విలేఖరి, విశ్లేషకుడు, కవి, రచయిత అయిన తెలకపల్లి రవి గారు హజారే దీక్ష-హజార్ సవాళ్లుఅనే వ్యాసం తన బ్లాగులో ప్రచురించారు. నరేంద్ర మోడి, నితీష్ కుమార్ లను అన్నా హజారే ప్రశంసించటమనే కారణంతోనే, అన్నా హజారే చేపట్టిన ఉద్యమాన్ని చిన్నబుచ్చే ప్రయత్నం చేసినట్లుగా ఈ వ్యాసం చదివిన పాఠకులకు తోస్తుంది.
పురిటిలోనే సంధి కొట్టించేటట్లుగా కొనసాగిన జన లోక్ పాల్ బిల్లు ప్రతిపాదనలు ఎన్ని దశాబ్దాలుగా మనలని మభ్యపెడుతున్నాయో మనకు తెలుసు. ఆ ప్రతిపాదనలకు రూపురేఖలు కలిగిస్తున్న రాజకీయ నాయకుల అవినీతి నేపధ్యమూ తెలుసు. మరి ఇంతకాలం, లోక్ సత్తా, కమ్యూనిస్టులతో సహా ఏ రాజకీయ పార్టీ ఈ అంశంపై ఉద్యమాన్ని ఎందుకని తీసుకురాలేకపోయాయి?
ఎందుకంటే, ఈ పార్టీలన్నీ ఆ తానులోని గుడ్డలే. ఒక సాధారణ సంఘటనగా మొదలైన ఉద్యమానికి ఊహాతీతంగా లభించిన జనస్పందన పాలక, ప్రతిపక్ష పార్టీలకు దిక్కుతోచని పరిస్థితి కలిగించిందనేది వాస్తవం. అవకాశవాద రాజకీయాల్లో దిట్టలైన ఈ నేతలు, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఉద్యమానికి మద్దతు ప్రకటించాల్సి వచ్చింది కానీ, అవినీతిపై వారికి ఉన్న విముఖత కానేకాదు.
తెలకపల్లి గారు ఓ విచిత్రమైన వాదన చేస్తూ ఇలా అన్నారు "వ్యవస్థీకృతమైన అవినీతి మూలాలు చూడకుండా కాయకల్ప చికిత్సలపై కదన శంఖాలుఎంతగా పూరించడం వేళ్లు వదిలి కొమ్మను విరచిన చందంగానే మిగిలిపోతుంది.”........
డెబ్భై ఏళ్ళు పైబడిన వయసులో అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే చేపట్టిన సత్యాగ్రహం నిద్రాణమైన దేశానికి మేలుకొలుపు కావాలి. ప్రభుత్వాలలో అవినీతికి వ్యతిరేకంగా దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న సామాజిక కార్యకర్త అన్నాహజారే తన జీవిత చరమాంకంలో పూరించిన శంఖారావం మరో స్వాతంత్ర్య పోరాటం కావాలి.
ఇప్పటికే విదేశాలలో మురిగిపోతున్న లక్షల కోట్ల నల్లధనం, దానికి తోడు బోఫోర్స్ నుండి నిన్నటి స్పెక్ట్రం కుంభకోణం వరకు ఎన్ని లక్షల కోట్లు రాజకీయ నాయకుల, ప్రభుత్వ అధికారుల చేతులు మారిందో బహిరంగ రహస్యమే అయినా, ఏనాడూ, ఏ ప్రభుత్వమూ అవినీతిని అంతమొందించే దిశగా అడుగులు వేయలేదు. ఆరు దశాబ్దాల పైబడిన మన సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశంలో అవినీతి నిరోధానికి సరైన చట్టం లేకపోవటం ఒక విషాదమైతే, ఆ వెసులుబాటును ఆధారంగా చేసుకొని తమ అవినీతిని నిరూపించమని సవాళ్ళు విసిరే వ్యక్తులతో మంత్రివర్గాలు నిండి ఉండటం మరో విషాదం. అధికారంలో ఉన్న వ్యక్తుల అవినీతి ఏనాటికి నిరూపించబడదనేది కటిక వాస్తవం.....
.......For many normal citizens, it’s a joyous occasion to celebrate the unbroken record of India’s victory against Pakistan in all World Cup Cricket Matches, so far. For politicians, it’s an occasion to score few points over Indo-Pak ties.
Are we the real winners? Can this victory erase the memories of Terrorists Attacks? Can this victory wipe out the tears of the family members of the terror victims? Can this meeting be termed as path breaking in Indo-Pak stalemate? Can this meeting bring out the culprits of various Terror Attacks?
The wily Prime Minister of India seized an opportunity to divert the attention of Nation from the corruption his Government is implicated with. By shamelessly inviting Pakistan Prime Minister for the so called Cricket Diplomacy Dr. Manmohan Singh has once again proved how spineless we are, as a nation.
And the silly Prime Minister of Pakistan took the opportunity to accord his acceptance as if he is doing a great favour by attending the Cricket Match and discussing various bilateral issues!
How rotten are the minds of our politicians! So are the citizens of this great nation! We too have lost our minds in the madness of Cricket Diplomacy! We have completely lost our sensitivities and sensibilities. Do we remember that this is the same Pakistan Prime Minister, who even refused to identify Kasab as a Pakistani National, not long ago..............
ఏ ప్రజా ఉద్యమమైనా ఒకానొక స్థాయిలో హింసాయుతంగా పరిణమించటం సర్వసాధారణం. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేయటం ఒక ఎత్తైతే, లూటీలు మానభంగాలకు పాల్పడటం మరో ఎత్తు. వీటిని మించి, మన సంస్కృతిని మనం ధ్వంసం చేసుకోవటం మూర్ఖత్వం. ప్రజా ఉద్యమాలు హింసాయుతంగా మారటానికి గల కారణాలు విశ్లేషిస్తే, నాలుగు ముఖ్య విషయాలు గమనించొచ్చు. ప్రభుత్వాలు ఉద్యమానికి సానుకూలంగా స్పందించకపోవటం, బల ప్రయోగంతో ఉద్యమాన్ని అణచటానికి ప్రయత్నించటం, ఉద్యమంలో అసాంఘిక శక్తుల ప్రవేశం, అసమర్ధ నాయకత్వం ముఖ్యమైన కారణాలు.
