజీవితంలో హేయమైన జీవితం మన చుట్టూ లేదా అని కొందరు వాపోయారు.ఉంది. కానీ దాన్ని యథాతథంగా చూపదలిస్తే "తెర" అక్కర లేదు. అద్దం చాలు..."

    మీ (లాంటి అనేకుల) ప్రశ్నకు సమాధానం ఆయన చెప్పారు.

    ఇక విదేశీయుల మీద. ఈ అభిప్రాయం ఆయనకు రావడానికి గల background ని ఆయన మొదటి వ్యాసంలోనే చెప్పారు.

    నేనా సినిమా చూడలేదు, కాబట్టి సినిమా గురించి చెప్పలేను. అయితే మారుతీ రావు గారి వ్యాఖ్య పూర్తిగా కొట్టి పారేసెంత అసంబద్ధంగా ఉందని కూడా నిర్ధారించడం కష్టం.

    ReplyDelete
  24. ఇక్కడ మొదలైన చర్చని వాగ్వివాద౦ చేయడ౦ నా ఉద్దేశ్శ్య౦ కాదు కాని, నేను గొల్లపూడి గారి ఆలోచనలతో పరిపూర్ణ౦గా ఏకీభవిస్తాను. స్లమ్ డాగ్ మిల్లియొనీర్ ఒక సినిమా కాదు. అది కళ కానేకాదు. భారతదేశ౦ మీద వీళ్ళు సృష్టి౦చిన ఓ వెటకారపు పీస్ ఆఫ్ ఆర్ట్. భారతీయ సినిమాకు ఆస్కార్ అవసర౦ ఎ౦త మాత్ర౦లేదు. కాని ఒకవేళ ఆస్కార్ గురి౦చి ఆలోచి౦చాల్సి వస్తే స్లమ్ డాగ్ కి వెయ్యి పాళ్ళు అ౦ద౦గా కళను మాత్రమే దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమాలు భారతదేశ౦లో కోకొల్లలు. అ౦దుకు అత్యద్భుతమైన ఉదాహరణే బాపు గారు తీసిన ప్రతీ సినిమా, విశ్వనాథ్ గారు తీసిన ప్రతీ సినిమా. ఒక అ౦తర్జాతీయ సినిమా తీస్తున్నప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సిన మొట్టమొదటి విషయ౦, మన౦ మన దేశాన్ని చూపి౦చబోతున్నాము అని. ఆ దృష్టి ఏకోశానా లేని ఒక సినిమా స్లమ్ డాగ్ నా దృష్టిలో. నేను కూడా ఆ సినిమా సగమే చూసాను. అ౦దుకు సిగ్గు పడుతున్నాను.

    ReplyDelete
  25. గొల్లపూడి మారుతీరావు గారు ప్రసిధ్ధ రచయిత కాబట్టి ఆయన రాసినదాని మీద ఇంత అనవసరమైన చర్చ చేస్తున్నారు.అలాంటి అభిప్రాయాలని ఇగ్నోర్ చేసి ఉంటే బాగుండేది. సత్యజిత్ రాయ్ తీసిన సినిమాలలో మన బీదరికాన్ని చూపిస్తే దాన్ని కళ అన్నారు .పాపం నర్గీస్ దాన్ని గురించి ఆ రోజుల్లో విమర్సించేసరికి ఆవిడ మీద దేశం అంతా విరుచుకు పడింది .

    భమిడిపాటి ఫణిబాబు

    ReplyDelete
  26. బాబు, తెలియక మీరు ఫాలోఅయ్యె బ్లాగులు చూసి ఎదో వ్యఖ్యాలు అనామకుడి గా రాశాను. దయచేసి వాటి గురించి మరచి పోండి. ప్రశాంతం గా ఉండండి.

