Friday, July 6, 2007

09 - స్తబ్దత

నావైపే చూసుకుంటున్నా
అద్దంలో నా పాత్రకు
మొదటి ప్రేక్షకుడిని
కాలేకపోతున్నా

ఎదుగుతున్న భ్రమల మధ్య
మబ్బు తునకలా
నేల మీది నా నీడ కోసం
వెతుక్కుంటూనే ఉన్నా

చీకటి రొదలో
మలుపులు తిరిగే నదీ ప్రవాహంలా
చూపుల ఎడారిలో
కన్నీటి చుక్క

రాల్చిన పూలు
చాలనుకుందేమో
స్తబ్దంగా గాలి.

No comments:

Post a Comment

మీ అభిప్రాయం :