ప్రత్యేక తెలంగాణా ఉద్యమం పెడదోవ పట్టటానికి ఇవన్నీ కారణాలే. ఇదివరలో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమం హింసాయుతంగా మారటానికి పొట్టి శ్రీరాములు బలిదానం దోహదపడింది. అంతవరకు, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం శాంతియుతంగానే కొనసాగింది. ప్రస్తుతం, అటువంటి బలిదానాలేవీ లేకుండానే ఉద్యమం పెడదోవ పట్టిందంటే కారణం అసమర్ధులు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించటం. నిన్నటి టాంక్ బండ్ విధ్వంసానికి కొన్ని నిముషాల ముందే, ఉద్యమకారుల చేత శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తామని కె.సి.ఆర్. ప్రతిజ్ఞ చేయించటం, జరగబోయే విధ్వంసాన్ని చూచాయగా చెప్పినట్లే. ముందస్తు ప్రణాళికతో చేయబడిన విధ్వంసమే ఇది. అందుకే, కె.సి.ఆర్. తనకు ఎలిబీగా ఉద్యమకారుల చేత ప్రతిజ్ఞ చేయించటం.
ప్రత్యేక తెలంగాణా ఉద్యమం మరోసారి మొదలు పెట్టినప్పటి నుంచి కె.సి.ఆర్. చేసింది ఉద్యమం కాదు, మోసం. సామూహిక జన మోసం. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటం, పదవుల కోసం వెంపర్లాడటం........ ,
మూడు దశాబ్దాల సినిజీవితంలో, దాదాపు రెండు దశాబ్దాలు చిరంజీవి ఆడిందే ఆటగా, పాడిందే పాటగా, చేసిందే డాన్సుగా తెలుగు వెండితెర వెలుగులు చిమ్మింది. రెండు సంవత్సరాల రాజకీయ జీవితం మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధంగా ముగిసింది. రఫ్ఫాడించేస్తానన్న చిరంజీవి ఇప్పుడు హస్తం పార్టీతో చేతులు కలిపేసాడు. ఇంతవరకూ, ఎవరి విశ్లేషణలు వారు చేసుకొని, చివరికి చిరంజీవి ప్రజాదోహ్రం చేసాడని ఆరోపిస్తున్నాయి అన్ని పార్టీలు.
విచిత్రం ఏమిటంటే, గత ఎన్నికలలో గెలుచుకుంది 18 అసెంబ్లీ సీట్లే అయినా, 16 శాతం వరకు ఓట్లను చీల్చగలిగింది ప్రజారాజ్యం. తను బాగుపడిందేదీ లేకపోయినా, మా పొట్టలను కొట్టింది ఈ ప్రజారాజ్యం అని అప్పట్లో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిలు వాపోయారు కూడా. సామాజిక న్యాయమే పరమార్ధంగా పెద్దయెత్తున మొదలైన ప్రజారాజ్యం ఈరోజు చతికిలపడటానికి కారణం ఏమిటి? రాజకీయ పరిణతి లేని చిరంజీవా? వ్యాపారంతో రాజకీయాలు చేయాలనుకుని ఒంటెద్దు పోకడలతో పార్టీని నడిపిన బావమరిదా? ఉన్న పార్టీలలో ఉనికి ఏమాత్రమూ లేకపోయినా, పదవుల కోసం ప్రజారాజ్యంలోకి పాక్కుంటూ వచ్చిన పాత నాయకులా?
అర్థం: గతం గురించి శోకించడం వ్యర్థం, భవిష్యత్తు గురించి చింతించడం అనవసరం. వర్తమానాన్ని అనుసరించి విచక్షణతో మెలగాలి.
****
ఆవకాయ.కామ్ ఈరోజు నుంచి సరికొత్త రూపంలో మీ ముందుకు తెస్తున్నందుకు సంతోషంగా ఉంది.
గతమంతా ఘనకీర్తి కాకపోయినా ఆవకాయ.కామ్ హతభాగ్యం మాత్రం కాదు. వేలాది పాఠకులు గత మూడు సంవత్సరాలుగా ఆదరించారు. యాభైకి పైగా రచయితలు, 2,300 పైగా రచనలను పొందుపరిచారు.
చాలా రోజుల నుండి నాకు ఇష్టమైన కొన్ని సినిమా, సినిమాయేతర పాటలు ప్రస్తావిస్తూ వ్రాద్దామనుకుంటూనే బద్ధకిస్తున్నాను. ఈమధ్యనే, మలక్, జ్యోతి గారు తదితరులు వారికి ఇష్టమైన పాటలతో వ్రాసిన పోస్టులు చదివి, ప్రేరణ పొంది, బద్ధకానికి స్వస్తి చెబుదామని నిశ్చయించుకున్నాను. నాకు సినిమా పరిజ్ఞానం ఏమాత్రమూ లేదు. నాకు నచ్చే సినిమాలు, పాటలు కూడా చాలా తక్కువే. నావరకు అద్భుతంగా తోచిన, నచ్చిన పాటల తోరణాలు ఇవి :
* * *
సంగీత, సాహిత్యాలకి తెలుగు సంస్కృతితో విడదీయలేని సంబంధం ఉన్నదనేది కాదనలేని సత్యం. విశేషమేమిటంటే, సినిమాలకు సంబంధించిన కొందరు అమరగాయకులు, సంగీత దర్శకులు, చివరికి కొన్ని పాటలు కూడా తెలుగు సంస్కృతిలో భాగమయ్యారు. ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఓ ఘంటశాల చాలు. ఆయన పాట తెలియని వ్యక్తి ఖచ్చితంగా తెలుగువాడై ఉండడు. కుల, మత, ప్రాంతీయ విబేధాలకు అతీతమైన స్వరమాధుర్యంతో తెలుగు సంస్కృతితో మమేకమైన గాయకుడు ఆయన. అలానే, కొన్ని సినిమా పాటలు కూడా.