    ReplyDelete
  27. sai kiran garu oka nanchi post chadivanu andi ...really nice andi

    ReplyDelete
  28. అబ్రకదబ్ర / మహేష్ / కొత్తపాళీ,
    Let me ask you a speculative question - సినిమాలో హీరో చిన్నప్పుడు 'నిజమైన భారతం' చూపడానికి అమెరికన్లని స్లమ్ కి తీసుకొచ్చిన దృశ్యం ఒకటి మీకు గుర్తుండే వుంటుంది. అప్పుడు ఆ కారు టైర్లు దొంగతనం జరిగితే, డ్రైవరు హీరోని చితకబాదుతుంటాడు. అమెరికన్లు అతన్ని వారించి హీరోకి డబ్బులు యిచ్చి పంపుతారు. గుర్తుందా? ఇంత అద్భుతంగా ఎడిట్ చేసిన ఈ సినిమాలో అ సన్నివేశం ఎందుకుంది? కథను ముదుకు తీసుకెళ్ళడానికా? ఆడియన్స్ కి అపీల్ చేయడానికా? what is your take?

    ReplyDelete
  29. @రమణ .. ఆ దృశ్యం .. కౌ.బ.క ప్రశ్నోత్తరాల షోలో వద డాలర్ల నోటుమీద ఎవరి ముఖం ఉంటుందనే ప్రశ్నకి నేపథ్యంగా వచ్చింది. అలా ఆ అమెరికన్ వంద డాలర్ల ణోటుని జమాల్ కి ఇవ్వడం, అదే నోటుని అతను ముంబాయిలో గుడ్డి పాటగాడీకివ్వడమూ జరుగుతుంది. కాబట్టి ఆ దృశ్యం కథాగమనానికి కచ్చితంగా తోడ్పడింది. అదలా ఉండగా, సినిమాలోని ఇంచుమించు ప్రతీ అంశమూ పాశ్చాత్య ప్రేక్షకులకి ఆకర్షణీయంగా ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని తీశారనే నేను నమ్ముతున్నాను.

    ReplyDelete
  30. @రమణ: కొత్తపాళీ గారితో అంగీకరిస్తూ ఆ విషయాన్ని గురించే కొంత చర్చను ముందుకు కొనసాగిస్తాను.పాశ్చాత్య sensibility,technique,rhythm కలగలిపిన ఒక కమర్షియల్ చిత్రమిది. అన్నిస్థాయిల్లోనూ ఒక pure escapist celebratory చిత్రం. మన హిందీ తెలుగు చిత్రాల్లాగానే అతిశయోక్తులూ,అసంబద్ధాలూ పుష్కలంగా కల ఈ చిత్రం భారతీయతను "నిజాయితీగా" చిత్రించలేదు అని గుండెలు బాదుకోవడంలో అస్సలు అర్థం లేదు. మన సినిమాల్లో "నిజం" ఎంతుందో ఇందులోనూ అంతే ఉంది.కాకపోతే మరింత అందంగా,అబ్బురంగా, సాంకేతిక నైపుణ్యంతో ఈ అందమైన అబద్ధాన్ని తెరకెక్కించడం జరిగింది. అందుకే ఆస్కార్లూ గోల్డెన్ గ్లోబులూనూ.

    ReplyDelete
  31. కొత్తపాళీ / మహేష్,
    అతనికి వంద డాలర్ల నోటు వచ్చింది ఆ సన్నివేశంలో కాదు, అది అతనికి తాజ్ మహల్ దగ్గర టిప్ వచ్చింది.

    ఎవర్నో రంజింపచేయడం కోసం, కొన్ని సందర్భాలలో ఐనా ఔచిత్యాలని అతిక్రమించిన సినిమా, కళఖండమే కావచ్చు గాక, దాంట్లో మాకు అవమానలు కనబడుతున్నాయన్న వాళ్ళ వాదం గేలి చేయదగిందో కొట్టేయల్సిందో కాదే?

    ReplyDelete
  32. @రమణ:

    ఈ విషయమ్మీద నా అభిప్రాయాలు చాలా రోజుల క్రితమే వివరంగా మురికివాడ మిలియనైర్ అనే నా టపాలో రాశాను. ఇప్పటికే చాలా చోట్ల వ్యాఖ్యలు చేశాను కాబట్టి ఇకపై చేయను.

    ReplyDelete
  33. @రమణ: స్లండాగ్ ఒక కళాఖండమన్న అపోహ మీకెందుకు కలిగింది? అదొక మంచి "సినిమా". గొప్ప సాంకేతిక విలువలున్న సినిమా. అబ్బురపరిచే narrative ఉన్న సినిమా.అంతే!

    ReplyDelete

మీ అభిప్రాయం :