వస్తావని తెలుసు.
ఎప్పుడు వస్తావో తెలియదు.
నిముషాలని, గంటలని దాటుకుంటూ
వస్తూనే వెళ్ళిపోయావ్
క్షణకాలపు నీ స్పర్శతో
కాలం ఎంత ఇరుకో తెలిసింది.
ఆనందం వెళుతూనే, దుఃఖం తోసుకొచ్చింది.
జ్ఞాపకాల బరువుకు కన్నీరు భారమా?
శూన్యం నుంచి శూన్యంలోకే
నా ప్రయాణం కూడా.
వీలైతే మళ్ళీ కలుద్దాం.
No comments:
Post a Comment
మీ అభిప్రాయం :