Friday, July 6, 2007

07 - తొలి ఆనవాలు

వణుకుతున్న దీపాలు
మోసుకుంటూ
వర్షంలో తడుస్తున్న
వెన్నెల దారిలో నేను

గుండెలోకి
ఎగదోసిన గాలి
వేడి నిట్టూర్పులా
నా వెంటే

ఇంకా ఒంటరినేనా?

వికసించే అనుభూతులు
విలీనమయ్యే సాగరద్వారాలు
తెరుచుకుంటున్న శబ్దం
అద్భుత ప్రపంచపు

తొలి ఆనవాలును పలకరిస్తూ
నేను వేసిన తొలికేక
అమ్మా !!

No comments:

Post a Comment

మీ అభిప్రాయం :