ఇప్పుడు నేను చెప్పబోయే పాట విశేషం కూడా ఇదే. ఈ పాట మారుమోగని శ్రీరామనవమి పందిరి ఉండదు. ఈ పాట లేకుండా పెళ్ళిళ్ళు జరిగే తెలుగు గడప ఉండదు. శ్రీ సీతారామ కళ్యాణం సినిమాలోని "సీతా రాముల కళ్యాణము చూతము రారండి..." పాటే ఇది. సీతారాముల కళ్యాణం బహుశా ఇలానే జరిగి ఉంటుందనేలా ఆ పాటను చిత్రీకరించిన తీరు నిజంగా అద్భుతం. ఒక పరిపూర్ణమైన నటుడిగానే కాక, ఓ దర్శకుడిగా కూడా ఎన్ టి రామారావు ప్రతిభకు నిదర్శనం ఈ పాట చిత్రీకరించిన తీరు. అలానే సంగీత దర్శకుడు గాలిపెంచల గారు - తెలుగు పెళ్ళిళ్ళల్లో చిరస్మరణీయుడైనాడు. నాకు అమితంగా నచ్చిన పాటల్లో మొట్టమొదటిది ఈ పాట.
ఈ పాటలో చివరిలో సీతా రాములు తలంబ్రాలు వేసుకునే సన్నివేశం ముఖ్యంగా గమనించండి. ఆ సన్నివేశంలో విశ్వామిత్రుడుగా గుమ్మడి కనబరచిన హావభావాలు ఆయన మహానటుడు ఎందుకనేదానికి సమాధానంగా ఉంటుంది. కేవలం రెండు మూడు సెకండ్ల క్లోజప్ షాట్ లో... ఓ దేవకార్యాన్ని పూర్తి చేయగలిగానన్న సంతృప్తి, విశ్వామిత్రుడుగా ఆయన వెలిబుచ్చిన తీరు అనితరసాధ్యం.
1980 లలో ఆంధ్రదేశాన్ని నవ్వుల్లో ముంచెత్తింది "శ్రీదేవి పెళ్ళి". మిమిక్రీ ప్రసాద్ అనే కళాకారుడు రూపొందించిన హాస్యవల్లరి ఇది. రావుగోపాలరావు పెళ్ళిపెద్దగా, శ్రీదేవి - చిరంజీవిల పెళ్ళికి హాజరయిన తెలుగు నటీనటులతో ఓ అద్భుతమైన కళాసృష్టి చేసిన ఈ ప్రసాదు గారి గురించి ఎవరికైనా వివరాలు తెలుసా?
అఫ్సర్ గారి అక్షరంలో, ఇంటర్నెట్ లో తెలుగు సాహిత్యంపై చర్చ జరుగుతున్న సందర్భంగా, ఆవకాయలో గతంలో ప్రచురింపబడిన సంపాదకుల వ్యాసం :
పొద్దు.నెట్ లో ఇటీవలనే శ్రీ కామేశ్వర రావు గారు ఇంటర్నెట్ కవిత్వ వ్యవసాయం పై చక్కటి వ్యాసం వ్రాసారు. ఆ వ్యాసంలో కామేశ్వర రావుగారు పేర్కొన్న విషయాలలో కొన్నింటి పై మా అభిప్రాయాల్ని ఈ వ్యాసంలో పొందుపరుస్తున్నాము.
సమకాలీన కవితా రంగం రెండు సమాంతర వ్యవస్థలుగా విడిపోయే ప్రమాదమున్నదని కామేశ్వర రావు గారు పేర్కొన్నారు.
ఇంటర్నెట్ వాడే పాఠకులు పత్రికల్ని, సాహిత్య సంచికలనీ చదవకపోతే ఇది ప్రమాదమే. దినపత్రికలు వారి వారి ఇంటర్నెట్ పత్రికలను నడుపుతూ ఉండడం, తమ తమ అచ్చు పత్రికల్లో వచ్చిన (అన్ని ప్రక్రియల) సాహిత్యాన్ని ఈ-పత్రికల్లో ఉంచడం వల్ల కామేశ్వర రావు గారు పేర్కొన్న చీలికను కొంత వరకూ నివారించగలుగుతున్నారు.
ఇంటర్నెట్ లో మంచి కవిత్వం వ్రాస్తున్నా అచ్చులో కనబడని కవుల గురించి ప్రస్తావించి కామేశ్వర రావు గారు ఓ మంచి విషయాన్ని వెలికిదీసారు. ఎందుకిలా జరుగుతోంది? అన్నదానికి అచ్చు పత్రికల నిర్వాహకులు విశ్లేషించాలి.
తెలిసిన మేరా తరచి చూస్తే, ప్రచురణలోని ఆలస్యం , ప్రచురింపబడిన తరువాత పాఠకుల అభిప్రాయాలు వెంటనే తెలియకపోవడం, పేరుమోసిన కవులకే అగ్రపీఠం వేసే తత్త్వం , కొండకచో రాజకీయాలు ఇంటర్నెట్ కవుల్ని అచ్చు పత్రికలనుండి దూరంగా ఉంచుతున్నాయనుకుంటాము.
పైన ఉటంకించిన వ్యాఖ్యలు చాలు, దళిత తీవ్రవాదాన్ని ఎగదోయడానికి కుహాన దళిత కామెడీ మేధావులు చేస్తున్న ప్రయత్నాలు అర్ధం చేసుకోటానికి.
శతాబ్దాల క్రితం జరిగిన అణచివేతకు, వివక్షకు ఈరోజు ఎవరిని బాధ్యుల్ని చేస్తారు? ఇకపైగా, ఆనాటి వివక్షను ఖండించి, దళితుల శ్రేయస్సు కోసం చట్టాలు చేసి, చర్యలు చేపట్టడం శాంతి మంత్రాలు జపించటమట! అంటే, దళితుల సంక్షేమం కోసం చట్టాలు చేసినా కయ్యానికి కాలుదువ్వటమే దళిత పోరాటపు ఏజెండా అన్నమాట!
