కాలప్రవాహంలో
జ్ఞాపకాల అలలు
స్థాణువై నిలచిన
అంతరంగ దృశ్యాన్ని
చిత్రించుకుంటూ ...
గమ్యమెటో తేల్చుకోని
అంతఃస్థితిలో
మంచుశిథిలాల మధ్య
మూగబోయిన మానులా ...
పరవళ్ళు తొక్కుతున్న
నిశ్శబ్దనదిపై
చీకటివంతెనలా
నిట్టూరుస్తూ ...
నన్నిలాగే ఉండని
నా మెలకువను నిద్రపుచ్చి
నీ గుండె చప్పుళ్ళను
ముక్కలు చేయకు.
mi metaphysical n surrealistic poetry, anubhuthi tho rangarinchi hrudaya bharalanu, antharaalalo tholachi vesthu... baagunnayi...abhinandanalatho...
ReplyDelete