Friday, July 6, 2007

08 - స్తన్యం

పునరావృతమయ్యే
ప్రతి కేకలో
తోడెవరన్న ఆందోళన
ఒక ఏడుపులా

ఆందోళనను తుంచేస్తూ
అయాచితంగా
అందిన వరం
పెదవులకంటిన తడి.

ఇరుకు గదిలో
అమ్మ కప్పిన అప్యాయత
మౌనాన్ని కరిగిస్తూ
లాలిపాటగా ..

రెప్పల కింద
రంగులద్దుకుంటున్న
ఊహా చిత్రం
ఆకాశంలా ... అమ్మలా ...

ఒంటరి గుండెలో
అమ్మను ఒంపుకుంటూ
నిద్రిస్తూ నేను.

1 comment:

మీ అభిప్రాయం :