అసలుదళిత ధిక్కారం మొదలయ్యింది ఈ రోజు కాదు. ధిక్కార స్వరాన్ని వినిపించింది అంబేద్కర్. దళిత పోరాటం మొదలేసింది ఈరోజు కాదు. మహాత్మా గాంధి, మహాత్మా ఫూలేలు ఆనాడే పోరాటం చేసారు. కాబట్టే, దళిత సంక్షేమమే ధ్యేయంగా ప్రత్యేక చట్టాలు రూపొందాయి.దళిత చట్టాలు సరిగా అమలుకాలేకపోతున్నాయంటే, దానికి కారణాలు వెదకాలి. దానికి కూడా అగ్రవర్ణాలని బాధ్యుల్ని చేయటం ఏమిటి?
ఒకటి మాత్రం నిజం. ఇస్లామిక్ తీవ్రవాదం, కాషాయ తీవ్రవాదం మూర్ఖులు నడుపుతున్నవే. అందుకే అవి హింసాత్మకంగా జరుగుతున్నాయి. కానీ, సోకాల్డ్ కుహానా దళిత మేధావుల నేతృత్వంలో మొదలైన దళిత తీవ్రవాదంలో అక్కడక్కడ తప్పించి రక్తం పారదు. కేవలం, ప్రజాస్వామికంగా చాపకింద నీరులా సామాన్య దళితుల మనసులను కలుషితం మాత్రమే చేస్తుంది. వర్గ వైషమ్యాలు పెచ్చరిల్ల చేస్తుంది. అగ్రవర్ణాల వారిని పొమ్మనకుండా పొగ బెడుతుంది.ప్రభుత్వాలు ఉపేక్షిస్తే, ఈ తీవ్రవాదం రేపు ఓ దళితస్తాన్ కావాలనే వరకు ఖచ్చితంగా కొనసాగుతుంది.
ఏ తీవ్రవాద సంస్థ అయినా వారి పోరాటానికి చెప్పే సాకులు అస్తిత్వం, అణచివేత, ఆత్మగౌరవం. ఈ దళిత తీవ్రవాదానికి కూడా ఈ సాకులే ఊతం. నిజానికి, ఈ దళిత తీవ్రవాదం సామాన్య దళితుల పోరాటం కాదు. దళిత మేధావుల పోరాటం.
అస్తిత్వం : ఇప్పుడు దళితుల అస్తిత్వానికి వచ్చిన ముప్పేమిటి? శతాబ్దాల క్రితం నాటి వివక్ష ఈరోజుల్లో ఉందా? ఈ కామెడీ మేధావుల ప్రకారం అస్తిత్వం అంటే, వారికి అధికారం కట్టబెట్టటం. దళితపోరాటం పేరుతో కోట్లు కూడబెట్టుకునే మాయావతులని, పాశ్వాన్ లని ప్రధానులుగా చేయటం!
అణచివేత : ఈ కామెడీ మేధావుల ప్రకారం అణచివేత అంటే, అయినదానికి, కాని దానికీ అగ్రవర్ణాలను నిరసించటం, వారిని అణచివేయటం. అంటే, చరిత్రను పునరావృతం చేయటం. గతంలో వారు ఏ అణచివేతకు గురయ్యారో, అదే అణచివేతను అగ్రవర్ణాలపై అమలు చేయటం. అసలు ఆ మాటకొస్తే, ఇప్పుడుమన దేశంలో ఒక్క రాజకీయ వర్గం తప్పించి మిగిలిన వర్గాలన్నీ అణచివేతకు గురౌతున్నవే.
ఆత్మగౌరవం : ఓ దళితుడిగా నేను వ్రాసిన కవిత బాగోలేదంటావా, అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరించే మేధావులు, దళితుల ఆత్మగౌరవం కాపాడటమే ధ్యేయంగా రూపొందించిన అట్రాసిటీ చట్టాలు సామాన్య దళితుల వరకు చేరవేయటంలో ఎంత వరకు కృషి చేస్తున్నారు? చట్టాలు అమలు చేయటంలోని విధివిధానాలలో ఉన్న లోపాలు ఏనాడైనా చర్చించారా?
ఈ దళిత కామెడీ మేధావులు నియో దళితిస్టు భావజాలంతో చేస్తున్న పోరాటం ఏమిటి? కాశ్మీర్ ను పాకిస్తాన్ కు, అరుణాచల్ ను చైనాకు ఇచ్చేయమనా ఈ పోరాటం? ఒక వ్యక్తిని వ్యక్తిగా విమర్శిస్తే, మా సమూహాన్ని విమర్శిస్తావా అని ధర్నాలకు దిగటమాపోరాటం? హిందువుల ఇతిహాస పురాణాలను అవహేళన చేయటమా పోరాటం? ఉన్మాదంగా, దేవతల నగ్న చిత్రాలను ప్రదర్శించి హిందువుల నమ్మకాలను నవ్వులపాలు చేయటమా పోరాటం? సభలు, సమావేశాల పేరుతో మందిని పోగుచేసి వాళ్ళ ఆలోచనలు కలుషితం చేయటం తప్పించి, దళితుల్లో నిరక్షరాశ్యత ఇంకా ఎందుకని తగ్గలేకపోతుందో, చట్టాలపై వారికున్న అవగాహనని ఎలా పెంపుచేయాలో అనే విషయాలపై ఇంతవరకూ ఈ కుహానా మేధావులెవరైనా ఆలోచనాత్మకమైన దృక్ఫధాన్ని చూపారా?
నిజానికి ఈరోజు, సామాన్య దళితులకు ముప్పు పొంచి ఉన్నది అగ్రవర్ణాల వల్ల కాదు. ఈ కామెడీ మేధావుల వల్లే ప్రమాదం. ఎందుకంటే, ఆనాడు అగ్రవర్ణాల వారు తమ దౌష్ట్యాన్ని ప్రదర్శించటానికి దళితులను వాడుకుంటే, ఈనాడు తమ స్వార్ధం కోసం ఈ దళిత మేధావులు వారిని పావులుగా చేస్తున్నారు. ఈ మేధావులు ఆశించినట్లుగా దళిత ఆత్మగౌరవ పోరాటం వీధిపోరాటాలుగా దిగజారితే, అసువులు కోల్పోయేది ఈ మేధావులు కాదు.
ప్రభుత్వాలు ఇకనైనా కళ్ళు తెరవాలి, కొరడా ఝళిపించాలి.
