చరిత్రపుటల్లో దారుణం, రక్తాక్షరాలతో లిఖించిన రాక్షసత్వం, తలదించుకున్న మానవత్వం...అంటూ తీవ్రవాదానికి బలైన పాకిస్తాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టోకు శ్రద్ధాంజలి ఘటిస్తూ చాలామంది పత్రికల్లో వ్యాసాలు వ్రాసారు. వార్తా ఛానల్సులోనూ కన్నీరు పెట్టారు.
ఒక నేత తీవ్రవాదుల ఘాతుకానికి బలైపోవటం బహుశా పాకిస్తాన్ లో మొదటిసంఘటన కావొచ్చు. కానీ, మన భారతావనికి ఇది కొత్తదేమీ కాదు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వీరందరూ తీవ్రవాదానికి బలైన నాయకులే. ఇంకా సామాన్యజనాల సంఖ్యకు లెఖ్ఖ లేదు.
అసలు ప్రపంచానికి తీవ్రవాదాన్ని పరిచయం చేసిన ఘనత పాకిస్తాన్ దే అన్నా ఎటువంటి అభ్యంతరాలు ఉండబోవు. దాదాపు నాలుగు దశబ్దాలుగా పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదానికి ఎన్ని లక్షలమంది దేశం నలుమూలలా బలయ్యారనేదానికి కూడా బహుశా లెక్కలు లేవు.
సరిహద్దుల్లో తీవ్రవాదానికి ఆద్యుడుగా జుల్ఫీకర్ అలీ భుట్టోను చెప్పుకోవచ్చు. 1965 దశకంలో అయ్యూబ్ ఖాన్ మంత్రివర్గంలో విదేశాంగశాఖ నిర్వహించిన భుట్టో 'ఆపరేషన్ జిబ్రాల్టర్' ద్వారా, శిక్షణ పొందిన తీవ్రవాదులను జమ్మూ కాశ్మీర్ లో చొరబాటు చేయించటం ద్వారా, భారత్ ను అల్లకల్లోలం చేయించే ప్రయత్నాలు మొదలేసాడు.ఆ పిమ్మట ప్రధానిగాను ఆయన చేసిన పని ఇదే. ఇదే వారసత్వాన్ని తదుపరి పాకిస్తాన్ పాలకులు కూడా కొనసాగించారుల. ఆఖరికి ఈరోజు తీవ్రవాదులను ఏరిపారేయాలనే ఆకాంక్షను వెలిబుచ్చిన బేనజీర్ కూడా, 1990 దశకంలో జమ్మూ కాశ్మీర్ తీవ్రవాదులకు వంతపాడినవారే!తిలా పాపం తల పిడికెడు. ఈ తీవ్రవాదాన్ని పెంచి పోషించినవాడే ప్రతి పాకిస్తాన్ పాలకుడు.
పెనుభూతమైన ఉగ్రవాదంపై అంతర్జాతీయ విరోధం ఎప్పుడు మొదలైందని ఆలోచించాలి. అమెరికాపై అల్ ఖాయిదా దాడి అనంతరం మాత్రమే, తీవ్రవాదుల ఘాతుకాలకు ప్రపంచం విస్తుపోయింది. అల్ ఖాయిదా నాయకుడు బిన్ లాడెన్ కు అమెరికా ఒకప్పుడు ఎటువంటి మద్దతు ప్రకటించిందనేది కూడా విడమరచి చెప్పాల్సిన పని ఉండదు.
తాము పెంచి పోషించిన విషసర్పాల కాటుకే ఈ నేతలు బలైనారనేది యధార్ధం! మరెందరో నేతలు బలౌతారనేది కూడా నిశ్చయం. తమ సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం, ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన ఈ నేతలు, తీవ్రవాదుల ఘాతుకాలకు బలైన సామాన్యులకు జవాబుదారీ కాదా!శ్రద్ధాంజలి ఘటించడం తప్పు కాదు. కానీ, ఆ సమయంలో, ఈ మరణించిన నేతల కుటిల రాజకీయాలవల్ల పెనుభూతమైన తీవ్రవాదానికి బలైన సామాన్యులనోసారి గుర్తుతెచ్చుకోమ్మని మనవి.
SRANDDANJALI... NO NEED. SHE WONT DESERVE IT.. PARTICULARLY FROM INDIA.
ReplyDelete