అప్పట్లో ఇండియన్ ఐడల్ పోటీలో, కారుణ్య తెలుగువాడు, బాగా పాడుతున్నాడు, ఒక పోటీ ఫైనల్ లో వచ్చాడు అన్న ఉద్దేశ్యంతో ఓట్లేసాను. కారుణ్య ఓడిపోయిన తర్వాత, ఆ పోటీకి అర్ధమే లేదనిపించి, తరువాతి పోటీలు లైటుగా తీసుకుంటూ వచ్చా.
ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ఐడల్ పోటీలో శ్రీరామచంద్ర చాలా బాగా పాడుతున్నాడు. అయినా లాభం ఏముంది, ఉత్తరాది ఓట్ల ముందు మనం ఎన్ని ఓట్లు వేసినా ప్రయోజనం లేదని భావించి ఇంతవరకూ ఓటు వేయలేదు. ఈరోజు యాధాలాపంగా యలమంచి కిరణ్మయి గారు ఫేస్ బుక్ లో ఇచ్చిన యు ట్యూబు లింకులో ఈ పాట విన్న తర్వాత అనిపిస్తుంది... ఇటువంటి గాయకులు ఎన్నో తరాలకు గానీ జన్మించరని. సాన పెట్టిన వజ్రం ఎక్కడైనా మెరుస్తుందనేది నిజమే అయినా, శ్రీరామచంద్ర లాంటి అద్భుతమైన గాయకుడు ఇండియన్ ఐడల్ గా నెగ్గకపోతే, ఆ పోటీ, ఓట్లు వేసే శ్రోతల సంగీతాభిమానం కూడా అనుమానాస్పదమే ఔతుంది.
ఆ మాటకొస్తే, ఈ పాట వింటే, బహుశా రాకేష్ తనంతట తనే పోటీ నుంచి విరమించుకోవచ్చు కూడా. మీ స్నేహితులకు ఈ లింకు చూపి, విన్న తర్వాతే వోట్లేయమని చెప్పండి, ప్లీజ్. ఇటువంటి గాయకుడు ఓడిపోకూడదు. ప్రాంతీయాభిమానంతో కాదు, అతని టాలెంటుకు వోటు వేయండి, వేయించండి.
Life has been so mechanical these days that we become almost indifferent to our surroundings, friends and family. There are many people with whom we interact on daily basis, but still we don’t get to know them in real sense.
One such person in my life is Mr. Narayanan Ganesan. We both have been colleagues for the past 16 years. Personally, we are very good friends too. It is only recently that I have come to know about his favorite hobby of Photography. Exceptional quality of his photography has made me speechless!
Following is a brief note on how he views PHOTOGRAPHY.
It is five O Clock on a summer Sunday morning at the home of Narayanan Ganesan. He has packed a snack and a drink and some other bits and pieces and is about to leave home. Ganesan is a photographer in his free time, and early morning is a good time to catch the insects he specializes in as they soak up the heat of the early morning sun before their day’s activity starts.
Ganesan first took up photography some seven years ago and initially worked on landscapes. “I started with mountains. They always fascinated me,” Ganesan comments. “But during a visit to my home town in Kerala, the sound of the morning birds woke me up. I started with zoom photography, but then the little insects made me to move into macro photography. Many times what you can not see with the naked eye can be seen through a macro lens; nature’s perfection at it’s best!”
Ganesan’s interest in nature photography is not limited to his Sunday morning outings. “I arrange an exhibition every year at a local school with videos and photographs,” he explains. “The children enjoy that and it helps them learn to identify birds, insects and butterflies.”
“Some times I wait for hours for a little butterfly to spread its wings, or for a bird to fly into the nest to feed its young. Photographing insects teaches patience,” Ganesan says and continues, “That is not a bad quality to possess at work either.”
Ganesan along with some of his Photography Colleagues has also developed close links with a local research institute. “We take photographs at annual intervals of the same location and check whether the insect population level is the same, whether there are changes in coloring and so on, and we contribute our findings to the institute,” explains Ganesan. “We also get a lot of support from other professionals and learn about insect families, their behavior and so on.”
Ganesan has made his photos available to an even wider audience than the school and the institute. “I am member of a club called “TREKNATURE” and post a lot of my nature photographs on their site.
One might think that this hobby must involve international travel and a major investment in time and money. “It is true that the equipment is not cheap, and I always have a camera with me when I travel on business. Most of my pictures though are taken within five kilometers of my home, I cycle from home and my son often comes with me and takes pictures, too. We are out from 5 am to about 11 am on Sunday mornings,” smiles Ganesan.
ఓ దశాబ్దం క్రితం వరకు, అక్కడక్కడా, అప్పుడప్పుడు మాత్రమే జరుగుతున్న సంఘటనలుగా భావించే "మగవారిపై గృహహింస" ఈ మధ్య కాలంలో తరచుగా చదువుతున్నాము. అలానే, గృహ హింసపై, వరకట్న హింసలపై ఉన్న చట్టాలను కూడా కొందరు దురుపయోగం చేస్తున్న తీరు కూడా ఈమధ్య కాలంలో మరీ ఎక్కువైందనే చెప్పవచ్చు. ఈ విషయానికి సంబంధించి ఈరోజు "ముంబాయి మిర్రర్" పత్రికలో వచ్చిన ఒక వార్త 'తాడేపల్లి" గారి వాదనలోని కొన్ని భయాలను నిజం చేస్తున్నది. ఇక చదవండి :
ఎప్పుడూ పదవుల కోసం, అధికారం కోసం రాజకీయాలు నడిపే మన నేతలు మొదటిసారి ప్రజల కోసం రాజకీయాలు నడపటం ముదావహం. ఈ సంతోషానికి మరో కారణం కూడా ఉంది. ప్రజల కోసం ఉద్యమించినప్పుడు, మన ప్రజాస్వామ్య పరిరక్షకులే ఒళ్ళు హూనమయ్యేలా కుళ్ళబొడుస్తారనే ఓ నగ్న సత్యాన్ని అనుభవంతో గ్రహించారు మన తెలుగుదేశం నేతలు. అరకొర వసతుల మధ్య, మరాఠీ లాఠీ దెబ్బలతో దినదిన గండంగా అయిదురోజులు వెళ్ళబుచ్చామని చంద్రబాబు కన్నీళ్ళ పర్యంతం అయ్యారు.
ఒక్కసారి లాఠీ ఝలిపించేటప్పటికే, వాతలు తేలిన వీపు చూపిస్తు ఒక నేత, స్పృహ తప్పిన మరో మహిళా నేత, కన్నీళ్ళు తుడుచుకుంటూ వాళ్ళ నాయకుడు.... ప్రజా ఉద్యమంలో లోతుపాతులు చవిచూడటం మంచి పరిణామమే కదా!
అధికారంలో ఉన్నప్పుడు, స్త్రీలని, విద్యార్ధులని, బడుగు రైతులనీ లేకుండా అనేకానేక ఉద్యమాలను ఆయనే ఎలా అణచివేసారో కూడా ఆ అయిదు రోజుల్లో ఒక్కసారైనా ఆయనకు గుర్తుకొచ్చి ఉంటుందనే ఆశిస్తాను. అరకొర ఏంటి, అసలు వసతులే లేని ఆంధ్ర లాకప్పుల్లో ఎంతమంది మగ్గిపోతున్నారో కూడా ఆయనకు ఓ అంచనా వచ్చి ఉంటుందనే ఆశిస్తాను.
ప్రజా ఉద్యమాల లోటుపాట్లు బానే అర్ధం చేసుకున్న కాంగ్రెసీయులకు, ఎలాగూ తమ పీఠాల కింద పదవీ పీఠాలు కాపాడుకోటానికే తీరిక లేదు కాబట్టి, ఇలాంటి రాజకీయ ఉద్యమాలు నడిపే తీరిక మాత్రం ఇంకెక్కడిది? కాబట్టి కాంగ్రెస్ నేతలు బతికి బట్ట కట్టేసినట్లే.
చంద్రబాబు రాజకీయ పాచిక ఈ తెలంగాణా ఉప ఎన్నికల్లో పారిందో, వచ్చే ఎన్నికలకు తెలుగు తమ్ముళ్ళు తమ వీపులు రెడీ చేసుకోవాల్సిందే. కర్ణాటక, తమిళ్నాడు పోలీసు లాఠీలకు కూడా త్వరలోనే బోల్డు పని దొరకబోతుంది.
మనం ఎన్నుకున్న ప్రభుత్వపు విధానాలు మనకు నచ్చనప్పుడు, వ్యతిరేకత ఎలా ప్రకటించాలి? అందులోనూ, మన కనీస అవసరాలకు, అవకాశాలకు ప్రభుత్వమే గండి కొడుతున్నప్పుడు ఏం చేయాలి?
కలెక్టరుకో, మరో అధికారికో వినతి పత్రాలు సమర్పిస్తాం. అవి బుట్టదాఖలౌతుంటే, కోర్టులో కేసులు వేస్తాం. కోర్టుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరిగే ఓపిక లేకపోతే, మూకుమ్మడిగా ఆందోళన చేస్తాం. దాదాపు 30 గ్రామాల ప్రజలు చేసిందదే. పర్యవసానం, పాశవికంగా ప్రభుత్వం చేసిన బలప్రయోగానికి సోంపేటలో కొందరి దుర్మరణం.
తమ సిద్ధాంతాలను వ్యతిరేకించే ప్రభుత్వ అధికారులను, పోలీసులను కాల్చి చంపే నక్సలైట్లకు, తమ విధానాలను వ్యతిరేకించే ప్రజలను పోలీసు కాల్పులతో చంపేసే ప్రభుత్వానికి తేడా ఏమిటి? నక్సలైట్లనైతే సంఘవిద్రోహులుగా ప్రకటిస్తాం. మరి ప్రభుత్వాన్నేం చేయాలి? విచిత్రమేమిటంటే, ప్రభుత్వ విధానాలను విమర్శించిన వారినందరినీ నక్సలైట్లుగా ముద్రవేసి, ప్రగతి నిరోధక శక్తులుగా ప్రచారం చేస్తుంది ఈ ప్రభుత్వం.
గ్రామ స్వరాజ్యం సాధ్యపడినప్పుడే, దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని బోధించిన మహాత్ముని వారసులు, గ్రామ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా తెగబడటంలోని ఔచిత్యం ఏ ప్రజాస్వామిక విధాన స్ఫూర్తి?
కొన్నాళ్ళ క్రితమే, పర్యావరణ అనుమతులు అందించిన కేంద్ర పర్యావరణ శాఖ, ఈరోజు ఆ అనుమతులను వెనక్కు తీసుకున్నదని వార్తలు. అసలు, తప్పుడు సమాచారంతో పర్యావరణ అనుమతులు అధికారులు ఎలా సంపాదించారు? ఆయా అధికారులను ప్రభావితం చేసిన అంశాలేమిటి? ఇవేవీ ఇప్పుడు చర్చకు రావు. ప్రస్తుతానికి, ప్రజల గద్దింపులను సర్దిచేప్పే ప్రయత్నాలలో ఇదో భాగం మాత్రమే.
పార్టీల కతీతంగా ఆయా గ్రామాల ప్రజలు సోంపేటలో చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకం కావాలి. ప్రభుత్వాలని, తద్వారా దేశాన్ని ప్రభావితం చేయగల మధ్యతరగతి ప్రజలలో భావ చైతన్యం పెరగాలి. మునుపెవ్వరో ఏదో బ్లాగులో కామెంటు చేసినట్లు, రోజుకు 24 గంటల కరెంటుతో, 24 గంటల కేబుల్ టీవీ ప్రసారాలతో, రోజుకోసారి మునిసిపాలిటీ వారిచ్చే మంచినీటితో సంతృప్తి చెందే స్థాయి నుంచి దాటి, అభివృద్ధి పేరుతో ప్రభుత్వం మన కళ్ళకు కడుతున్న గంతలు తీసి నిజాలు నిర్ధారించుకునే స్థాయిలో విప్లవాత్మకమైన చైతన్య స్ఫూర్తి మనలో కలగాలి.
ఆ స్ఫూర్తే, మరిన్ని సోంపేటలు పునరావృతం కాకుండా ఆపగలుగుతుంది. ఆ స్ఫూర్తే అంతరాల భేషజాలు లేని ప్రజా ఐక్యతకు పునాదౌతుంది.
రచన ఒక వరంగా, వాక్య నిర్మాణం ఒక అద్బుత శిల్పంగా భావించే అరుదైన రచయితల్లో చిట్టిబాబు ఒకరు. పేరులోనే పెన్నిధి వున్న కథకుల్లో వీరిని చేర్చాలి. Author Chitti Babu మాటల్ని ఎక్కడ పొందికగా, మధురనిష్యందంగా ఉపయోగించాలో, ఎక్కడ పాఠకుల్ని తమ "గ్రిప్ "లోకి తెచ్చుకోవాలో తెలిసిన రచయితల్లో ఒకర్నిగా ఈయనను చెప్పాలి.
"ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు" చదువుతుంటే, నేను తిరుపతి ఈనాడులో పనిచేసిన రోజులు గుర్తుకువచ్చేవి. 88 చివర్లో తిరుపతి ఈనాడులో పి.ఎల్.ఎం.ఓ.గా (కంపోజింగ్ సెక్షన్) చేరాను. పదోతరగతి సెలవల నుంచి, గుమాస్తాగిరికి ఉపయోగపడుతుందనుకునే మధ్యతరగతి మనస్తత్వంలో భాగంగా, ఇంగ్లీషు, తెలుగు, హింది టైపు రైటింగు, షార్ట్ హాండు నేర్చుకోవటం మొదలేసా. డిగ్రీ అయిపొయిందే తడవుగా ఈనాడులో ఉద్యోగం రావటంతో మరేమీ ఆలోచించకుండా జాయిన్ ఐపోయాను. నిజానికి, కాలక్రమంలో ఓ జర్నలిస్టుగా స్థిరపడదామనే ఆలోచన కూడా ఈనాడులో చేరటానికి మరో ముఖ్య కారణం. రెండు సార్లు ఈనాడులో సబ్ ఎడిటర్ ఉద్యోగానికి గాను, వ్రాత పరీక్షలకు కూడా హాజరయ్యాను. అదృష్టం కొద్దీ పాస్ కాలేదు :)
నేను పని చేసిన దాదాపు ఏడెనిమిది నెలల్లో, ఈనాడులో నాకు నచ్చిన ఓ మంచి విషయం ఏదైనా ఉన్నదంటే, అది జీతం. బెత్తెడు జీతమే (స్టైఫండ్) అయినా ఠంచనుగా నెలాఖరుకల్లా వచ్చేది. ఆ రోజుల్లో, మా రూం మేట్లుగా ఉన్న ఆంధ్రజ్యోతి, ఉదయం పత్రికల ఉద్యోగులు మాత్రం నానా బాధలు పడేవారు జీతం సమయానికి రాక. బచావత్ ట్రిబ్యునల్ సిఫార్సుల ఆధారంగా జీతాలు ఇవ్వాళ పెరుగుతాయి, రేపు పెరుగుతాయి అనుకుంటూనే, దాదాపు ఓ అయిదేళ్ళు గడిచిపోయాక గానీ, ఈనాడులో జీతాలు పెరగలేదని చెప్పేవారు, ఆ తర్వాత నా జర్నలిస్టు స్నేహితులు.
జర్నలిస్టులు ఎలా పీడింపబడేవారో నాకైతే తెలియదు కానీ, మమ్మల్ని మాత్రం సబ్ ఎడిటర్లు పీల్చి పిప్పి చేసేవారు. అలానే, సీనియర్లు కూడా చెండుకు తినేవారు. కొత్తగా వచ్చామని మాకు డే షిఫ్టు ఉండేది, కంప్యూటర్ లో తెలుగు టైపు చేయటం నేర్చుకోటానికి వీలుగా. ఎందుకంటే, డే షిఫ్టులో ఎక్కువ పని కూడా ఉండేది కాదు, కాబట్టి ఆ సమయంలో మాకు మా షిఫ్టు ఇన్ ఛార్జి టైపు చేయటం, అలానే, ప్రకటనలు చేయటం నేర్పేవాడు. కానీ, చేరిన కొత్తలో ఓ రెండు వారాలు మినహా, మళ్ళీ ఏనాడు ఆ షిఫ్టులో పని చేయలేదు. సీనియర్లు అడ్జస్టుమెంట్లని వేధించేవారు. కుదరదంటే వాళ్ళ చాకిరి కూడా మా మీద రుద్దేవారు. మా షిఫ్టు ఇన్ ఛార్జి మాత్రం చాలా మంచివాడు. నాకు వ్యక్తిగతంగా కూడా సహాయం చేసేవాడు. అతని పేరు తాతబ్బాయి. తిరుపతికి కొత్త కావటంతో, మాకు అద్దె గది వెతుక్కోటంలో, వీక్లీ ఆఫ్ రోజు ఇంటికి పిలిచి మంచి భోజనం పెట్టటం చేసేవాడు. అలానే, ఓవర్ టైం చేయించి, కంపెన్సేటరీ సెలవలు కూడా ఇచ్చేవాడు. రెండో షిఫ్టు ఇన్ ఛార్జి (భీమారావు) అంటే అప్పట్లో ఎందుకో టెర్రర్ గా ఉండేది. మనిషి మాట తీరే కఠినంగా ఉంటుంది కానీ, మంచివాడే అని ఆ తర్వాత తెలిసింది.
ఇక ఈ సబ్ ఎడిటర్లు... ఈనాడులో సబ్ ఎడిటర్ అనేప్పటికి ఏవో కొమ్ములు మొలిచినట్లు, కంపోజింగ్ సెక్షనులో ఉన్న మేమేదో పనికిమాలినవాళ్ళమైనట్లు చూసేవారు. వారు వ్రాసి ఇచ్చే వార్తలు, నిజం చెప్పాలంటే నవ్వొచ్చేది. ఏదో వ్రాసుకుపోవటమే కానీ, స్పార్క్ ఏకోశానా కనిపించేవిధంగా ఉండేవి కాదు. స్థానిక వార్తలకు ప్రాధాన్యం ఇచ్చే ఉద్దేశ్యంతో మొదలైన జిల్లా ఎడిషనుల వల్ల, వార్తలలో పస తగ్గిపోయిందేమో అనిపించేది. మడకశిరలో మడత మంచాల పంపిణీ,.. అనంతపురంలో ఆత్మహత్య... కుళాయి తగాదాలో కన్నుమూత... ఇలా సాగేవి వార్తల శీర్షికలు. ఇక వీళ్ళ చేతివ్రాత చూస్తే కళ్ళు బైర్లు కమ్మేవి. ఎవరో ఒకరిద్దరు తప్ప, మరెవరి చేతివ్రాత అర్ధమయ్యేది కాదు. నమ్మండి, నమ్మకపోండి... నేను, రమణ బాబు అనే మరోతను కలిసి నాలుగు జిల్లా ఎడిషన్లు పూర్తిగా కంపోజ్ చేసేవాళ్ళం, పోటీ పడి మరీ. ఇక మమ్మల్ని రెచ్చగొడుతూ, సీనియర్లు వాళ్ళ పని కూడా మాకు పురమాయించేవాళ్ళు.
వ్యక్తిగతంగా, నేను నైట్ షిఫ్టు కోరుకునేవాడిని. ఎందుకంటే, ఆ సమయంలో సబ్ ఎడిటర్లతో కూర్చొని నేను కూడా వార్తలు వ్రాసే అవకాశం దొరికేది. అప్పట్లో విశ్వప్రసాద్ గారు చిత్తూరు డెస్కు ఇన్ ఛార్జిగా ఉండేవారు. వాళ్ళ డెస్కుకు పని తగ్గుతుందనేమో తెలియదు కానీ, ఆయన చాలా ప్రోత్సహించేవారు. అప్పటి ఓ విషయం నాకింకా గుర్తే. గాలి ముద్దుకృష్ణమ నాయుడు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి, కొన్నిపనులు ఎందుకు చేయలేకపోతున్నది (దాదాపుగా ఇదే అర్ధంలో) వివరణ ఇచ్చారు. రిపోర్టరు ఇచ్చిన ఆ వార్తకు "ముద్దు" మాటలు "గాలి"కే అనే శీర్షిక పెట్టి ఆ వార్తను ఎడిట్ చేసా. విశ్వప్రసాదుగారు నవ్వి, ఆ శీర్షిక తీసి, ఇంకోటి పెట్టారు.
మమ్మల్ని వేధించిన వాళ్ళలో మరో ముఖ్య వ్యక్తి అక్కడి పర్సనల్ మేనేజర్. పేరు సరిగా గుర్తులేదు... రాజేంద్రబాబు అనుకుంటా. కంప్యూటర్ సెక్షనులో ఏ.సి. ఉండేది. దాదాపు ఎనిమిది గంటలు కూర్చోవాలంటే ఇబ్బందిపడేవళ్ళం. మధ్యలో ఓ పది నిముషాలు బ్రేక్ తీసుకొని బయట జేబులో చేతులు పెట్టుకు నుంచుంటే... "ఏరా, జేబులో చేతులు పెట్టి XXXX పిసుక్కుంటున్నారు... ఇలాగైతే ప్రొబేషన్ పెంచేస్తా..." అని అరిచేవాడు. సగం ఈయన కూడా కారణమే, నేను ఈనాడు వదిలేసి వెళ్ళిపోటానికి. ఇక ఆ మేనేజరు... గోవిందరావో, గోపాలరావో ఉత్సవవిగ్రహంలా మాత్రమే ఉండేవాడు. అసలు ఆయన చేసే పనేంటో మాకు అర్ధం అయ్యేది కాదు. అంతా రాజేంద్రబాబు హవానే నడిచేది.
ఇంత చెప్పీ, రెడ్డెమ్మ మెస్ గురించి చెప్పకపోతే ఎలా? చాలా చౌకగా భోజనం పెట్టేది. ఈనాడు ఆఫీసు నుంచి, రైల్వే లైను దాకా నడుచుకుంటూ వచ్చి లైనుకు అవతల ఉన్న రెడ్డెమ్మ మెస్ లో భోజనం చేసేవాళ్ళం. కానీ, నాలాంటి వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే, శాఖాహారం, మాంసాహారం రెండు వండేది. అంతా ఒకేచోట కూర్చొని తినాల్సి వచ్చేది. తాగుబోతు భర్తని, ఆకతాయి మొదటి భార్య పిల్లవాడిని భరిస్తూ, ఎలా పని చేయాల్సి వస్తున్నదో నసుగుతూ వడ్డించేది.
ఇక, తెల్లవారుఝామున మూడు గంటలకు బయలుదేరి, లారీలు ఆపుకుంటూ తిరుపతి చేరేవాడిని. వదిలేసే ముందు రేణిగుంటకు మకాం మార్చాను. కంపోజింగ్ సెక్షనులో అప్పటి నా మిత్రులు వాసుదేవ రావు, లక్ష్మణ రావు, రమణ బాబు, దుర్గా ప్రసాద్, మురళీమోహన రావు, నాయుడు, కృష్ణమూర్తి.... ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో!
On April 2nd 2010 at 6 pm, my father, Sri.C.Subba Rao’s book, “Talks and Articles” was launched at the tastefully decorated Mini Conference Hall in the famous Ravindra Bharathi complex in Hyderabad. Prof.C.Subba Rao, former Chairman of the Council of Higher Education ,the Govt.of Andhra Pradesh, presided over the function. Prof I.V.Chalapathi Rao, former Registrar of the Central Institute of English and Foreign Languages and also Chief Editor of Triveni at present, was the distinguished Chief Guest, who launched the Book. Prof.S.S.Prabhakar Rao, former JNTU professor was the Guest of Honour. I had the privilege and good fortune of sharing the stage with these stalwarts as one of the speakers and as another Guest of Honour (I had written the Foreword for my father’s book). Of course, my father was on the stage immaculately dressed as usual on such formal occasions.
The meeting commenced with an invocation to Lord Ganesha rendered melodiously in the classical style bringing out all the devotional aura of the Sloka by my brother-in-law Sri.Chaitanya.Then came the launching of the book by Prof I.V.Chalapathi Rao.